CIBIL Score: పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి వద్దన్న వధువు…ఇక లోనూ రాదూ పిల్ల కూడా దొరకదు !

ఇలాంటి ఘటన జరుగుతుంది అని ఎవరైనా ఊహిస్తారా?. సిబిల్ స్కోర్ ( CIBIL Score ) గురించి లోన్ ఇచ్చే వాళ్లు ఆలోచిస్తారు కానీ వధువు తరపు వాళ్లు ఆలోచిస్తారని ఎవరూ అనుకోరు కదా. పాపం సిబిల్ స్కోరుకు తన పెళ్లికి సంబంధం ఉంది అని పెళ్లి కొడుకు మాత్రం ఊహించలేకపోయాడు. 

ఏం జరిగింది ?

అది పెళ్లి చూపుల వేడుక. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరపు వాళ్ల మధ్య సరదా ముచ్చట్లు నడుస్తున్నాయి. ఇంకా సంబంధం దాదాపు ఖాయం అవడంతో అవసరం అనవసం అని సంబంధం లేకుండా నచ్చిన టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక బొట్టు పెట్టేశాం చాపచుట్టేసి పెళ్లి మండపంలో కలుద్దాం అనుకున్నారు. చివరిగా ఒకసారి మీ వాడి సిబిల్ స్కోర్ ఏంటో చూపిస్తారా ఊరికే చూస్తాం అన్నారు అమ్మాయి తరపు వాళ్లు. ఆ స్కోరు చూసిన తరువాత క్షణాల్లో లోన్ రిజెక్ట్ చేసినట్టు మ్యాచ్ రిజెక్ట్ చేశారు.

ఎక్కడ జరిగింది ?

ఈ ఘటన వచ్చేసి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి. మ్యాచ్ దాదాపు లాస్ట్ బాల్ వరకు వచ్చింది. కానీ సిబిల్ స్కోర్ చెక్ చేసిన తరువాత సంబంధం వద్దనుకున్నారు అమ్మాయి తరపు వాళ్లు. అబ్బాయి బ్యాంకుల నుంచి ఎన్నో లోన్లు తీసుకున్నాడని, అతని అర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని అమ్మాయి తరపు వాళ్లకు అర్థం అయింది. 

అయితే ఈ సిబిల్ స్కోర్ (CIBIL Score) చెక్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది అంటారు అంతేగా ? పెళ్లి కూతురు మేన మామకు ఈ ఐడియా వచ్చిందట. స్కోరు చూడగానే మేనమామ చేసిన పనికి పెళ్లికూతురు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు మెచ్చుకుని ఇక ఈ పెళ్లి సంబంధం మాకు వద్దూ అన్నారట. ముందు నుంచే ఇంత అప్పుల్లో ఉంటే ఇక పెళ్లయ్యాక అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఊహించుకుని ఈ బంధాన్ని వద్దని అనుకున్నారట.

లెక్కలు మారాయి | New Marriage Match Making Methods

నిజానికి ఈ రోజుల్లో పెళ్లి సంబంధానికి (Match Making) వెళ్లే ముందు ఇటు ఏడు తరాలు అడు ఏడు తరాలు చూడటం లేదు. పిల్లాడికి మంచి ఉద్యోగం ఉందా ? ప్రవర్తన ఎలా ఉంది ? సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నాాడు? వాట్సాప్ స్టేటస్ ఏంటి ? పెద్దలతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? మందు లాంటి అలవాట్లు ఉన్నాయా ?  గతంలో లవ్ స్టోరీస్ ఉన్నాయా? నాలుగు రాళ్లు వెనకేసుకునే అలవాటు ఉందా ? లేదా అప్పులతో జల్సా చేసే అలవాటు ఉందా ? ఇలాంటివి చెక్ చేస్తున్నారు. కానీ సిబిల్ స్కోర్ చెక్ చేయడం అనేది చాలా కొత్త ఐడియా. కానీ అమ్మాయి తరపు వాళ్లకు మాత్రం ఇది మంచి ఐడియా అని చెప్పవచ్చు.

సిబిల్ స్కోర్ అంటే ? | What Is CIBIL Score ?

What is Cibil Score
| నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నీ గురించి చెబుతా…నీ సిబిల్ స్కోర్ ఏంటో చెప్పు నీ ఆర్థిక పరిస్థితి చెబుతా అన్నట్టు ఉంది నేడు పరిస్థితి

ఈ రోజుల్లో మా తాతలు నేేతులు తాగారు మా మూతుల వాసన చూడండి అనే డైలాగులకు కాలం చెల్లింది. తాతముత్తాతల పేర్లు చెప్పి బ్యాంకుల నుంచి, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ నుంచి అప్పు తీసుకోవడం సాధ్యం కాదు ఇక. సిబిల్ స్కోర్ (CIBIL Score) బాగుంటే చిన్న ఉద్యోగం చేసే వ్యక్తికి కూడా లోన్ ఇస్తుంది బ్యాంకు. సిబిల్ స్కోరు బాలేకపోతే ఒకప్పటి రాజులకు కూడా లోన్ ఇవ్వదు. 

మీరు గతంలో తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించారా లేదా అనే దాన్ని బట్టి ఈ సిబిల్ స్కోరు పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అందుకే బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నప్పుడు టైమ్‌కి ఈఎమ్‌ఐలను (EMI) తల తాకట్టు పెట్టైన కట్టాలి అంటారు. లేదంటే సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. అది మళ్లీ పుంజుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది పెరిగే సమయంలో ఇలాంటి ఎన్నో జరగవచ్చు.

📣 ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment