45 వసంతాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం…నేటికీ అజరామరం | 45 Years of sankarabharanam

తెలుగులో తెరపై ఎన్నో ఆణిముత్యాలలాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కొన్ని చిత్రాలు నాటికీ, నేటికీ ప్రేక్షకులను మరీ మరీ చూసేలా చేస్తుంటాయి. అందులో ఒక చిత్రమే శంకరాభరణం (45 Years of sankarabharanam ). తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ఇది. అది సినిమా కాదు ఇది ఒక అందమైన సంగీత భరితమైన దృశ్య కావ్యం. ఈ చిత్రం విడుదలైన 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశేషాలు మీకోసం…

శంకరాణభరణం మూవీ 1988 ఫిబ్రవరి 2న విడుదలైంది. ఈ మూవీ కళాతపస్వి కే విశ్వనాథ్ తెరకెక్కించగా, పూర్ణోదయా ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్‌లో ఏడిద నాగేశ్వర రావు, ఆకాశం శ్రీరాములి ప్రొడ్యూస్ చేశారు.
తెలుగులో విడుదలైన ఈ మూవీ కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా అద్భుతమైన విజయం సాధించింది.
ఆ సమయంలోనే ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీ అయింది. అమెరికాలో కూడా రెగ్యులర్ థియేటర్లలో విడదలై హిట్ అయింది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు శంకరాభరణం ఎలాంటి చిత్రమో...అందులోని కంటెంట్, కథకు ప్రేక్షకులు ఎలా నీరాజనం పలికారో అని.
అప్పటి వరకు శాస్త్రీయ సంగీతం అంటే కొంత మందికి మాత్రం పరిమితం అనుకునేవారు. కానీ ఈ శంకరాభరణం విడుదలైన తరువాత శాస్త్రీయ సంగీతం అనేది ప్రతీ ఒక్కరికీ సంబంధించినది అని ప్రేక్షకులకు అర్థమైంది. అందుకే చాలా మంది క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం ప్రారంభించారు.
శంకరాభరణం మూవీకి స్వర్ణకమలంతో పాటు 8 నందీ అవార్డులను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి జాతీయ అవార్డును అందుకుంది ఈ చిత్రంతోనే.
« of 2 »

Leave a Comment