Gita By Lord Krishna: ఈ రోజుల్లో సంతోషంగా (The Pursuit of Happiness) ఉండటం అంటే ఏంటో చాలా మందికి తెలియడం లేదు. అవసరం ఉన్నా లేకున్నా వస్తువులను కొనడం, పక్కవారితో పోల్చుకుని మెరుగ్గా ఉన్నామా అని చెక్ చేసుకోవడం లాంటి వాటినే సంతోషంగా భావిస్తున్నారు చాలా మంది. అలాగని అన్నీ ఉన్నా, అన్నీ కొన్నా జీవితంలో ఏదో వెలితిగా ఉంటుంది అని కూడా చాలా మంది చెబుతుంటారు.
నిజమైన సంతోషం (Real Happiness), గుండెలోపల నుంచి వచ్చే ఆనందం ఏంటో తెలుసుకోవాలంటే, ఈ జీవితం అర్థం ఏంటో తెలుసుకోవాలంటో ఏం చేయాలో చాలా మందికి తెలియదు.
వేల సంవత్సరాల క్రితమే శ్రీ కృష్ణుడు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు..
Birth Of Bhagavad Gita : ఏది మంచి ఏది చెడు..ఎక్కడ ధైర్యం చూపించాలి ? ఎక్కడ ఫలితం ఆశించాలి ? ఎవరితో ఎలా ఉండాలి ? ఎవరు మనవారు ? ఎవరు కాదు ?…ఇలాంటి వేలాది ప్రశ్నలకు సమాధానాల కోసం నిత్యం పరితపిస్తుంటాం మనం. వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రశ్నలకు శ్రీ కృష్ణుడు ముందే సమాధానం చెప్పాడు. భగవద్గీతలో మనిషికి వచ్చే ఎన్నో సందేహాలు, కష్టాలకు సమాధానం చెప్పాడు వాసుదేవుడు… శ్రీ కృష్ణుడు.
అర్జునుడి ప్రశ్నలను మన ప్రశ్నలుగా…మనల్ని మనం అర్జునుడిగా భావించి భగవద్గీత చదవాలి.
గీతా ఉపదేశం ప్రాధన్యాత | Significance Of Bhagavad Gita

భగవద్గీత అనేది హిందూ మతంలో (Hinduism) ఎంత ప్రధానమైనదో ప్రపంచానికి అంతే అవసరమైనది కూడా. కానీ మనదేశంలో చాలా మందికి భగవద్గీత ప్రాధాన్యత తెలియకపోవడం విచారకరం. గీతను ఒక పుస్తకంగా మాత్రమే కాకుండా మనిషి ఎలా బతకాలో దేవుడే ఇచ్చిన సూచనలుగా దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రతీ మనిషిలో అర్జునుడి మదిలో ఉన్నన్ని సందేహాలు ఉంటాయి. వాటిని క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. అలా మనకు సహజంగా వచ్చే కొన్ని సందేహాలు…వాటికి వాసుదేవుడు అప్పట్లో ఇచ్చిన సమాధానాలు ఇవే..
ఈ రోజు మనం భగవద్గీతలో ఈ తరానికి ఉపయోపడడే 10 మంచి విషయాలను తెలుసుకుందాం.
Table of Contents
1. వస్తువులపై వ్యామోహం తగ్గించుకోవడం ఎలా? : Detachment from Material Desires
ఈ రోజుల్లో చాలా మందికి ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటే అంత సంతోషంగా ఉంటాం అనే ఫీలింగ్ వచ్చేసింది. అవసరం కన్నా స్టేటస్ కోసం వస్తువులను కొనేస్తున్నారు. ఈ సమయంలో వస్తు వ్యామోహం నుంచి బయట పడేందుకు శ్రీ కృష్ణుడు చెప్పిన విషయం (Gita By Lord Krishna) తెలుసుకోవడం చాలా అవసరం.
మనకు వస్తువులపై వ్యామోహం, కోరికలు ఉండటం సాధారణమే అయినా వాటితో బంధాన్ని ముడివేసుకోవడం అనేది బాధకు కారణం అవుతుంది అన్నారు శ్రీకృష్ణుడు
- సోషల్ స్టేటస్, వస్తువులకు ఎక్కువగా అటాచ్ అవడం వంటివి మనలో శూన్యాన్ని, నిరాసక్తిని, నైరాశ్యాన్ని కలిగిస్తాయి.
