కాళ పోస్ట‌ర్‌లో శున‌కానికి 2 కోట్లు పెట్ట‌డానికి రెడీ అవుతున్న సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌.

156
kaala dog cost 2 crores

సూప‌ర‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి జ‌పాన్ వాసుల‌ను అడిగినా చెబుతారు. డాన్సింగ్ మ‌హ‌రాజాగా ర‌జ‌నీ అక్క‌డ బాగా ఫేమ‌స్‌. అక్క‌డే కాదు.. ర‌జనీ కాంత్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయ‌న‌తో క‌ల‌వ‌డానికి వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌డానికే కాదు…ఆయ‌న సినిమాలోని వ‌స్తువుల‌ను సొంతం చేసుకోవ‌డానికి కోట్లాది రుపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డానికి కూడా వెన‌కాడరు. అలాంటిది కాళ సినిమాలో ర‌జ‌నీ కాంత్ ప‌క్క‌నే ఉన్న కుక్క‌ని సొంతం చేసుకొనే అవ‌కాశం వ‌దులుకుంటారా ?. నో ఛాన్స్‌. ఈ కుక్క‌ని సొంతం చేసుకోవ‌డానికి అభిమానులు రూ.2 కోట్లు కూడా చెల్లించ‌డానికి సిద్ధం అయ్యారు.

 

కాళ పోస్ట‌ర్‌లో రాజు ప‌క్క‌న సింహంగా ఈ గ్రామ సింహం అద‌ర‌గొట్టింది. అయితే ఈ కుక్క‌ని ఎంచుకోవ‌డానికి కాళ టీమ్ మొత్తం ముప్పై కుక్క‌ల‌ని ఆడిష‌న్ చేసిందంట‌. చివ‌రికి మ‌ణి అనే ఈ శున‌కాన్ని ఎంపిక చేశారు. మ‌ణిని సొంతం చేసుకోవ‌డానికి వివిధ దేశాల నుంచి ఫ్యాన్స్ పోటీ ప‌డుతున్నార‌ట‌. ముఖ్యంగా మ‌లేషియాకు చెందిన ఒక ఫ్యాన్ రూ.2 కోట్లు ఇవ్వ‌డానికి కూడా సిద్ధం అయ్యాడ‌ట‌. అయితే మ‌ణిని అమ్మ‌డానికి మాత్రం ట్రైన‌ర్ సిద్ధంగా లేడ‌ట‌. సొంత బిడ్డ‌లా పెంచిన మ‌ణిని అమ్మ‌లేని చెబుతున్నాడు.

Advertisement

వెల్‌, కుక్క‌ల్ని పెంచి మంచి రేటు వ‌స్తే అమ్మేసే వ్యాపారం బాగా ఊపుగా ఉన్న ఈ రోజుల్లో మ‌ణికి సైమ‌న్ లాంటి ట్రైన‌ర్ దొర‌క‌డం అదృష్ట‌మేక‌దా…

Advertisement