2017లో Online Food Orders స్ పై 10 ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు.

145
indias online food ordering facts

బ్యాచిల‌ర్స్ కి రాత్రి కాగానే ఆకలి రాజ్యం మొద‌లైత‌ది. ఎంత తిన్నా నిండ‌ని క‌డుపుల‌వి. అందుకే యాప్‌లు తీసి ఏదోటి ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి ప‌ని కానిచ్చేస్తున్నారు. అలా భార‌తీయుల ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ‌ర్స్‌పై 2017కి సంబంధించిని టేస్టీ విష‌యాలు.

1. ఇప్ప‌టికీ భార‌తీయులు స్వదేశీ ఆహార‌ప‌దార్ధాల అర్డ‌ర్ చేయ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు.

2. అఫ్‌కోర్స్ 2017 ఎక్కువ మంది ఆర్డ‌ర్ చేసిన ఫుడ్‌.. బిర్యానీ

3. అన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతికిన ఆహార ప‌దార్ధాల విష‌యానికి వ‌స్తే..ఐదుల‌క్ష‌ల మంది పీజ్జా గురించి స‌ర్చ్ చేయ‌డంతో టాప్‌లో నిలిచింది.

4. డిసెంబ‌ర్ 3న ఎప్పుడూ లేనంతగా ఎక్కువ సంఖ్య‌లో స్విగ్గీ నుంచి ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేశారంట‌

5. మే, జూన్‌, జులైలో జ్యూస్‌లు, డ్రింక్స్ ఆర్డ‌ర్ చేసే వారి సంఖ్య 40 శాతం పెరిగింది అంట‌. అంటే స‌మ్మ‌ర్ క‌దా..

6. బ్రేక్ ఫాస్ట్ విష‌యానికి వ‌స్తే ఎక్కువ‌ మ‌ది మ‌సాలా దోశ‌, ఇడ్లి, వ‌డ ఆర్డ‌ర్ చేశారట‌. ఉద‌యం 9.30కి ఎక్కువ ఆర్డ‌ర్ వస్తుంటాయ‌ట‌.

7. అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఆర్డ‌ర్స్ విష‌యానికి వ‌స్తే హైద‌రాబాద్ టాప్‌లో ఉంది. త‌ర్వాత బెంగుళూరు, డిల్లీ

8 చైనీస్ ఫుడ్ ఆర్డ‌ర్ చేయ‌డంలో కూడా హైద‌రాబాద్ టాప్‌లో ఉంది

9. హైద‌రాబాద్ లో 20 ర‌కాలు బిర్యానీలు ల‌భిస్తాయి. వీటికి రంజాన్, దీపావ‌ళి స‌మ‌యంలో ఎక్క‌డ లేనీ గిరాకీ ఉంటుంద‌ట‌.

10. పురుషులు కారంగా ఉండే ఫుడ్ ఆర్డ‌ర్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తే.. మ‌హిళ‌లు గులాబ్ జామున్ లాంటి స్వీట్స్ అండ్ డెజ‌ర్ట్స్ ఆర్డ‌ర్ ఇవ్వ‌డానికి ఆసక్త చూపిస్తున్నార‌ట‌.

Advertisement