తెలుగులో తెరపై ఎన్నో ఆణిముత్యాలలాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కొన్ని చిత్రాలు నాటికీ, నేటికీ ప్రేక్షకులను మరీ మరీ చూసేలా చేస్తుంటాయి. అందులో ఒక చిత్రమే శంకరాభరణం (45 Years of sankarabharanam ). తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ఇది. అది సినిమా కాదు ఇది ఒక అందమైన సంగీత భరితమైన దృశ్య కావ్యం. ఈ చిత్రం విడుదలైన 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశేషాలు మీకోసం…
