తన పేరులో ఉన్న విక్టరీకి అర్థం ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు విక్టరీ వెంకటేష్ . సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ( Sankrantiki Vastunnam ) చిత్రంతో సుకెళ్తున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే రూ.300 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇందులో విశేషం ఏముంది అనుకోకండి. ఇది కేవలం తెలుగులో విడుదలై తెలుగు ప్రేక్షకుల అందించిన విజయం. రూ.300 కోట్లు కలెక్ట్ చేసిన తొలి రీజినల్ చిత్రంగా చరిత్రలోకి ఎక్కింది ఈ చిత్రం. ఈ అరుదైన విజయం సాధించిన తొలి హీరోగా వెంకటేష్ (Victory Venkatesh) రికార్డు క్రియేట్ చేశాడు.
ప్యాన్ ఇండియా చిత్రాలు చతికిల పడుతున్న సమయంలో…
ప్యాన్ ఇండియా స్థాయిలో కూడా కొన్ని చిత్రాలు సాధించలేని అరుదైన ఫిల్మీఫీట్‌ను సంక్రాంతికి వస్తున్నాం ( Sankrantiki Vastunnam ) చిత్రం సాధించింది. ఈ మూవీ సాధించిన రికార్డు కలెక్షన్ల వల్ల ప్రాంతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు చిత్రాన్ని బ్రహ్మరథం పడతారు అని ఈ మూవీ సాధించి చూపించింది.

కంటెంట్ బాగుంటే డబ్బుల వర్షం కురుస్తుంది అని చాటి చెబుతోంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ చిత్రం వల్ల నిర్మాతలతో పాటు అందరూ ప్రాఫిట్లో ఉన్నారు
కు
కుటుంబ, హాస్య కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు ఒరిజినల్ చిత్రంగా చరిత్ర పుస్తకాల్లో తన పేరును నమోదు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రూ.303 కోట్లను కలెక్ట్ చేసింది.
అనిల్ వల్ల కలెక్షన్స్ ఫుల్
తెలుగులో వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ( Anil Ravi Pudi ) ఈ మూవీతో తన సత్తా మరోసారి చాటాడు.వెంకటేష్ మార్కు కామెడీతో ఈమూవీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చేలా చేస్తోంది. వెంకటేష్, అనిల్ కాంబినేషన్ అనేది తిరుగులేని జోడిగా మారింది అని చెప్పవచ్చు.
ఈ హిట్ పెయిర్ వల్ల నిర్మాతల జేబులు నిండుతున్నాయి.హీరోకు హిట్, దర్శకుడికి కీర్తి లభిస్తోంది. అనిల్ విజయాల వల్ల నిర్మాతలతో పాటు పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ కూడా ఫ్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. నక్కతోకను facebook,లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.