- బయటి వస్తువులపై ఎక్కువగా ఆధారపడటం అనేది మనశ్శాంతి నుంచి, ఆనందం నుంచి మనను దూరం చేస్తుంది.
- కోరికలకు కళ్లెం వేయకపోతే ఆ కోరికలకు మనం గుర్రాలు అవుతాం. అవి మనపై స్వారీ చేస్తాయి. అవి పుడుతూనే ఉంటాయి.
- దీంతో మీరు సంతోషం కన్నా ఎక్కువగా మరిన్ని ఎక్కువ వస్తువులను సమకూర్చుకోవడంపైనే ఫోకస్ పెడతారు.
- Read Also : లిఫ్టుల్లో అద్దాలు ఎందుకు పెడతారో తెలుసా ? ఇది చదవండి!
ఉన్నదాంతో సంతోషంగా ఉండటం | To be Happy with What You Got
- మనదగ్గర ఉన్నదాంతో సంతోషంగా ఉండటం సాధ్యమే. ఇలా ఉండటం వల్ల కోరికలనే చక్రం నుంచి బయటికి రావచ్చు.
- బయటి వస్తువుల కన్నా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. నిజమైన జీవితం అంటే ఏంటో తెలుసుకోండి.
- కృతఙ్ఞతా భావం చూపించడం, మనం ఎలా ఉన్నామో అలాగే ప్రవర్తించడం వల్ల అనవసరమైన విషయాల్లో టైమ్ వేస్ట్ అవదు.
2.సమానత్వం అంటే ఏంటి? | What Is Concept of Samanatva ?
ఎన్ని భేధాలు ఉన్నప్పటికీ తెలివైన వ్యక్తి అందరిలోనూ దైవాన్ని చూస్తాడని కృష్ణుడు ( Lord Krishna) తెలిపాడు. ఒక వ్యక్తి గతం, అతని బ్యాగ్‌గ్రౌండ్ ఎలాంటిది అయినా వారిని గౌరవించాలని కృష్ణుడు చెప్పకనే చెప్పాడు.
సమానత్వం ప్రాధాన్యత : Importance Of Equality
- అందిరినీ సమానంగా చూడటం వల్ల అంతరాలు తొలగి, సోదరభావాన్ని పెంపొందుతుంది.
- అందరిలో దైవాన్ని చూడటం వల్ల క్షమాగుణం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం సాధ్యం అవుతుంది.
- అందరిని సమానంగా చూడటం వల్ల వివక్షలు తొలగి సమాజంలో సామానత్వం వ్యాపిస్తుంది.
3. ఆలోచనలపై అదుపు తెచ్చుకోవడం ఎలా? | How To Control of the Mind

తన ఆలోచనలపై, ఇంద్రియాల (Senses) పై అదుపు తెచ్చుకోవాలని అర్జునుడికి సలహానిస్తాడు కృష్ణుడు. అదుపులో ఉన్న మైండ్ (controlled mind) అనేది స్నేహితుడిలాంటిది అని, అదే అదుపు తప్పితే శతృవు అవుతుంది అంటాడు వాసుదేవుడు. దీని వల్ల అనేక బాధలు పడాల్సి ఉంటుంది అంటాడు.
- మనం మన అదుపులో ఉండటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మన ఆలోచనలను అదుపు చేయడానికి మనల్ని మనం అదుపు చేసుకోవాలి. దీని కోసం ధ్యానం (Meditation) చేయాలి అంటాడు వాసుదేవుడు.
- ప్రతికూల ఆలోచనలపై విజయం సాధించడానికి సానుకూలంగా (Positive Thinking) ఆలోచిండం సాధన చేయాలి. అప్పుడే నెగెటీవ్ ఆలోచనలు ఆగిపోతుంది.
- మన ఆలోచనల్ని, ఇమోషన్స్‌ను, ప్రవర్తనను మన అదుపులో పెట్టుకోవడం అనేది సాసుకూల మార్పులు తీసుకువస్తుంది.
