మ‌న దేశంలో మాత్రమే పాటించే రాయ‌ని రాయ‌లేని Top-5 రూల్స్‌

146
Things That Happend only in india

మ‌న‌దేశంలో చెప్పుకోవ‌డానికి చాలా చ‌ట్టాలున్నాయి. వాటిని ప‌క్కాగా రాసి పెట్టారు. అయితే కొన్ని రాయ‌ని చ‌ట్టాలు కూడా ఉన్నాయి. ఇవి రాసిన చ‌ట్టాల క‌న్నా ఎక్కువ‌గా పాపుల‌ర్ . వాటిని ప్ర‌తీ భార‌తీయుడు తూచా త‌ప్ప‌కుండా పాటిస్తాడు. ఈ రోజు అలాంటి కొన్ని రాయ‌ని రూల్స్ చ‌దివేయండి. మ‌న దేశం మ‌న స్టైల్‌.😉😉😉😉😆😆🤣😂

 

 

Advertisement

#1.స‌కుటుంబ స‌ప‌రివారం

విదేశాల్లో ఫంక్ష‌న్స్ జ‌రిగితే ఎవ‌రిని పిలుస్తారో వాళ్లు మాత్ర‌మే వెళ్తారు. కానీ మ‌న దేశంలో ఒక్క వ్య‌క్తిని పిలిచినా చాలు.. మొత్తం ఫ్యామిలీని పిలిచిన‌ట్టు. లేదా ఒక్క‌రిని పిలిచినా.. ఫ్యామిలీ మొత్తం త‌ర‌లి వెళ్తుంది. ఇందులో త‌ప్పేముంది బాస్ దావ‌త్ ఇచ్చేది న‌లుగురి కోస‌మే క‌దా. ఒక్క‌రికి బ‌దులు న‌లుగురు వ‌స్తే అందులో త‌ప్పేముంది. కానీ ఎవ్వ‌రిని పిలుస్తామో వాడు మాత్రం రాడు. 😅

#2. ప‌క్కింటి పూజాని చూడు..

 

చ‌దువులో మ‌నం క్లాస్‌లో టాప్ రావాల్సిన అవ‌స‌రం లేదు. ప‌క్కింటి పూజా క‌న్నా రెండు మార్కులు ఎక్కువ మార్కులు సంపాదిస్తే చాలు. మ‌న‌కు నోబెల్ వ‌చ్చినంత గౌర‌వం దోరుకుతుంది. అన్ని మార్కులు రాలేద‌నుకో.. అప్ప‌డు త‌ల్లిదండ్రులకు తిట్టే ఛాన్స్ దొరుకుతుంది. అరేయ్‌,, బండ ఎద‌వ‌, ఆ మార్కులేందిరా. ఆ పూజాని చూడు. నీ క‌న్నా వంద మార్కులు ఎక్కువ తెచ్చుకుంది. చూసి సిగ్గు తెచ్చుకో అంటారు.😡😡

కానీ వాళ్ల‌కేం తెలుసు మ‌నం పూజాను రోజుకు ఎన్ని సార్లు చూస్తామో.😜😜 మనం అదే పనిలో ఉన్నామని

#3. సాల‌రీ అడిగే హ‌క్కు

పుస్తకాలు చ‌దివి కోటీశ్వ‌రులు అవ్వాల‌నే క‌ల‌లు క‌నే మ‌నం…చివ‌రికి ప‌దివేల జాబ్ లో సెట్ అవుతాం. మ‌న జీతం గురించి ఆలోచిస్తే మ‌న‌కే సిగ్గేస్తుంది. కానీ ఇంటికి వ‌చ్చే చుట్టాల‌కు అందులోనే సంతోషం. బాబు ఏం చేస్తున్నావు.. నెల‌కి 50 వేలు వ‌స్తున్నాయా అంటారు.మ‌న‌కు ఎక్క‌డో కాలుతుంది. వ‌చ్చిన గొట్టాన్ని ఏమీ అన‌లేక‌.. కోపం త‌ట్టుకోలేక‌ మ‌నం అనుభ‌వించే బాధ ఎవ్వ‌రికీ రాకూడ‌దు. చుట్టాల‌కు మ‌న జీతం అడిగే హ‌క్కు ఉంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేదు. ఇది ఒక రాయ‌ని నియమం.😯

