సంతోషం అనేది అనేది పరిస్థితులను బట్టి వస్తుంది. అది లేకపోయినా పరవాలేదు గాని చిరాకుతనం రాకూడదు అనుకుంటాం. అలాంటి అనుభూతి కోసం 7 పద్దతులను అలవాటు చేసుకుంటే మీరు అనుకున్న హ్యాపినెస్ ( Tips For a Happy Life ) ఉంటుంది.
ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మొదట ఆకలి కోసం ఆ తరువాత సంతోషం కోసం ఆలోచిస్తారు. ఆనందం అనేది కొంటే వచ్చేది కాదని అందరికి తెలిసిందే. మనశాంతి దొరకనప్పుడు ఎంతో చికాగుగా ఉంటుంది. సంతోషం అనేది అనేది పరిస్థితులను బట్టి వస్తుంది.
అది లేకపోయినా పరవాలేదు గాని చిరాకుతనం రాకూడదు అనుకుంటాం. అలాంటి అనుభూతి కోసం 7 పద్దతులను అలవాటు చేసుకుంటే మీరు అనుకున్న హ్యాపినెస్ ( Tips For a Happy Life ) ఉంటుంది.
Table of Contents
1. సమయానికి నిద్ర అవసరం | Sleepwell For Happy Life
ఎలాంటి జీవికైనా నిద్ర లేకుంటే ఉత్సాహంగా ఉండదు. ఇక నిత్యం జీవితంతో పోరాడే మనిషి జీవితంలో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాల్సిందే. బాడీలో ప్రతి పార్టీ కి విశ్రాంతి కావాలంటే అందుకు నిద్ర చాలా అవసరం. అలా అని మరి ఎక్కువ నిద్రపోతే బద్ధకం కూడా పెరిగే అవకాశం ఉంది. నిద్రతో పాటు వ్యాయామం చేస్తే హ్యాపీగా ఉండవచ్చు
2. వాటిని నోట్ చేసుకోండి
ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కూడా తట్టుకునే వారు కొన్ని సార్లు చిన్న పొరపాట్లకు మదనపడుతుంటారు. అయితే అలాంటి వారు ఒక చిన్న పని చేస్తే సరిపోతుంది. ఏదైతే ఇబ్బందిగా అనిపిస్తుందో వాటిని రోజు ఒక పేపర్ లో నోట్ చేసుకోవాలి. అనంతరం ఏం చేస్తే సులువుగా అనిపిస్తుంది అనే విషయాన్ని ఆలోచించాలి. చాలా సర్వేల్లో ఇది మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిపుణులు తెలుపుతున్నారు.
3. మనుషుల మధ్య ఉండండి | Tips For A Happy Life
సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో మనిషికి మనిషి అర్ధం కావడం లేదు. చాటింగ్ లతోనే కాలాన్ని గడిపేస్తున్నారు. ఎదురుగా మాట్లాడితే ఫీలింగ్స్ అనేవి స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ఎక్కువగా సన్నిహితులతో ఎదురెదురుగా కాలాన్ని గడపండి.
4. చిన్న టూరు ప్లాన్ చేయండి | Travelling for Happy Life
ఇంట్లో కూర్చునే వాడికి బయట తిరిగేవాడికి చాలా తేడా ఉంటుంది. ఎన్ని పుస్తకాలు చదివినా ప్రపంచాన్ని కళ్లతో చూస్తూ హృదయంతో చదవకపోతే జన్మించిన దానికి అర్ధం ఉండదు. అందుకే బయట వాతావరాన్ని ఆస్వాదించడానికి ఔటింగ్ కి వెళుతుంటే మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది.
5. సాయం చేయ్ స్మైల్ వచ్చేస్తుంది | Help Others For a Happiest Life
మన జీవితం కోసం మనం ఎంత చేసుకున్నా సంతోషం అనే అర్ధ గురించి తెలియదు. అదే తోటివారికి ఓ చిన్న సహాయాన్ని చేస్తే ఆ హ్యాపినెస్ వర్ణించలేనిది. తెలియని కుతూహలం కలుగుతుంది. వీలైనంత వరకు ఓ వ్యక్తికి సహాయాన్ని చేస్తూ ఉండండి. అప్పుడు ఎలాంటి కన్నీరైనా ఆవిరైపోతుంది.
6. ఫిట్‌గా ఉండు బాస్ | Fitness For a Happy Life
జీవితంలో వ్యాయామం అనేది చాలా ముఖ్యమైంది. శరీరం ఎప్పుడు ఫిట్ గా ఉంటే అనేక రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. వ్యయమం అనేది మనలో మనకు మనోధైర్యాన్ని కూడా నింపుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆలోచన కూడా పాజిటివ్ గా ముందుకు వెళుతుంది.
7. సంగీతంతో సంతోషం |
డ్ మారాలంటే మొదటి ఔషధం మ్యూజిక్. ఎలాంటి మూడ్ అయినా సరే మ్యూజిక్ ఇట్టే చేంజ్ చేస్తుంది. గర్ల్ ఫ్రెండ్ తో గొడవైనప్పుడు ఓ రొమాంటిక్ సాంగ్ వేసుకోండి అన్ని సెట్ అయిపోతాయి. అదికూడా ప్రేమలో ఒక భాగమే అనిపిస్తుంది. అలాగే ఇతర సమస్యల నుంచి విశ్రాంతి పొందడానికి మ్యూజిక్ మంచి బూస్ట్ ఇస్తుందని నిపుణులు రుజువు చేశారు.
NAKKATOKA.COM IS BACK
గమనిక : 2016l నుంచి 2018 వరకు అద్భుతంగా సాగిన నక్కతోక ప్రయాణం అర్థాంతరంగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. చాలా గ్యాప్ తరువాత ఎంతో ఇష్టంగా పెంచుకున్న అడవిలో వదిలేయకుండా మళ్లీ ఇలా తోకపట్టుకుని ఈ రోజే వచ్చాను. ఇదే నక్కతోక 2.0 లో తొలి పోస్టు. ఈసారి బాక్సు బద్దలు కొడదాం. థ్యాంక్యూ
రెగ్యులర్‌గా నక్కతోక విజిట్ చేయండి