అలూ బుఖారా తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు. అందంగా క‌నిపించాలి అనుకునేవాళ్లు త‌ప్ప‌క చ‌ద‌వండి

118
Healthy Benefits of Aloo bukhara or plums

అలూ బుఖారా మ‌న దేశంలో విరివిగా ల‌భించే ప‌ళ్లు. కానీ చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. దీనికి కారణం దీని టేస్ట్ కొంచెం డిఫ‌రెంట్‌గా ఉంటుంది. కానీ తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు. ముఖ్యంగా అందంగా క‌నిపించాలి అనుకునేవాళ్ల‌కు ఇది అమృతం లాంటిది.

అర‌డ‌జ‌ను లాభాలు
1. ఈ పండ్ల‌లో ఉంటే విటమిన్ ‘ఇ’, బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయిట‌.
2.దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.

3. కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. అలాంటి వారు ఆల్ బుకారా పండ్లను తీసుకోవడం ద్వారా పెదవుల అందాన్ని మెరుగుపరుస్తుంది.

4. దీంతోపాటు ఆల్ బుకారా తొక్కతో పెదవులను కొన్ని రోజులు మ‌ర్ధ‌న చేసుకుంటే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి.

Healthy Benefits of Aloo bukhara or plums

5. మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే అఆల్ బుకారాను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.
6. దాంతో పాటు జీర్ణ‌శ‌క్తిని లైన్‌లో పెడుతుంది. క్యాన్స్ కార‌ణ క‌ణాలతో పోరాడేశ‌క్తిని ఇస్తుంది.ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ పెంచుతుంది.డ‌యాబెటీస్ పేషెంట్స్‌కి చాలా ఉప‌యోగ‌క‌రం. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

 

Advertisement