కామ‌న్‌మెన్ జెంటిల్మెన్‌, మెంటల్మెన్‌లా ప్ర‌వ‌ర్తించే సంద‌ర్భాలు

120
difference between a common man and a rogue
ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూడలేము. కానీ ఒకే మ‌నిషిలో రెండు వ్య‌క్తిత్వాలు చూడ‌గ‌లం. అప‌రిచితుడు సినిమాలో రాము క్యారెర్ట‌ర్ కి ఉన్న split personality గురించి కాదు నేను మాట్లాడేది. మ‌నకు సుప‌రిచిత‌మైన మ‌న గురించి, ద‌గ్గ‌రివాళ్ల గురించి . కామ‌న్‌మేన్ గురించి.
నిజ జీవితంలో ఒక కామ‌న్‌మేన్ ఒక‌సారి జెంటిల్మెన్‌లా , మ‌రోసారి మెంట‌ల్‌మేన్ ప్ర‌వ‌ర్తిస్తాడు. అలాంటి కొన్ని సంద‌ర్భాలు ఇవే…

 

1. బండికి డ్యాష్ ఇచ్చిన‌ప్పుడు

సీన్ 1
స‌పోస్ దారిలో వెళ్తున్న‌ప్పుడు కామ‌న్ మ్యాన్ బైక్‌ను ఎవడైనా డ్యాష్ ఇస్తే.. అప్పుడు ముందు బ‌య‌టికి వ‌చ్చేది మెంట‌ల్‌మేన్ . గోడ‌వకి దిగుతాడు. అరుపులు, అమ్మ‌నా బూతులు, చివిరికి పిడికిలి బిగించే దాకా వెళ్లిపోతాడు.

సీన్ 2
ఇప్పుడు కామ‌న్ మ్యాన్ రోడ్డుపైన వెళ్తున్నాడు… అత‌ని బైక్‌కి ఒక‌మ్మాయి డ్యాష్ ఇచ్చింది. ముందు బండి సైడ్ స్టాండ్ వేసి ఆ అమ్మాయికి ఏమ‌న్నా అయిందా అని చూస్తాడు. ఆ అమ్మాయి ప‌డిపోతే చేయిచ్చి పైకి లేపి.. మీకేం దెబ్బ‌లు త‌గ‌ల్లేవు క‌దా అని అడుగుతాడు. నైస్‌గా. ఇత‌ను జెంటిల్మెన్‌.
Advertisement

 

2. దోస్త‌ల‌కు డోర్ తెర్వ‌డు
సీన్ 1
బ‌య‌టికి వెళ్లినప్పుడు అమ్మాయిల‌తో ఉంటే కామ‌న్ మ్యాన్ త‌నే డోర్ తెరుస్తాడు. ముందు మీరు వెళ్లండి అంటాడు. ముందు మీరు కూర్చోండి అంటాడు. మీరే అర్డ‌ర్ ఇవ్వండి అంటాడు. చివ‌రికి బిల్లు కూడా త‌నే క‌డ‌తాడు. ఇలా కామ‌న్‌మెన్ జెంటిల్మెన్‌లా ప్ర‌వ‌ర్తిస్తాడు.
సీన్ 2
అదే కామ‌న్ మ్యాన్ త‌న ఫ్రెండ్స్‌తో బ‌య‌టికి వెళ్లాడ‌నుకొండి. డోర్ తీస్తాడంటారా.. సచ్చినా తీయ‌డు. తీసినా.. వెంట‌నే వ‌దిలేస్తాడు. ముందు అత‌నే వెళ్తాడు. మంచి సీట్లో కూర్చుంటాడు. ఇష్టం వ‌చ్చింది ఆర్డ‌ర్ ఇస్తాడు. బిల్లు క‌ట్టే టైమ్‌కి ఫోన్ మాట్లాడి వ‌స్తా అని వెళ్లి.. బిల్లు క‌ట్టార‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేసుకుని ద వస్తాడు. వ‌చ్చీ రాగానే.. అరే.. బిల్ క‌ట్టేశారా.. నేను క‌డ‌దాం అనుకున్నా అంటారు. అలా జెంటిల్మెన్ మెంటిల్మెన్‌లా మారిపోతాడు.

