మ‌న జీవితంలో ఉండే 10 రకాల ఫ్రెండ్స్‌

143
types of friends we see in our life

ఫ్రెండ్ అంటే ఎండాకాలంలో కుల్ఫీ లాంటోడు. వ‌ర్షాకాలంలో సూప్ లాంటోడు. వింట‌ర్‌లో విస్కీలాంటోడు. వాడు ( ఆమె) లేని లైఫ్‌ని ఊహించ‌లేం. అయితే ప్రెండ్స్‌లో కూడా టైప్స్ ఉంటారు. కొంద‌రు అదో టైప్‌. కొంద‌రు ఇదో టైప్‌. కానీ మ‌న‌కు వాళ్లే లైఫ్‌.

ఇప్పుడు చూడండి మ‌న‌కు ఎన్ని ర‌కాల ఫ్రెండ్స్ ఉంటారో ?

#1. మీసాల‌తో పుట్టినోడు
వీడు ప్ర‌తీ బ్యాచ్‌లో ఉంటాడు. ప‌ద్ధ‌తికి మారు పేరు. ఏ పనైనా స‌రిగ్గా చేయాల‌ని చెబుతుంటాడు. కానీ మ‌న‌కు అవ‌న్నీ న‌చ్చ‌వు. ఏందిరా వీడు ఇంత ఫ‌ర్పెక్ట్‌గా ఉంటే ఎలా బ‌తుకుతాడు ? కొంచెం అయినా మ‌న ల‌క్ష‌ణాలు వ‌చ్చి ఉంటే వీడి లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటాం. కానీ మ‌నంద‌రిలో వీడే ముందు సెట్ అవుతాడు.

#2. పేద‌రాసి పెద్ద‌య్య‌

వీడు లేంది మ‌న బ్యాచ్ అసంపూర్ణం. మ‌న‌కు ఆక‌లైనా.. వీడే హోట‌ల్‌లో తినిపిస్తాడు. మ‌న అవ‌స‌రం తెలుసుకుని తీర్చుతాడు. చివ‌రికి మ‌న ఫ‌స్ట్ డేట్‌కి స్పాన్స‌ర్ చేసేది కూడా వీడే . వీడికి డ‌బ్బు క‌న్నా స్నేహ‌మే ఇంపార్టెంట్‌. ఈ వీక్‌నెస్‌నే చాలా మంది వాడుకుంటారు. అలా జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి మామా.

#3. బావా నీ చెల్లి

క‌నిపించిన ప్ర‌తీ అమ్మాయిని త‌న గాళ ఫ్రెండ్ అనుకునే ర‌కం వీడు. అక్క‌డే ఆగుతాడా.. మ‌నం కూడా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాం.. వెంట‌నే బావా నీ చెల్లిని అలా చూడొచ్చా అంటాడు. ఎక్క‌డో కాలుతుంది. కానీ కాలిన చోట బ‌ర్నాల్ రాసుకుని ఇంకో చెల్లి కోసం వెయిట్ చేస్తుంటాం.

#4. న‌డిచే బాటిల్‌

*బావా వావా..
**ఏందిరా..
*బార్‌కి వెళ్దామా ?
**ఎందుకురా ?
**తాగిప‌డిపోతా బావా?
*అయితే నేనెందుకురా ?
*న‌న్ను ఇంటికి మోసుకొచ్చేది నువ్వుక‌దా బావా!!

ఇది ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య న‌డిచే సంభాష‌ణ‌. ప్ర‌తీ బ్యాచ్‌లో ఒక‌డుంటాడు. వాడు మందు ప‌డితేనే మ‌నిషిలా ఉంటాడు. వాడి బాడీలో ర‌క్తం కాదు.. రెడ్ వైన్ ప్ర‌వాహిస్తుంది. వాడి బాడిలో హైలైట్ వాడి పొట్ట‌. ఎప్పుడు లిక్క‌ర్‌తో నిండి ఉంటుంది. మొత్తానికి న‌డిచే బార్‌లా ఉంటాడు.

