వివాదాస్పద యూట్యూబర్ రణ్‌వీర్ ఆల్లాబాదియా ఎంత సంపాదిస్తాడో తెలుసా ? | Ranveer Allahbadia Empire

Ranveer Allahbadia Empire: అనతి కాలంలోనే పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి దూసుకెళ్లిన రణ్‌వీర్ ఒక్క చెడ్డ జోక్‌తో కెరియర్‌లో అతి పెద్ద రిమార్కును మిగుల్చుకున్నాడు. ప్రస్తుతం చాలా మంది అసలు రణ్‌వీర్ ఏం చేశాడు ? ఎంత సంపాదిస్తున్నాడు ? ఏం ఆస్తులు కూడబెట్డాడు అనే విషయాలను సెర్చ్ చేస్తున్నారు.

బీర్ బైసెప్ప్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో భారతీయులకు పరిచయమైన రణ్‌వీర్ ఆల్లాబాదియా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కాడు. వార్తల్లో నిలిచిన కారణం మాత్రం అత్యంత వివాదాస్పదం. ఇటీవలే ఇండియా గాట్ లాలెంట్ (India Got Latent) అనే ఒక య్యూట్యూబ్ కార్యక్రమంలో అతను పానెల్ సభ్యుడిగా కనిపించాడు.

రణ్‌వీర్ ఆల్లాబాదియా చేసిన ఒక వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజెన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అతను ఏమన్నాడో తెలిసినా తెలుగువాడిగా, భారతీయుడిగా నేను దాన్ని ఇక్కడ ప్రస్థావించలేను. కనీసం మనల కలలో కూడా ఊహించడానికి కూడా అవకాశం లేని విషయం అతను చెప్పాడు. 

Ranveer Allahbadia Empire
| Photo Source: X

దీంతో భారతీయ సమాజం మొత్తం ఒక్కటై అతన్ని ఏకిపారేస్తుంది. అనంతరం అతనిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అనతి కాలంలోనే పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి దూసుకెళ్లిన రణ్‌వీర్ తన కెరియర్‌లో అతి పెద్ద రిమార్కును మిగుల్చుకున్నాడు.  ప్రస్తుతం చాలా మంది అసలు రణ్‌వీర్ ఏం చేశాడు ? ఎంత సంపాదిస్తున్నాడు ? ఏం ఆస్తులు కూడబెట్డాడు అనే విషయాలను సెర్చ్ చేస్తున్నారు.

2014లో కెరియర్ ప్రారంభం 

రణ్‌వీర్ అల్లాబాదియా ప్రయాణం 2014 లో మొదలైంది. ఫిట్నెస్ కోసం అంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. తరువాత తన కంటెంట్‌ను ఆరోగ్యం, సెల్ప్, ఇంప్రూమెంట్, భక్తి వంటి కేటగిరీలకు విస్తరించాడు. తరువాత పాడ్ కాస్టింగ్ చేయడం ప్రారంభించాడు. ది రణ్‌వీర్ షో (The Ranveer Show) అనే పేరుతో ప్రియాంకా చోప్రా, అక్షయ్ కుమార్, అర్నాల్ట్ ష్వార్జ్‌నెగ్గర్ వంటి ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాడు.

అంతెందుకు మన మాస్ రవితేజా (Ravi Teja) కూడా ఇతని ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

రణ్‌వీర్ సామ్రాజ్యం | Ranveer Allahbadia Empire

ప్రస్తుంతం ఇతని యూట్యూబ్ ఛానెల్‌కు సుమారు కోటి మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయితే ఇతను కేవలం యూట్యూబ్ వీడియోలపైనే కాకుండా వివిధ వ్యాపారాలు కూడా చేస్తుంటాడు. 

  • మంక్ ఈ ( Monk-E) అనే పేరుతో విజయ్ సేత్ అనే వ్యక్తితో ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇందులో ఇంఫ్లుయెన్సర్లకు వివిధ రకాల సాయం అందిస్తుంటారు.
  • దీంతో పాటు బీర్ బైసెప్స్ సిల్క్ హౌస్ (BeerBiceps Skillhouse) అనే పేరుతో  ఎడ్యుకేషనల్ ఫ్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా సెల్ప్ ఇంప్రూమెంట్, ఉత్పాదతను పెంచుకోవడం, వ్యాపారాన్ని డెవెలెప్ చేసుకోవడంపై కోర్సులు నిర్వహిస్తుంటాడు.
  • రాజ్(RAAAZ) అనే మరో వెంచర్‌తో పురుషులకు గ్రూమింగ్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు అందిస్తాడు.
  • లెవెల్ (Level) : మంచి జీవితానికి కావాల్సిన సలహాలు సూచనలు అందించే మేజగైన్ ఇది.

అతని సంపద | Ranveer Allahbadia Networth

ఇక అతని సంపద విషయానికి వస్తే మనీ కంట్రోల్ ప్రకారం రణ్‌వీర్ సంపద వచ్చేసి సుమారు రూ.60 కోట్ల వరకు ఉంటుంది. వివిధ వ్యాపారాలు, బ్రాండ్ డీల్స్, పోడ్‌కాస్ట్, యూట్యూబ్ ఛానెల్స్ అన్నింటి నుంచి నెలకు ఎట్టాలేదన్నా అతనికి రూ.35 లక్ష ఆదాయం వస్తుందట.

బ్రాండ్ కొలాబరేషన్ కోసం ఒక్క డీల్‌కు అతను రూ.15-20 లక్షల వరకు చార్జి చేస్తాడట. ప్రస్తుతం అతను జొమాటో (Zomato), గ్రో (Groww), మై ప్రొటీన్ సంస్థలతో డీల్స్ కుదుర్చుకున్నాడు. ఇక అతని ది రణ్‌వీర్ షో అనే పాడ్‌కాస్ట్‌లో ప్రతీ ఎపిసోడ్‌కు అతను రూ.5-7 లక్షల వరకు సంపాదిస్తాడట.

ఇంతబతుకు బతికి…

2014 నుంచి 2025 జనవరి వరకు అతని జీవితంలో ఎన్నో కష్టాలు భరించి ఇప్పుడు నెలకు రూ.35 లక్షలు సంపాదించే స్థాయికి వచ్చాడు. కోట్లాది మంది అతని వీడియోల కోసం ఎదురు చూస్తుంటారు. రాజా జిందగీ ఉన్నా కానీ ఒక్క మాటతో తను ఉన్నదంతా కోల్పోయే అవకాశం ఉంది. 

అన్నింటికన్నా ముఖ్యమైంది అతని గుడ్ విల్‌కు ఇది పరీక్షా సమయం. తన నోరు జారాను అని, మాటల ఎంపికలతో కాస్త తూలాను అని రణ్‌వీర్ క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే ఈ సమస్యల తుపానులోంచి అతను ఏ విధంగా బయటికి వస్తాడు అనేది తెలియకపోయినా అతని ఆర్థిక పరిస్థితి అనేది ఇంప్రెసివ్‌గా ఉంది అనే చెప్పాలి.

రణ్‌వీర్ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఎదగడం ఎలాగో నేర్చుకోవాలి. పడకుండా ఉండేందుకు ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకోవాలి.

📣 ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Leave a Comment