#4. అన్న‌య్య క‌రెక్ట్‌

సూర్య‌డు ప‌శ్చిమానా ఉద‌యిస్తాడు అని ఇంట్లో మ‌న‌క‌న్నా పెద్ద‌వాడు చెప్పినా అది క‌రెక్టే అవుతుంది. ఎందుకంటే పెద్ద‌లు ఆల్వేస్ క‌రెక్ట్‌. ఇది పెద్ద‌లు రాసిన నియమం. వాళ్లు త‌ప్పుచెప్పినా అది మ‌న త‌ప్పే అవుతుంది. పెద్ద‌ల‌తో ఎలా మాట్లాడాలో తెలియదా అంటారు. ఎందుకొచ్చిన గొడ‌వ‌ని ఒప్పేసుకుంటాం.😔

#5. అక్కా కొంచెం చ‌క్కెర ఇవ్వ‌వా..

బై డిఫాల్ట్‌గా మ‌న‌కు ప‌క్కింటి వాళ్ల కిచెన్ సామాగ్రిపై హ‌క్కు ఉంటుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే అది మ‌నదే. అందుకే ఇంట్లో దినుసులు అయిపోయిన‌ప్పుడు.. అక్కా కొంచెం నూనె ఇవ్వ‌వా, రెండు మిర‌ప‌కాయ‌లు ఇవ్వ‌వా, మా ఆయ‌న‌కు రోజూ పేప‌ర్ చ‌దివే అల‌వాటు ఉంది ఒక సారి పేప‌ర్ ఇవ్వ‌వా అని ఇలా ఎన్నో సార్లు త‌మ హ‌క్కును వినియోగించుకుంటారు. ప‌క్కంటి వాళ్లు కూడా త‌క్కువేం కాదు. ద‌బిడి దిబిడే..🤑

 😀😀😋బోనస్ గా మరో ఐదు😍😍🙂

#6. నీ ఓటు నాకే అక్కా..

రాజ‌కీయ నాయకులు ప‌క్కాగా పాటించే నియ‌మం ఇది. ఐదు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి వీధియాత్ర చేస్తారు. క‌నిపించిన ప్ర‌తీ ఒక్క‌రికి న‌వ్వుతూ న‌మ‌స్తే చెప్పి.. నీ త‌మ్ముడు, అన్న‌లాంటి వాడిని న‌న్ను మీరే గెలిపించాలి అంటాడు. అరే ఐదు సంవ‌త్స‌రాల‌కు ఒక్క‌సారి క‌నిపించే ఈ అన్న చేసే డ్రామాలు మామూలుగా ఉండ‌వు. మీరు ఇళ్లు ఊడిస్తే.. చీపిరి క‌ట్ట గాలి ఊడ్చేస్తాడు. పిల్లాడి షిట్టు కూడా క‌డిగేస్తాడు.

  అలా తెల్ల ష‌ర్టు వేసుకుని షిట్టు క‌డిగే నాయ‌కుడి అవ‌స్థ‌లు చూసి.. పోరా నాయ‌నా.. నీకు ఓటు వేసి పార‌దొబ్బుతా. మ‌ళ్లీ ఐదేళ్ల త‌ర్వాత రా. అనుకుంటాం. ఇలా మ‌న ఇండియాలోనే.🤗🤗

