స్వెట్ట‌ర్ల‌ను ప్రేమ‌తో ఉత‌కాలి ( చిట్కాలు)

121
Tips to wash Sweaters

చ‌లికాలం వ‌స్తే కానీ చాలా మందికి స్వెట్ట‌ర్లు గుర్తురావు. ఏడాదంతా బ్యాగుల్లో న‌క్కిన‌క్కి పెట్టె స్వెట్ట‌ర్లను బ‌య‌టికి తీసి ఉత‌కడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బ‌ట్ట‌ల్లో స్వెట్ట‌ర్ చాలా స్పెష‌ల్‌. అందుకే వాటిని జాగ్ర‌త్త‌గా డీల్ చేయాలి. ప్రేమ‌తో ఉత‌కాలి. మీకోసం కొన్ని చిట్కాలు..

  • మామూలు బ‌ట్ట‌లు ఉతికి న‌ట్టుగా స్వెట్ట‌ర్ల‌ను ఉతికితే ప‌నికి రాకుండా పోతాయి.

  • డిట‌ర్టెంట్లు అస్స‌లు వాడ‌కూడ‌దు. బాగా వేడి నీటిని వాడ‌కూడ‌దు.

  • గోరు వెచ్చ‌ని నీటిలో కొంచెం సేపు ఉంచి మామూలు సోపుతో నున్నితంగా పైన ఉండే ఊలుకు ఏ మాత్రం డెబ్బ‌త‌గ‌ల‌కుండా బ్ర‌ష్ చేయాలి.

  • సోపు పూర్తిగా పోయేవ‌ర‌కు నీటిలో జాడించాలేగానీ పిండ‌కూడ‌దు.

  • ఉతికి త‌ర్వాత హ్యంగ‌ర్‌కు త‌గిలించి ఆర‌వేయాలి . అంతే కానీ హ్యాంగ‌ర్ కు క్లిప్పులు పెట్టి వేలాడదీయ‌రాదు

  • ఎక్కువ స‌మ‌యం ఎండలో ఆర‌వేయ‌రాదు. రంగు పోయే అవ‌కాశం ఉంది.

  • ఇస్త్రీ చేసేట‌ప్పుడు స్వెట్ట‌ర్ పైన కాగితంగాని , వేరు చేసే వస్త్రంగాని వేసి ఇస్త్రీ చేసుకోవాలి.

  • స్వెట్ట‌ర్ల‌ను రగ్గుల‌ను లాండ్రీకి వేయడం కంటే సొంతంగా ఇంట్లో ఉతుక్కోవ‌డం స్వెట్ట‌ర్ల‌మ‌న్నిక విష‌యంలో ఎంతైనా అవ‌స‌రం.

Advertisement