రియ‌ల్ లైఫ్ మోగ్లీ అండ్ కొండముచ్చుల స్నేహం. వీళ్ల‌ క‌థ మ‌ధురం

140
friendship between bunch of langoors and toddlers isamazingfriendship between bunch of langoors and toddlers isamazing

మీకో క‌థ చెబుతాను. జంగిల్ బుక్ లాంటి క‌థ. మోగ్లీ లాంటి పిల్లాడిని ప‌రియం చేస్తాను. అండ్ ఇది క‌థ కాదు . నిజం. ఆ నిజాన్ని ప‌రిచయం చేస్తాను.

క‌ర్ణాట‌క‌లోని అల్లాపూర్‌లో రెండేళ్ల స‌మ‌ర్త్ బంగారీ ఇప్పుడు రియ‌ల్ లైఫ్ మోగ్లీ అయ్యాడు. ఆ ఊరిలోనే కాదు, ఇప్పుడు చాలా మందికి హీరోలా క‌నిపిస్తున్నాడు. దీనికి కార‌ణం.. కొండ‌ముచ్చు గ్యాంగ్‌తో ఈ మోగ్లీకి ఉన్న స్నేహం. అండ్ అత‌ని గ్యాంగ్ చాలా పెద్ద‌ది. వీళ్ల స్నేహం విచిత్ర‌మైన‌ది.

Photo Courtesy : AFP PHOTO / Manjunath KIRAN

కొండ‌ముచ్చులు స‌మ‌ర్త్ మ‌ధ్య స్నేహం ఎలా కుద‌రిందో చాలా మందికి అర్థం కావ‌డం లేదు. కొండు ముచ్చుల ప్ర‌వ‌ర్త‌న కొంచెం వైలెంట్‌గా ఉంటుంది. అండ్ అవి చాలా చంచ‌ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి. అలాంటప్పుడు రెండేళ్ల బాలుడితో అవి స‌ర‌దాగా ఉండ‌టం. ఆడుకోవ‌డం.. అత‌నితో ప‌ళ్లు షేర్ చేసుకోవ‌డం ఇవ‌న్నీ ఎవ‌రు ఊహిస్తారు. దానికి కార‌ణం ఎవ‌రు చెప్ప‌లేరు.

స‌మ‌ర్త్ తండ్రి బ‌రామా రెడ్డి కూడా ఇదే విషయాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడ‌ట‌. గ్రామ‌స్థులేమో పిల్లాడికేమైనా జ‌రుగుతుందేమో అని భ‌య‌ప‌డుతోంటే.. బ‌రామా రెడ్డి మాత్రం.. అలా ఏమీ అనిపించ‌ట్లేదు. అవి పిల్లాడికి హానీ చేయ‌వు అని తెలిపాడు.

కొండ‌ముచ్చులతో ఉన్న‌ప్పుడు స‌మ‌ర్త్ చాలా సంతోషంగాఉంటున్నాడ‌ని..అండ్ త‌న‌కు ఇచ్చిన బిస్కెట్స్‌, ఇతర ఆహ‌ర ప‌దార్థాల‌ను వాటితో్ పంచుకుంటున్నాడ‌ని తెలిపాడు.

 

Photo Courtesy : AFP PHOTO / Manjunath KIRAN

ఈ లంగూర్స్‌కి స‌మ‌ర్త్ మ‌ధ్య స్నేహం ఒక విచిత్రం అనుకోవాలా.. లేదా స్నేహానికి కొత్త నిర్వ‌చనం దొరికింది అనుకోవాలా ? లేదా స్నేహానికి నిర్వ‌చ‌నం చెప్ప‌డం కన్నా అందులోని మాధుర్యాన్ని ఎంజాయ్ చేయాల‌ని అనుకోవాలా ? ఎలా అనుకున్నా.. స్నేహం విలువ స్నేహితుల‌కే తెలుస్తుంది.

వీళ్ల స్నేహం ఎంత మ‌ధుర‌మైన బంధంగా మారింది అంటే .. ఇప్పుడు స‌మ‌ర్త్ ను చూడ‌కుండా.. అత‌నితో ఆడుకోకుండా ఈ మూగ‌మ‌న‌సులు ఉండ‌లేక‌పోతున్నాయ‌ట‌. ప్ర‌తీ రోజు అత‌డితో ఆడుకోవ‌డానికి వ‌స్తున్న‌య‌ట‌. మ‌న‌మ‌న్నా వారానికి ఒక‌టి రెండు రోజులు మ‌న స్నేహితుల‌తో దూరంగా ఉంటాం. ఏదో వ‌ర్క్ ఉంటుంది కదా. కానీ ఈ కొండ‌ముచ్చుల గ్యాంగ్ మాత్రం ప్ర‌తీ రోజు అడ్డాకి చేరుకుంటాయి అంటా. ఒక వేళ స‌మ‌ర్త్ ప‌డుకుంటే.. లేపి మ‌రీ గంటా రెండు గంట‌లు ఆడుకుంటాయి అంటా. ఫ్రెండ్‌షిప్!!

బెస్ట్ ఫ్రెండ్స్ మ‌ధ్య‌లో ఎవ‌రైనా వ‌స్తే..
ఏం చేస్తాం.. దేత్త‌డి పోష‌మ్మ గుడి అంతే.. ఈ కొండ‌ముచ్చుల‌ది కూడా అదే కాన్సెప్ట్‌. వీళ్ల గ్యాంగ్‌తో ప‌రిచ‌యం చేసుకోవ‌డానికి ఒక కుర్రాడు ప్ర‌య‌త్నిస్తే..గుర్రు గుర్ర‌మ‌ని చూసి పంపించేశాయ‌ట‌.
గ్రేట్ స్టోరీ క‌థ‌.

బాస్, ప్ర‌తీ ఫ్రెండు అవ‌స‌ర‌మేగా

 

Advertisement

 

Advertisement