2017లో సోష‌ల్ మీడియాలో వైరల్ అయిన 10 ఫోటోలు

151
Viral Photos of india in 2017

2017లో వైరల్ అయి, బాగా షేర్ అయిన ఫొటోస్ మీకోసం.

1.స్మైల్ ఆఫ్ ది ఇయ‌ర్‌

నాంప‌ల్లి ద‌ర్గా ద‌గ్గ‌ర నిదురిస్తున్న ఒక అమ్మ నుంచి కొడుకుని కిడ్నాప్ చేసిన కిడ్నాప‌ర్ల‌ను నాంప‌ల్లి పోలీసులు చాక‌చ‌క్యంగా, వేగంగా ప‌ట్టుకున్నారు. అలా కిడ్నాప‌ర్ల నుంచి బాలుణ్ణి త‌ప్పించాక.. ఆ క్యూట్ బాయ్ పోలీసుని చూసి ఒక క్యూట్ స్మైల్ ఇచ్చాడు. చూసిన వాళ్లంతా ఫిదా అయ్యారు. ఆ పోలీసు ఆఫీస‌ర్ జీవితంలో ఇది ఒక మ‌రచిపోలేని చిరున‌వ్వు. ఈ చిరున‌వ్వుకు కార‌ణం.. ఆయ‌నే అండ్ ఆయ‌న టీమ్ క‌దా.
ఈ ఫోటోను చాలా రోజుల నుంచి సేవ్ చేసి పెట్టాను. ఈ రోజు కోస‌మే. తీసిందిTelangana Today ల ప‌త్రిక ఫొటోగ్రాఫర్‌. కిర్రాక్ టైమింగ్ మామా.

2.దండం ఆఫ్ ది ఇయ‌ర్‌

ఎంత చెప్పినా విన‌ని వాళ్ల‌కు చివ‌రికి మ‌నం పెట్టేది దండ‌మే. పాపం ట్రాఫిక్, సేఫ్టీ రూల్స్ చెప్పీ చెప్పీ విసిగిపోయిన ఈ పోలీస్ అధికారి .. చివ‌రికి ఇలా ఒక దండం పెట్టాడు. ఇంకో సోర్స్ త్వారా తెలుసుకుంది ఏంటంటే ఫ్రెండ్లీ పోలిసింగ్‌లో భాగంగా ఇలా పొలైట్‌గా చెప్పాడ‌ట‌. నిజం ఏదైనా….ప్యాసింజ‌ర్ ట్రైన్ గూడ్స్ ట్రైన్‌లా ప్ర‌వ‌ర్తిస్తే దండ‌మేగా పెట్టాలి.

3. పాదాభివందనం ఆఫ్ ది ఇయ‌ర్‌

రీసెంట్‌గా ఒక మ్యాచ్‌లో ధోనీ అభిమాని ఇలా కాళ్ల‌ను స్పృశించి త‌రించాడు. ఇది ధోనీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోవింగ్‌కి ఒక నిద‌ర్శనం మాత్ర‌మే.

4. సెల్యూట ఆఫ్ ది ఇయ‌ర్‌

ప‌ద్రాగ‌స్టు, గ‌ణ‌తంత్ర దినోత్స‌వం అంటే కొంత మంది సెల‌వు వ‌స్తోంద‌ని సంబ‌ర ప‌డిపోతుంటారు. జెండాకు వందనం చేయ‌డానికి కూడా స‌మ‌యం వెచ్చించ‌రు. కానీ అసోంలోని ఒక పాఠ‌శాల విద్యార్థులు చెస్ట్ లెవల్‌లో ఉన్న నీటిని కూడా ప‌ట్టించుకోకుండా జెండాకు వందనం అర్పించారు. వీళ్ల‌కు సెల్యూట్‌. జైహింద్‌

