విరాట్ కొహ్లీ అర్జున్ రెడ్డి క్యారెక్ట‌ర్స్‌కి మ‌ధ్య పోలిక‌లు

256
Arjun Reddy Dialogues,Compparison between Arjun Reddy and Virat Kohli

విరాట్ కోహ్లీ అర్జున్ రెడ్డి క్యారెక్ట‌ర్స్‌కి మ‌ధ్య చాలా పోలిక‌లు ఉన్నాయి. ఇద్ద‌రికీ యాంగ‌ర్‌మేనేజ్‌మెంట్‌లో ఇష్యూస్ ఉంటాయి. ఇద్ద‌రూ ల‌వ్ స్టోరీలో స‌క్సెస్ అయ్యారు. కానీ విరాట్ కోపం అంతా ఫీల్డ్స్ లోనే. బ‌య‌టికి వ‌స్తే విరాట్ చాలా కూల్‌. ఇలా ఎన్నో పోలిక‌లు ఉన్నాయి. కొన్ని చూద్దాం.

  సేవ్ ది బేబీ
కొంత కాలం క్రితం విరాట్ బ్యాటింగ్ లో విఫ‌యం అయినప్పుడు చాలా మంది అనుష్క శ‌ర్మ‌ను విమ‌ర్శించారు. విరాట్ ఫెయిల్యూర్‌కి అనుష్క‌కార‌ణం అని దుమ్మెత్తి పోశారు.

ఇక్క‌డ విరాట్ రిప్లై చాలా మందికి ఒక పాఠంగా మారింది.


ఆట‌లో నా వైఫ‌ల్యానికి అనుష్క కార‌ణం కాదు. త‌ను న‌న్నుప్రేరేపించే వ్య‌క్తి ఆమె. అనుష్క ప్రోత్సాహం నాలో కొత్త శ‌క్తిని నింపుతుంది అని ఫ్యాన్స్‌కు రిప్లై ఇచ్చాడు. ఇలా త‌న ప్రేయ‌సిని కాపాడ‌టానికి ప్ర‌య‌త్నించాడు విరాట్‌.

 


ఇదే విష‌యంలో అర్జున్ రెడ్డి పాత్ర‌తో కంపేర్ చేస్తే .. హోలీ పండ‌గ‌రోజు అమిత్ ప్రీతికి రంగు పూసిన‌ప్పుడు స్త్రీ గౌర‌వానికి భంగం క‌ల‌గ‌డం అంటే పురుషుని గౌర‌వానికి భంగం క‌లిగిన‌ట్టే ఫీల్ అవుతాడు. అందుకే వెంట‌నే అమిత్‌లో క‌ల‌వ‌డానికి వెళ్తాడు. ముందు కోపం తీర్చుకున్నా.. త‌ర్వాత త‌ను కాలేజ్ నుంచి వెళ్లిపోయాక ప్రీతి సేఫ్టీ విష‌యంలో అమిత్ ను క‌న్విన్స్ చేయ‌గ‌లుగుతాడు.
ఆ సీన్ క‌న్నా ముందే కాలేజ్ రాగింగ్‌లో ప్రీతి కంగారు ప‌డ‌కుండా కాపాడుతాడు అర్జున్ రెడ్డి.

2. గ్రౌండ్‌లో

Advertisement

అర్జున్ రెడ్డికీ విరాట్ కోహ్లీకి గ్రౌండ్‌లో సేమ్ అగ్రెష‌న్ ఉంటుంది. కోపం వ‌స్తే దేత్త‌డే. అర్జున్ రెడ్డికి అమిత్ చాలెంజ్ చేస్తే.. రేయ్ అమిత్‌.. అని సిగ్న‌ల్ ఇస్తాడు. త‌ర్వాత గోల్ ఆపుతాడు. కోహ్లీ కూడా గ్రౌండ్‌లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాడితో వాగ్వివాదం జ‌రిగితే ప్ర‌శాంతంగా త‌న బ్యాట్‌తో ప‌ని చెబుతాడు.

ఇలా కోహ్లీకి అర్జున్ రెడ్డికి చాలా పోలిక‌లు ఉంటాయి. మీక్కూడా ఏమైనా సిమిలారిటీస్ అనిపిస్తే కామెంట్ చేయండి.

Advertisement