4. ఈ క్షణంలో బతకడం | Living in the Present Moment
గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో జీవించమని వాసుదేవుడు అర్జునుడిని ప్రోత్సాహిస్తాడు. దీనిని నిష్కామ కర్మ ( Nishkama Karma) అని అంటాడు. ఫలితాల అంచనాల కన్నా ప్రస్తుతం చేతిలో ఉన్న పనిపై ఫోకస్ పెట్టడం ఇంపార్టెంట్ అంటాడు వాసుదేవుడు.
- నిష్కామ కర్మ సాధన వల్ల మనం ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచించ గలిగే శక్తిని సంపాదిస్తాం.
- రేపు ఏం జరుగుతుంది అనే ఆలోచనల పరంపరలు, భయాల నుంచి ముక్తిని పొందగలం.
- ఇలా చేయడం వల్ల అనవసరమైన విషయాలపై కాకుండా అవసరమైన విషయాలపైనే మనం ఫోకస్ చేసి విజయం సాధించగలం.
- Viral : “రూ.50 కొబ్బరిబోండాతో రూ.10 లక్షలు సలహా ఇచ్చాడు” ముంబైకు చెందిన మహిళ పోస్టుకు నెటిజెన్ల కామెంట్స్
5. విశ్వాసానికి ఉన్న బలం ఏంటి ? | What Is Power of Faith ?
దైవ శక్తిపై నమ్మకం ఉంచి అంకితం అవ్వాలని అర్జునుడికి సూచిస్తాడు వాసుదేవుడు ( Vasudev). దేవుడిపై పూర్తి నమ్మకంతో అంకితం అవ్వాలని అప్పుడే కష్టాలు తొలగి, మనిషి ప్రశాంతత పొందగలడు అని అంటాడు.
- దేవుడిపై లేదా మనపై మనకు ఉండే విశ్వాసం వల్ల కష్టసమయాల్లో కూడా ఒక ఆశ ఉంటుంది.
- దేవుడికి పట్ల విశ్వాసం (Faith Upon God) ఉంచడం వల్ల ఆశలు, కోరికల సుడిగుండాల నుంచి బయటికి వస్తాం.
- మనకన్నా శక్తివంతుడైన దేవుడిని నమ్మడం వల్ల కష్టాల్లో ఒకరి అండ ఉంది అనే విశ్వాసం కలుగుతుంది.
6. ఏదీ శాత్వతం కాదు | Concept of Impermanence

భౌతిక ప్రపంచం అనేది తాత్కాలికం అని అది ఎప్పుడూ మారుతూ ఉంటుందిన అని అర్జునుడికి చెబుతాడు వాసుదేవుడు (Lord Krishna To Arjun). ఈ భౌతిక ప్రపంచంలో బాధ, సంతోషం, విజయం, ఓటమి ఏవీ శాశ్వతం కాదు అంటాడు.
- అశాశ్వతం అనే విషయం అర్థం చేసుకుంటే జీవితంపై ఒక క్లారిటీ వస్తుంది.
- దీనివల్ల భౌతిక వస్తువులపై ఆశ తగ్గి అనవసరమైన విషయాలను సాధించాలనేే ప్రయత్నాలు చేయడం తగ్గిస్తారు.
- దీని వల్ల మనం ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెడతాము. స్థిరత్వం వస్తుంది.
- షోరూమ్స్‌లో పెట్టే మనిషిని పోలిన బొమ్మల కథ ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?
7. అంతర్గత శక్తి అంటే ఏంటి ?| Power of Inner Strength
గుండె ధైర్యాన్ని పెంచుకుని అంతర్గత శక్తిని పెంచుకోమని అర్జునుడిని ఎంకరేజ్ చేస్తాడు వాసుదేవుడు. అంతర్గత శక్తి అనేది ప్రతీ ఒక్కరిలో ఉంటుంది అని దీనికి ఆత్మతో పవిత్రమైన అనుబంధం ఉంటుంది అని అంటాడు. అసలైన శక్తి అనేది బయటి నుంచి రాదు అది లోపలి నుంచే వస్తుందంటాడు (Gita By Lord Krishna) .
- అంతర్గత శక్తిని పెంపొందించుకోవడం వల్ల మనం ఇబ్బందులు, అవాంతరాలను దాటే సామర్థ్యాన్ని పెంచుకోగలం.
