Hari Hara Veera Mallu : ప్యాన్ ఇండియా విజయం పక్కా: నిర్మాత ఏ ఎం రత్నం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) . ఈ మూవీలో పవన్ కల్యాణ్ యోధుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే.  ఫిబ్రవరి 4వ తేదీన ఏఎం రత్నం పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గురించి తాజాగా పలు విషయాలు షేర్ చేసుకున్నారు ఈ ప్రముఖ నిర్మాత. ఈ మూవీ ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేస్తుందన్నారు. 

WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

ఏఎం రత్నం పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా?

చిన్నప్పటి నుంచే సినీ ప్రేమికుడు | Facts About AM Ratnam

AM Ratnam Postive About His Hari Veera Mallu Hara Movie With Pawan Kalyan (1)
| జాతీయ స్థాయిలో రాణించిన పలు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. శంకర్, ఏఆర్ రెహ్మాన్‌తో చేతులు కలిపి పలు హిట్స్ ఇచ్చారు ఏఎం రత్రం.

దర్శకుడిగా నిర్మాతగానే కాకుండా గీత రచయితగా, రచయితగా తమిళ చిత్రాల్లో చెరగని ముద్ర వేశారు ఏఎం రత్నం. ఈయన 1953 ఫిబ్రవరి 4వ తేదీన నెల్లూరులోని బుచ్చిరెడ్డి పాలెంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా సినిమాపై ఆసక్తి ఉండటంతో అదే తన జీవితంగా భావించారు. భారతీయ సినీ పరిశ్రమలో ( Indian Film Industry ) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

కర్తవ్యం ( Kartavyam Movie ) మూవీతో నిర్మాతగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఫస్ట్ బాల్‌కే సిక్సర్ కొట్టారు.తన సినిమాల్లో అనైతికతను, సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశాలు లేకుండా చూసుకునేవారు.

AM Ratnam Postive About His Hari Veera Mallu Hara Movie With Pawan Kalyan (3)
| తన సినిమాల్లో అనైతికతకు, అశ్లీలతకు తావు ఇవ్వకుండా జాగ్రత్తపేడతారు

మంచీ మర్యాద, కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే సంకల్పం, పెద్దరికం వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన నిర్మాతగా వచ్చిన ఇండియన్, కాదరలర్ దినం ( Premikula Roju ), ఖుషి, బాయ్స, గిల్లి, 7/జీ బృందావన్ కాలనీ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవరించారు. 

మెగాస్టార్ చిరంజీవితో ( Megastar Chiranjeevi ) స్నేహం కోసం మూవీ చేసి మంచి విజయం సాధించారు ఏఎం రత్నం. ఆయన కళాదక్షతకు మూడు ఫిలింఫేర్‌తో పాటు తమిళనాడు అందించే రాష్ట్ర పురస్కారాలను రెండు సార్లు అందుకన్నారు ఆయన.

హరిహర వీర మల్లు | Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu
| పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి చేసిన ఖుషి ట్రెండ్ సెటర్ అయింది.

ఏఎం రత్నం ప్రస్తుతం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లును నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఖుషి ( Khushi Movie ) మూవీ ట్రెండ్ సెట్టర్ అయిన విషయం తెలిసిందే. తరువాత వీరిద్దర కాంబోలో బంగారం మూవీ ( Bangaram ) కూడా వచ్చింది. ఇక మూడో సారి హరిహర వీరమల్లు కోసం కలిసి పనిచేస్తున్నారు.

హరిహర వీర మల్లు గురించి | Hari Hara Veera Mallu Movie Facts

ఈ మూవీ పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా ( Pawan Kalyan Pan India Movie ) చిత్రం అవడం విశేషం.ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఒక చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. బ్రో మూవీ ( BRO Movie ) తరువాత పవన్ కల్యాణ్ ఈ మూవీలో కనిపించునండటంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. 

ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకులను అలరించనుంది.

వారి అంచనాకు తగిన విధంగానే ఈ చిత్రం భారీ సాంకేతికతతో రూపొందుతోంది అని…హరిహర వీర మల్లు ప్యాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధిస్తుంది అని ఏఎం రత్నం తెలిపారు. ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో రాణిస్తుంది అని అన్నారు.

ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment

error: Content is protected !!