5. షేమ్ ఆన్ ది పీపుల్ ఆఫ్ ది ఇయ‌ర్‌

మ‌హిళలు ఎలాంటి దుస్తులు ధ‌రించాలో, అవాయిడ్ చేయాలో చెప్ప‌డంలో చాలా మంది ముందుంటారు. అలాంటి విష‌య‌మే ఈ ఫోటోతో లింక్ అయి ఉంది. ఒక స‌ద‌స్పు కోసం జ‌ర్మ‌నీ వెళ్లిన ప్ర‌ధాన మంద్రి మోదీతో అక్క‌డే బేవాచ్ మూవీ ప్ర‌మోష‌న్‌లో ఉన్న ప్రియాంకా చోప్రా స‌మావేశం అయ్యారు. అప్ప‌టి ఫొటో ఇది. ఆమే వేసుకున్న దుస్తుల‌పై సోష‌ల్ మీడియాలో బాగా చ‌ర్చ‌లు జ‌రిగాయి.

6. మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌

మ‌త‌సామ‌ర‌స్యం మ‌నిషిలో నిగూఢ‌మైన అద్భుత‌మైన త‌త్వం. అలాంటి త‌త్వాన్ని ప్ర‌తిబింభించే చిత్రం ఇది. పాకిస్తాన్‌లో ముస్లింలు రంజాన్ మాసాన్ని పాటిస్తున్న స‌మ‌యంలో అక్క‌డి సిఖ్‌ కమ్యూనిటీ ప్ర‌జ‌లు ఇలా ఆహార ప‌దార్థాలు అందించారు. ఈ ఫొటో బాగా వైర‌ల్ అయింది.

7. స‌ర్ ప్రైజ్ ఆఫ్ ది ఇయ‌ర్‌

విరాట్ కోహ్లీ అనుష్క శ‌ర్మ‌ల వివాహం గురించి ఎన్నో పుకార్లు వార్త‌లు వచ్చాయి. కానీ డిసెంబ‌ర్ 11న బ‌య‌టికి వ‌చ్చిన ఈ ఫొటో క్ష‌ణాల్లో మొత్తం ఇంట‌ర్నెట్‌ను ఆక్ర‌మించేసింది.

8. సెల్ఫీ ఆఫ్ ది ఇయ‌ర్‌

వివాహానంత‌రం హ‌నీమూన్‌కి వెళ్లిన విరాట్‌- అనుష్క జంట ఈ పొటోను షేర్ చేశారు. చాలా మంది ఈ ఫోటో్పై ఫ‌న్నీ కామెంట్స్ చేశారు.

9. ఫేక్ టైమింగ్ ఫొటో ఆఫ్ ది ఇయ‌ర్‌

ఈ ఫోటోను ఒక ఆష్ట్రోనామ‌ర్ స్పేస్ నుంచి తీసి షేర్ చేశాడు. దివాళి రోజు భార‌త‌దేశం ఇలా క‌నిపిస్తోంది అని వివ‌రించాడు. అయితే ఒక ట్విట్ట‌ర్ యూజ‌ర్ ఇది ఫేక్ అని.. దివాళీకి నెల రోజుల ముందు తీసి త‌న ఫ్లికర్ ఎకౌంట్లో ఆష్ట్రో్నామ‌ర్ షేర్ చేశాడ‌ని ప్రూవ్ చేశాడు. బ‌ట్ ఫొటో మ‌న‌దేశానిదే. కానీ దివాళీది మాత్రం కాదు.

10. మ‌గువ‌ల మ‌న‌సు దోచిన ఫొటో

మాధ‌వ‌న్ న‌వ్వితే చాలు ఆ స్మైల్ చూసి అమ్మాయిలు ప‌డిపోతారు. కానీ ఆ మ‌ధ్య కాస్త ఫ్యాట్ అవ్వ‌డంతో అత‌ని ఛార్మింగ్ ప‌ర్స‌నాలిటీని మిస్స‌య్యారు చాలా మంది. కానీ మాధ‌వ‌న్ ఈజ్ బ్యాక్ అనే విధంగా షేర్ చేసిన ఈ పిక్చ‌ర్ కి మ‌ళ్లీ ల‌క్ష‌లాది మంది అమ్మాయిలు ఫ్లాట్ అయ్యారు. విప‌రీతంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement