JioHotstar : భారతదేశ స్ట్రీమింగ్ రంగంలో ఒక కీలక అధ్యాయానికి తెరలేచింది. ఈ రంగం మరింత విస్తరించింది. 2025 ఫిబ్రవరి 14వ తేదీన జియో సినిమా, డిస్నీ+హాట్‌స్టార్లు అధికారికంగా విలీనం అయ్యాయి (JioCinema and Disney+Hostar Merger). ఈ విలీన ప్రక్రియ అనేది జియోస్టార్ (Viacom18 and Star india)) ఆధ్వర్యంలో జరిగింది. అయితే దీని వల్ల మాకేం లాభం అనేగా మీరు ఆలోచిస్తున్నారు ?
Table of Contents
500 మిలియన్ సబ్‌స్క్రైబర్లు | JioHotstar
ఈ కలయిక వల్ల మీరు ఇప్పటి వరకు చూసిన కంటెంట్ కంటే రెట్టింపు కంటెంట్ మీకు అందుబాటులోకి రానుంది. అంటే జియో సినిమా, డిస్నీ, హాట్ స్టార్ వేదికల కంటెంట్ అన్నీ కలిసి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయనున్నాయన్నమాట.
ఇందులో లైవ్ స్పోర్ట్స్ కూడా కవర్ అవ్వనుంది. దీని వల్ల 500 మిలియన్ల యూజర్‌బేస్ ఒక్క స్ట్రీమింగ్ ప్లాట్‌పైకి వచ్చినట్టు అవుతుంది. అయితే దీని వల్ల ప్రస్తుతం సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి ? భవిష్యత్తులో స్ట్రీమింగ్ పరిస్థితి ఏంటి అనేగా మీరు ఆలోచిస్తున్నారు ?
జియోహాట్‌స్టార్ విలీనం వల్ల ప్రేక్షకులకు కలిగే లాభాలు ..
జియోహాట్‌స్టార్ విలీనం తరువాత 19 భాషల్లో 3,00,000 గంటల ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో
- బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్
- హాలీవుడ్ హిట్ చిత్రాలు
- ప్రాంతీయ కంటెంట్‌తో పాటు
- లైవ్ స్పోర్ట్స్ కూడా సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉండనుంది.
అంతే కాకుండా పెద్ద పెద్ద స్టూడియోల నుంచి కూడా కంటెంట్ తెచ్చుకునే ప్రక్రియ మొదలైంది. ఈ స్టూడియోల్లో డిస్నీ, వార్నర్ బ్రోస్, హెచ్‌బీఓ (HBO), ఎన్బీసీ యూనివర్సల్ పీకాక్, పేరమౌంట్ వంటివి కూడా ఉన్నాయి. ఇక కాంపిటీషన్‌కు తావులేని ఒక అద్భుతమైన వేదిక సిద్ధం అయింది అని చెప్పాలి.
దీంతో పాటు జియోహాట్‌స్టార్‌లో మీరు 4K స్ట్రీమింగ్ ఫీచర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మీకు కంటెంట్ రికమండేషన్ కూడా ఉంటుంది. మల్టీ యాంగిల్ వ్యూయింగ్, రియల్ టైమ్ గణాంకాలు అందడం వంటి అదనపు ఫీచర్లు ఎన్నో అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పుడు ఉన్న జియోసినిమా, డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల పరిస్థితి ఏంటి?
ఈ మహా విలీనం తరువాత సబ్‌స్క్రైబర్ల మదిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న ఇప్పటికే జియోసినిమా, డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల పరిస్థితి ఏంటి అని. ఒక వేళ మీరు డిస్నీ హాట్ స్టార్ సబ్‌స్క్రైబర్ అయితే మీరు అదే ప్లాన్‌ను అదే ధరకు మరో మూడు నెలల వరకు కొనసాగించవచ్చు. మూడు నెలల తరువాత మీరు కొత్త జియో హాట్‌స్టార్ ప్లాన్‌లలో ఏదో ఒక ప్లాన్‌కు (JioHotstar Plans) మారాల్సి ఉంటుంది.
మరి జియోసినిమా సబ్‌స్క్రైబర్ల పరిస్థితి ?
ఒక వేళ మీరు జియో సినిమా ప్రీమియం (JioCinema Premium) సబ్‌స్క్రైబర్లు అయితే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఉచితంగా జియోహాట్‌స్టార్ ప్రీమీయంకు సబ్‌స్క్రైబ్ అవ్వవచ్చు.
Entertainment that never ends. Sports that never stop. Welcome to the best of both worlds.#JioHotstar #InfinitePossibilities pic.twitter.com/4a3jeEAtN6
— JioHotstar (@JioHotstar) February 14, 2025
మరి ఉచిత ఐపీఎల్ పరిస్థితి ఏంటి ?
క్రీడాభిమానులు ఈ విషయాన్ని ఫోకస్ పెట్టి చదవండి. 2023 లో జియో సినిమాలో ఐపీఎల్ (IPL) లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉచితంగా అందించారు. అయితే జియోహాట్‌స్టార్ రాకతో అది మారేలా ఉంది. సబ్‌స్క్రిప్షన్ లేకుండా బేసిక్ యాక్సిస్ అయితే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. అప్‌గ్రేడ్ అవ్వడానికి యూజర్లు పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
అయితే జియోహాట్‌స్టార్‌లో ఐపీల్, డబ్ల్యూ పీఎల్, ఐసీసీ (ICC Events) ఈవెంట్స్‌తో పాటు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్ అంటే ప్రీమియర్ లీగ్స్, వింబుల్డన్, ప్రో కబట్టి (Pro Kabaddi) , ఐఎస్‌ఎల్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ స్ట్రీమింగ్ కోసం కూడా ఆఫర్లు అందించనుంది.
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు | JioHotstar Subscription Plans
జియోహాట్‌స్టార్ టైర్డ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను (tiered subscription model) ప్రవేశపెడుతోంది. అంటే యూజర్లు వారి అవసరాలను బట్టి, ప్రయోజనాలను బట్టి ప్లాన్స్ ఎంచుకోవచ్చు.
- మొబైల్ (ప్రకటనలతో): మూడు నెలలకు రూ.149. అదే విధంగా సంవత్సరానికి రూ.499 . ఇందులో 720 పిక్సెల్స్‌తో 1 డివైజ్‌లో వీడియోను వీకించవచ్చు.
- సూపర్ (ప్రకటనలతో): మూడు నెలలకు రూ.299. అదే విధంగా ఏడాదికి రూ.899 చెల్లిస్తే మీకు 1020 పిక్సెల్స్ క్వాలిటీతో రెండు డివైజుల్లో కంటెంట్ వీక్షించే అవకాశం లభిస్తుంది.
- ప్రీమియం (ప్రకటనలు ఉండవు ): ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలలకు రూ.499, ఏడాదికి రూ.1499 రూపాయలు చెల్లించాలి. మీకు 4కేలో 4 డివైజ్‌లో వీడియోలు చూసే అవకాశం లభిస్తుంది.
గేమ్ ఛేంజర్ ?
జియోహాట్‌స్టార్ ఏర్పడటం అనేది ఇండియన్ స్ట్రీమింగ్ మార్కెట్‌లో (Indian Streaming Market) సంచలనం అని చెప్పవచ్చు. ఇంత పెద్ద కంటెంట్ బ్యాంకు ఇక ప్రేక్షకుల సొంతం కానుంది. ప్రతీ పైసా కూడా వసూల్ అయ్యేలా ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఈ కొత్త స్ట్రీమింగ్ వల్ల పోటీదారుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. అంటే ఇతర ఓటీటీ (OTT) వేదికలు ధరల్లో ఏమైనా మార్పు తెస్తాయా అనేది చూడాలి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను…మన దేశంలో కంటెంట్ స్ట్రీమింగ్ వార్ అనేది అధికారికంగా ఇంకా పెద్దదైంది. అయితే అవ్వనివ్వండి. వినియోగదారులం అయిన మనకే ఇది లాభం అని చెప్పవచ్చు.
జియోహాట్‌స్టార్ వర్సెస్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్

JioHotstar Vs Prime Videos Vs Netflix :ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎన్నో ఓటీటీ, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మధ్యే మేజర్ కాంపిటీషన్ ఉండేది. మధ్యలో జియోహాట్‌స్టార్ రాకతో పోటీ ఇక తీవ్రతరం కానుంది అని తెలుస్తోంది. అయితే తెలివైన యూజర్ తన ముందు ఉన్న ఆప్షన్స్ చూసి చెల్లించడానికి ఇష్డపడతాడు. దీని కోసం ఈ మూడు ప్లాట్‌ఫామ్స్ ఒకసారి కంపేర్ చేసి చూద్దాం..
జియోహాట్‌స్టార్ | JioHotstar Plans
- మొబైల్ ప్లాన్ : సో వ్యూవర్ అయితే ప్రకటనలతో కంటెంట్ చూటానికి మూడు నెలలకు రూ.149, సంత్సరానికి రూ.499 ఇవ్వాలి.
- సూపర్ ప్లాన్‌లో భాగంగా టీవీలో, ఫోన్లో, కంప్యూటర్లో ఎక్కడైనా రెండు చోట్ల ఒకేసారి స్ట్రీమింగ్ చేయవచ్చుు. దీని కోసం మూడు నెలలకు రూ.299, సంతవత్సరానికి రూ.899 చెల్లించాలి.
- ప్రీమియంలో మీకు నాలుగు పరికరాల్లో 4కేలో కంటెంట్ చూడవచ్చు. నెలకు రూ.299, మూడు నెలలకు రూ.499 సంవత్సరానికి రూ.1499.
ప్రైమ్ వీడియో ప్లాన్లు | Prime Video Plans
- స్టాండర్డ్ ప్లాన్ : ప్రైమ్ వీడియో స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్ వల్ల వారి లైబ్రరీ మొత్తం యాక్సెస్ చేేయవచ్చు. నెలకు రూ.299, మూడు నెలలకు రూ.599, సంవత్సరానికి రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది
- ప్రైమ్ లైఫ్ ప్లాన్ : ఇది బడ్జెట్ ప్లాన్. ప్రైమ్ లైఫ్ ప్లాన్‌లో మీరు ఏడాదికి రూ.799 చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు ఒకే డివైజ్‌లో ప్రేమ్ వీడియో చూడవచ్చు. ఇందులో ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్ సదుపాయాలు ఉండవు.
నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లు | Netflix Plans in India
- మొబైల్ ప్లాన్ : నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ప్లాన్ వచ్చేసి రూ.149. ఇందులో మీరు ఒక మొబైల్ ఫోనులో 480 పిక్సల్స్ క్వాలిటీతో కంటెంట్ ఒక నెల పాటు చూడవచ్చు.
- బేసిక్ ప్లాన్ : ఇది 720 రిజల్యూషన్‌లో కంటెంట్ చూసే అవకాశం కల్పిస్తుంది. నెలకు రూ.199 చెల్లిస్తే మీరు మొబైల్, కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్ ఏదో ఒకదాంట్లో కంటెంట్ వీక్షించవచ్చు.
- స్టాండర్డ్ ప్లాన్ : నెలకు రూ.499 కడితే 1080 పిక్సెల్స్ క్వాలిటీతో కంటెంట్ చూడవచ్చు. అది కూడా రెండు డివైజుల్లో.
- ప్రీమియం ప్లాన్ : నెలకు రూ.649 కడిలే మీరు 4K + HDR లో కంటెంట్‌ను నాలుగు పరికరాల్లో ఏకకాలంలో వీక్షించవచ్చు.