 

3. కోపం వ‌స్తే
సీన్ 1
ఒక ప‌బ్లిక్ ప్లేస్‌లో జీవిత భాగస్వామి లేదా ప‌రిమిత భాగ‌స్వామీ ( డేటింగ్ గాళ్ ) తో వెళ్లిన‌ప్పుడు జెంటిల్మెన్ చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాడు. ఎవ‌రైనా త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించినా.. కామెంట్స్ చేసినా… పెద్ద సీన్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు. ముందు ఆమ్మాయిని సేఫ్ ప్లేస్‌లో డ్రాప్ చేసి.. త‌ర్వాత కామెంట్ చేసిన వాడిని హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేస్తాడు.
సీన్ 2
ఇదే సీన్‌లో కామన్‌మెన్‌లో మెంటిల్మెన్ యాక్టివేట్ అయితే .. నా పోరిని కామెంట్ చేస్త‌వారా అని గొడ‌వ‌కి దిగుతాడు అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియ‌క భ‌యంతో అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. అక్క‌డ అమ్మాయి పోయే… పరువు పోయే, ఫేస్‌క‌ట్ మారిపోయే.
కోపం, భ‌యం, ఆవేశం…ఇవి తాత్కాలికం అని తెలుసుకున్న‌వాడే జెంటిల్మెన్‌. వాటికి లొంగిపోయేటోడే మెంటల్మెన్‌.

 

4. క‌క్కుర్తి
సీన్ 1
ఒక తిండిపోతు కామన్‌మేన్‌ ఒక దావ‌త్ ( ఫంక్ష‌న్‌) కి వెళ్తే న‌లుగురు ఉన్న‌ప్పుడు జెంటిల్మెన్‌లా ప్ర‌వ‌ర్తిస్తాడు. అంటే ప్లేట్‌లో ఎక్క‌వు ఆహార ప‌దార్థాలు పెట్టుకోకుండా… ఒక‌టి రెండు పెట్టుకుని.. డీసెంట్‌గా తింటాడు.
సీన్ 2
అదే చుట్టుప‌క్క‌ల త‌న వాళ్లు ఎవ‌రూ లేరూ అని తెలిస్తే ఇదే కామ‌న్‌మేన్ మెంటిల్మెన్‌లా ప్ర‌వ‌ర్తిస్తాడు. ప్లేట్ మొత్తం ర‌క‌ర‌కాలు ఫుడ్ ఐటెమ్స్‌తో నిండిపోతుంది. ఎవ‌రూ త‌న‌ను గ‌మ‌నించ‌కూడ‌దూ అనుకుంటూనే అంద‌రి దృష్టిలో ప‌డ‌తాడు.

 

5. ఎగ్జామ్ సెంట‌ర్‌లో
సీన్ 1
కామ‌న్‌మేన్ ఒక ఎంట్ర‌న్స్ టెస్ట్ రాయ‌డానికి కూర్చున్నాడు. త‌న‌కు తెలిసిన ప్ర‌శ్న రావ‌డంతో సంతోషంతో అటు ఇటూ చూస్తున్నాడు. ఇది చూసిన ప‌క్క‌నే ఉన్న ఇంకో స్టూడెంట్ అన్నా కొంచెం ఆన్స‌ర్ చూపించ‌వా అన‌డిగాడు. వెంట‌నే పోబ్బే నీ ప‌ని నువ్వు చూసుకో.. అని గ‌ట్టిగా స‌మాధానం చెప్పి నెక్ట్స్ క్వ‌శ్చ‌న్‌కి వెళ్లిపోయాడు.
కామ‌న్ మెన్ అప్పుడు మెంట‌ల్మెన్ అయ్యాడు…
సీన్ 2
ఇదే సీన్‌లో ప‌క్క‌న స్టూడెంట్ అమ్మాయి అయితే మ‌న కామ‌న్‌మేన్ జెంటిల్మెన్ అవుతాడు. మొత్తం ఆన్స‌ర్ షీట్ ఆమె పాదాల ద‌గ్గ‌ర ప‌డేస్తాడు.చాలా నా హాల్ టికెట్ కావాలా అన్న‌ట్టు చూస్తాడు. కావాలంటే నా ఆస్తి పేప‌ర్లు ఇస్తా.. ర‌ఫ్ పేప‌ర్‌లాగా వాడుకో అని పొంగిపోత‌డు. నౌ,, దిస్ ఈజ్ ది జెంటిల్మెన్‌.
ఇలా జీవితంలో ఒకే మ‌నిషి రెండు పాత్ర‌ల్లో క‌నిపించాల్సి వ‌స్తుంది. ఇది త‌ప్పు అని నిర్ణ‌యించడం కూడా త‌ప్పే. స‌మ‌యం సంద‌ర్భాన్ని బ‌ట్టి మనిషి వ్య‌క్విత్వంలో మార్పు వ‌స్తుంది. కానీ మంచి వ్య‌క్తిత్వం సంపాదించాలి అనుకుంటే ముందు మంచి ఆలోచ‌న విధానాన్ని డెవలెప్ చేసుకోవాలి. అప్పుడు జెంటిల్మెన్‌, మెంటిల్మెన్ మ‌ధ్య‌లో పోటీ ఉండ‌దు.
 కామ‌న్‌మెన్ స‌రిపోతాడు.
Advertisement