#5. అబద్ధాల కోరు
పొద్దున్నే కాల్ వ‌స్తుంది. బావా కొత్త బండి కొన్నా పార్టీ ఇస్తా ఇంటికొచ్చేయ్ అంటాడు. సూప‌ర్ మ‌చ్చా అని వాడి ఇంటికి వెళ్తాం. కానీ ఇంటి ముందు బండి ఉండ‌దు. ఏమైందిరా బండి అంటే .. బావా బ‌స్టాప్‌లో నిషా వెయిట్ చేస్తుంద‌ట‌. అర్జంట్‌గా బండి కావాలి. ప‌ద్ధ‌తిగా అడిగితే ఇవ్వ‌వ‌ని చిన్న స్కెచ్ వేశా.. అని మ‌నం తేరుకునే లోపు జంప్ అయిపోతాడు. ఇలా వాడు ఎన్ని సార్లు బ‌క్రా అయినా.. మ‌ళ్లీ వాడు చెప్పే అబ‌ద్ధాలు న‌మ్ముతాం. వాడు మార‌డు. మ‌నం మారం. అదో ఎద‌వ తృప్తి

#6.సీక్రెట్ ఫ్రెండ్

ఇంట్లో ఎవ‌రికీ తెలియ‌కుండా ఎదురింటి అమ్మాయితో స్నేహం చేస్తాం. కొంత కాలం త‌ర్వాత అంద‌రికి తెలిసిపోతుంది. చాలా మంది ల‌వ్ బ‌ర్డ్స్ అని పిల‌వ‌డం స్టార్ట్ చేస్తారు. కానీ మ‌నకే తెలుసు… ఆమె మ‌న‌కు మంచి ఫ్రెండ్ మాత్ర‌మే అని. అలాంటి సీక్రెట్ ఫ్రెండ్ మ‌న లైఫ్‌లో ఒక్క‌రైనా ఉంటారు.

#7. సెల్ఫిష్‌
ఇందులో రెండు ర‌కాలు
1. ఒక‌డు సెల్ఫీ పిచ్చోడు. సెల్ఫీ ఫోటోల‌తో ప‌చ్చిక్కిస్తాడు.
2. ఇంకోడు స్వార్థ ప‌రుడు. జేబులో డ‌బ్బు ఉన్న తీయ‌డు. అవ‌స‌రానికి అనుగుణంగా ప్ర‌వ‌ర్తిస్తాడు. వీడిని బండ‌బూతులు తిడ‌తాం. కానీ వాడు లేకండా ఉండ‌లేం. ఎంతైనా మ‌న ఫ్రెండ్ క‌దా?

#8. అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి లేకుండా బ్యాచ్ ఎలా ఉంటుంది ? వీడి ముందు మ‌నం చాలా సార్లు సైలెంట్ గా ఉంటాం. వీడు మ‌న టీమ్‌లో ఉంటే ఒక ర‌క‌మైన ధైర్యం ఉంటుంది. అదే స‌మ‌యంలో ఎవ‌డితో గొడ‌వ‌ప‌డ‌తాడో అనే భ‌యం కూడా ఉంటుంది.

#9. వాట్సాప్‌, ఫేస్ బుక్ ఫ్రెండ్‌
వీళ్లు రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉండ‌రు . అప్పుడ‌ప్పుడు చాట్ చేస్తారు. వీళ్ల‌తో మ‌నం అబ‌ద్ధాలు చెప్ప‌వ‌చ్చు. లేదా నిజాయితీగా ఉండ‌వచ్చు. ఎలా ఉన్నా ఈ ఫ్రెండ్ షిప్‌లో ఎలాంటి మార్పు ఉండ‌దు.

#10. సాఫ్ట్‌వేర్‌

మ‌న సిస్టమ్‌లో వైర‌స్ ఉంటే వీడు యాంటి వైర‌స్ వేస్తాడు. ట్రైయ‌ల్ ఎడిష‌న్స్‌తోనే సిస్ట‌మ్‌ను ఎలా ర‌న్ చేయాలో మ‌న‌కు చెబుతాడు. ఎప్పుడూ సిస్ట‌మ్ ముందే ఉండే వీడిని మ‌నం సాఫ్ట్‌వేర్ అంటాము. పేరుకు త‌గ్గ‌ట్టే వీడు చాలా సాఫ్ట్‌.

ప్ర‌పంచం మొత్తం న‌న్ను కాద‌ని వెళ్లిపోయినా..
నీ వెంట నిలిచేవాడే నీ ఫ్రెండ్‌.

ఫ్రెండ్స్‌ చాలా మంది ఉంటారు. వాళ్లంద‌రితో ట‌చ్‌లో ఉందాం. రంగు, భాష, మతం, కులం, జాతీయ‌త గోడ‌ల‌ను దాటేద్దాం. ఎందుకంటే జీవితంలో ప్ర‌తీ ఫ్రెండు అవ‌స‌ర‌మేగా.

ఈ ఆర్టిక‌ల్ పై మీ అభప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో వ్య‌క్తం చేయండి.

Advertisement