- మనలో ఉన్న ధైర్యాన్ని పెంచుకోవం వల్ల మన కలలను ఆత్మవిశ్వాసంతో (Confidence) సాకారం చేసుకోగలం అంటాడు వాసుదేవుడు.
- మన సామర్థ్యం ఏంటో మనం తెలుసుకోగలిగితే లక్ష్య సాధన సులువు అవుతుంది.
8 ధర్మాన్ని పాటించడం అంటే ? | Importance of Dharma

ఫలితం ఆశించకుండా కష్టపడాలి అని అర్జునుడికి హితవు బోధిస్తాడు వాసుదేవుడు. సిన్సియర్‌గా, అంకిత భావంతో మన పని మనం చేయడం అనేది అత్యంత ముఖ్యం అని అంటాడు. అంతే కాని ఫలితం సానుకూలంగా ఉంటుందా లేదా ప్రతీకూలంగా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండటం మంచిది కాదంటాడు వాసుదేవుడు.
ధర్మ మార్గంలో
- జీవితాన్ని అర్థవంంగా జీవించాలి.
- బాధ్యతాయుతంగా ఉండాలి
- అధ్యాత్మికంగా సరైన దారిలో నడిచి ధర్మాన్ని పాటిచాలి.
9. ఆత్మ పరిశీలన అంటే ఏంటి ? | Introspection (Svadhyaya)
మన చేసిన పనులు, గతలో జరిగిన విషయాల గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలని భగవద్గీత బోధిస్తుంది. దీనినే స్వాధ్యాయ (Svadhyaya) అని అంటారు.
- తప్పుల నుంచి నేర్చుకోవడం మన బలాలను గుర్తించడం
- మన ప్రవర్తనను అర్థం చేసుకోవడం, ఒక పని చేయడం వెనక ఉన్న కారణాలు పరిశీలించడం.
- వ్యక్తిగతంగా ఎదగడానికి ఒక వ్యక్తిగా ఎదగడానికి మధ్య ఉన్న తేడాలను గుర్తించడం.
- Dr Kamini Singh : ప్రభుత్వ ఉద్యోగం మానేసి మునగచెట్టుతో వ్యాపారం…వైద్యురాలి విజయగాథ!
10.కృతఙ్ఞత గొప్పతనం ఏంటి ? | Benefits of Gratitude

కృతఙ్ఞత గొప్పతనం గురించి గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది తెలిస్తే లైఫ్ చాలా సింపుల్ (Life Tips By Lord Krishna) అనిపిస్తుంది. మన దగ్గర ఏముందో దానితో సంతోషంగా ఉండాలి. లేదంటే జీవితం మొత్తం కోరికలు నెరవేర్చుకోవడంపైనే టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది.
- ఉన్నదాంట్లో సంతోషంగా ఉండటం ప్రాక్టిస్ చేయాలి
- పాజిటీవ్ విషయాలపై ఫోకస్ చేయడం వల్ల సంతోషం పెరుగుతుంది.
- దీని వల్ల మనశ్శాంతిగా ఉండవచ్చు.
రిటైర్మంట్ తరువాత చదవి పుస్తకం కాదు | Right Way to Read Bhagavad Gita
భగవద్గీతను (Bhagavad Gita ) ఒక పుస్తకంగా మాత్రమే చూడకూడదు. అది వాసుదేవుడే స్వయంగా మనలాంటి వారికి చేసిన మార్గదర్శనం.
- మనం ఎలా బతకాలో ఎలా బతకకూడదో గీతలో చెప్పాడు వాసుదేవుడు.
- అలాంటి పుస్తకాన్ని పూజగధిలో బంధించకండి. మనం నిత్యం కూర్చునే చోటు పెట్టుకుని ప్రతీ రోజు అవకాశం ఉన్నప్పుడల్లా చదువకోవాలి.
- రిటైర్మెంట్ అయ్యాక చదివేది కాదు గీత, యువకులుగా ఉన్నప్పుడు మంచీ చెడు మధ్య వ్యత్యాసం తెలుసుకుని గీతా చెప్పిన మార్గంలో బతకి సంతోషంగా రిటైర్ అవ్వొచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.