#7. స్వీట్స్ పంచుకోవ‌డం

పండ‌గ వ‌చ్చినా, ర్యాంకు వచ్చినా, బైక్ కొన్నా, లేదా కొడుకు, కూతురు పుట్టినా.. కిలో స్వీటు డ‌బ్బా కొని న‌లుగురికి పంచుతాం. సంతోషం న‌లుగురితో పంచుకోవ‌డంలో మ‌న‌కు మ‌న‌మే సాటి. స్వీట్ డబ్బా ముందు పెట్టగానే.. కొడుక్కీ, ఆయ‌న‌కి, ముస‌లామె పేరు చెప్పి ఒక‌టికి ఐదు స్వీట్ ముక్క‌లు తీసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది అంటారు.అదే రోజు రాత్రి ఢాబా పైన ఫ్రెండ్స్‌తో సిట్టింగ్ పెడితే మాత్రం.. వీడి నోట్ల మ‌న్నువ‌డ ప‌ద్ధ‌తి లేదు… ఇప్పుడు మా ఆయ‌న‌తాగిన బీర్ బాటిల్ ఎక్క‌డ దాచాలి అని తిట్టుకుంటారు. అది అదే.. ఇది ఇదే..🥃🥃

#8. సిగ‌రెట్ తాగితే పాపం

అవును విదేశాల్లో ఎవ‌డి లైఫ్ వాడిది,. కానీ మ‌న దేశంలో మ‌న లైఫ్‌ ప‌క్కింటోళ్ల‌ది. వాళ్ల మ‌న‌సు తెలుసుకుని న‌డుచుకోవాలి. తామ‌రాకుపై నీటిచుక్క‌లా ప‌విత్రంగా ఉండాలి. సిగ‌రెట్ తాగ‌డం వాళ్ల కంటికి క‌న‌ప‌డితే చాలు… మ‌నను క‌రుడు గ‌ట్టిన తీవ్ర‌వాదిలా చూస్తారు. మ‌ను జ‌న‌జీవ‌న శ్ర‌వంతి నుంచి వెలి వేస్తారు.

🤓

#9. బ‌హుమ‌తి

ఒక‌రి ఇంట్లో వేడుక జ‌రిగితే గిప్ట్ తీసుకెళ్ల‌డం చాలా కామ‌న్‌. అమెరికా లాంటి దేశాల్లో షాంపేన్‌, వైన్ బాటిల్స్ తీసుకెళ్తారు. కానీ మ‌న దేశంలో మాత్రం ఫోటో ఆల్బ‌మ్‌, గోడ వాచీలు తీసుకెళ్ల‌డం చూసే ఉంటాం. ఎందుకో ఫ్రెండ్ పెళ్లి అన‌గానే మ‌న‌కు గోడ వాచీలే గుర్తొస్తాయి. నీ బ్యాట్ టైమ్ స్టార్ట్ అవ‌నుంది మామా.. దాన్ని నేను ఇచ్చే వాచీలో చూసి ఏడువు అని ఇస్తామా. చ‌దివింపులు ఉంటాయి క‌దా.. అప్పుడు మ‌నం 101, 201, 301,11116, ఇలా ఇస్తాం కానీ 100, 200 లా సింగిల్ డిజిట్స్ ఇవ్వ‌కుండా ట్రై చేస్తాం.

జేబులో 500 నోటు ఉన్నా ఆ ఒక్క రుపాయి లేక‌పోతే మ‌న తల‌కొట్టేసినట్టు ఉంటుంది.🙃

#10. రాంగ్ రూట్ లో వెళ్లే రైట్‌

 

ఇది ఎవ‌రూ రాయ‌ని ట్రాఫిక్ రూల్‌. వ‌న్ వేలో కూడా మ‌నం రాంగ్ రూట్ వ‌చ్చే వాడికి సైడివ్వండి. ఇవ్వ‌క పోతే వాడి క్రోధాగ్నికి భ‌స్మం అవ్వాల్సి. ఉంటుంది. అయినా.. రాంగ్ రూట్లో వెళ్లే వాడి హ‌క్కును కాపాడే బాధ్య‌త‌ మ‌న‌దే క‌దా. రాంగ్ రూట్ వెళ్లే వాడికి సైడివ్వండి. లేదంటే వాడి మాన‌వ హ‌క్కుని మ‌నం హ‌రించిన‌ట్టు ఫీల్ అవుతాడు.😫

Advertisement