NewYear2018: HYDలో గట్టిగ పార్టీ చేసుకోవ‌డానికి పార్టీ దేవాల‌యాలు

108
New Year Party Destinations in Hyderbad

హైద‌రాబాద్ అంటే సంతోషానికి కేరాఫ్ అడ్రెస్. ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు ఇక్క‌డ‌ ఆనందంగా జీవితాన్ని గ‌డిపే అవ‌కాశం ఉంటుంది. 2017కు గుడ్ బాయ్ చెప్పి 2018కి స్వాగతం చెప్ప‌డానికి మ‌నం ఇప్పుటికే మాన‌సికంగా రెడీ అయిపోయాం. అయితే చ‌ట్టిరీత్యా కొన్ని ఆంక్ష‌లు ఉండ‌టంతో ఎక్క‌డ పార్టీ చేసుకోవాలో అర్థం కాని వారికోసం ఈ ఆర్టిక‌ల్‌లో కొన్ని పార్టీ కేంద్రాల‌ను ప్ర‌స్తావిస్తున్నాం. హ్యావ్ ఆ బ్లాస్ట్. కానీ జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మాత్రం మ‌ర్చిపోకండి. ఆరోగ్యంగా, ఆనందంగా కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌ల‌కండి.

 Now Check Out The Party Venues,

Klub Trinity


సిటీలోనే ఉత్త‌మమైన నైట్ క్ల‌బ్‌ల‌లో క్ల‌బ్ త్రినిటి ఒక‌టి. ఇది జూబ్లిహిల్స్‌లో ఉంది. అద్భుత‌మైన నైట్ లైఫ్‌కి, ఔట్‌డోర్ ఇండోర్‌లో పార్టీలు చేసుకోవాలి అనుకునే వాళ్ల‌కి ఇది బెస్ట్ ఛాయిస్‌. ఇక్క‌డ మ్యూజిక్‌తో మీరు సింక్ అయితే ఇక మిమ్మ‌ల్ని అపడం లాస్ట్ పెగ్ వ‌ల్ల కూడా కాదు.

Address: Malik Solitaire, 5th Floor,, Road Number 36, Jubilee Hills, Hyderabad

Hard Rock Cafe

పేరులోనే హార్డ్‌. రాక్ చేయ‌డం గ్యారంటీ డుడ్‌. రాక్ మ్యూజిక్‌కి సిటీలో దీన్ని మించిన డెస్టినేష‌న్ లేదు. కొత్త సంవ‌త్స‌రం ఉర్రూత‌లూగించే సంగీతంతో స్వాగ‌తం చెప్పండి. అస్స‌లు డిస్ప‌పాయింట్ అవ్వ‌రు బ్ర‌ద‌ర్‌. ఇంకో విష‌యం స‌మంతా, నాగ‌చైత‌న్య‌ల ఫేవ‌రిట్ పార్టీ స్పాట్ ల‌లో ఇది కూడా ఒక‌టి.

Address: GVK One, Road No. 1, Banjara Hills, Hyderabad

Ella Hotel

గ‌చ్చిబౌలిలో ఉన్న ఎల్లా హోట‌ల్ పాష్ పార్టీల‌కు బాగా ఫేమ‌స్‌. న్యూ ఇయ‌ర్ వ‌స్తే మీరు ఇంకో ఆలోచ‌న లేకండా ఇక్క‌డికి వెళ్లిపోవ‌చ్చు. మీకు కావాల్సిన ఎంట‌ర్ టైన్‌మెంట్‌, ఫుడ్‌, సెలబ్రేష‌న్స్ అన్నీ ఉంటాయి. టాలివుడ్ సెల‌బ్రిటీలు కూడా క‌నిపిస్తారు. ఎవ‌రైనా క‌నపిస్తే న‌క్క‌తోక అడిగింది అని చెప్ప‌డం మ‌ర్చిపోకండి. జస్ట్ కిడ్డింగ్‌.

Address: Hill Ridge Springs, ISB Road, Gachibowli, Hyderabad

Radisson Blu Plaza Hotel


బంజారాహిల్స్‌లో కొలువైన ఈ పార్టీ దేవాల‌యాల్లో ఒక‌టి రాడిసన్ బ్లూ ప్లాజా హోట్‌. ఆహ్లాద‌క‌ర‌మైన వాతార‌ణంలో, ఎలిగెంట్ స్టైల్లో, ల‌గ్జేరిస్‌గా పార్టీ చేసుకోవాలి అనుకునే వాళ్ల‌కు ఇది మంచి రాడిస‌న్ మంచి ఛాయిస్‌. ఖ‌రీదైన వ్య‌వ‌హార‌మే కానీ, పైసా వ‌సూల్ గ్యారంటీ
Address: 8-2-409, Rd Number 6, Green Valley, Banjara Hills, Hyderabad

Novotel Hyderabad Convention Centre

సిటీకి ఎవ‌రైనా వీవీఐపీలు, లేదా సెల‌బ్రిటీస్ వ‌స్తే వాళ్లు నోవోటెల్‌లో ఉండటానికి ఇష్ట‌ప‌డ‌తారు. ప‌దిహేను ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఈ హోట‌ల్‌ను చూస్తే చాలు క‌డుపు నిండిపోతుంది. గ‌ట్టిగ పార్టీ చేసుకుంటే మ‌న‌సు నిండిపోతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఇక్క‌డ కొత్త సంవత్స‌రాన్ని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Address: Kavuri Hills, Kondapur, Novotel Hotel Road, Hyderabad

ఇంకో విష‌యం.. మొన్న ముంబైలో గ‌ట్టిగ పార్టీ చేసుకోనే ప్ర‌య‌త్నంలో ఒక క్ల‌బ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. ప్రాణ‌న‌ష్టం, ఆస్తి న‌ష్టం జ‌రిగింది. సో ద‌య‌చేసి కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండండి &  No Drunk And Drive

Advertisement