గతంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి పలువురు దిగ్గజాలకు పద్మా అవార్డులు ( Tollywood Padma Awards ) వరించాయి. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులతో సత్కరించబడిన తెలుగు సినీ సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే…
భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మా అవార్డులు కూడా ఒకటి. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన భారతీయులకు ఈ పురస్కారాలతో గౌరవిస్తుంది భారత ప్రభుత్వం. ఇటీవలే ప్రకటించి పద్మ పురస్కారాల్లో తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ( Padma Bhushan to Nandamuri Balakrishna ) కళల విభాగంలో పద్మభూషణ్ వరించిన విషయం తెలిసిందే.

Table of Contents
గతంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి పలువురు దిగ్గజాలకు కూడా పద్మా అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులతో సత్కరించబడిన తెలుగు సినీ సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే…
1.నందమూరి తారక రామా రావు ( ఎన్టీఆర్ )

తెలుగు వారి అన్నగారు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ( Nandmuri Taraka Rama Rao ) 1968 లో పద్మశ్రీ వరించింది.తెలుగు సినిమాకు, తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు వరించింది.తెలుగు సినిమా ఉన్నంత వరకు అజరామరం అయిన కీర్తికి, కలికితురాయిగా నిలిచింది ఈ అవార్డు.అయితే ఆయనకు భారత రత్న ఇవ్వాలని అని తెలుగువారు కోరుకున్నా ఆ ఆశ ఇంకా నెరవేరలేదు.
2.అక్కినేని నాగేశ్వర రావు ( ఏఎన్నార్ )
తెలుగు తెరపై ఎవర్ గ్రీన్ నటుడు, దేవదాసుతో దేశ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర రావుకు ( Akkineni Nageshwar Rao ) 1968 లో పద్మశ్రీ, 2011 లో పద్మ విభూషణ్ వరించాయి. సుమారు 7 దశాబ్దాల పాటు తెలుగు కళామతల్లికి సేవలు చేసిన ఏఎన్నార్ తెలుగు సినిమా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు.
3.చిరంజీవి

స్వయంకృషితో పైకి ఎదిగి, టాలీవుడ్ మెగాస్టార్‌గా అవతరించిన చిరంజీవి ( Chiranjeevi ) రెండు సార్లు పద్మా అవార్డులను కైవసం చేసుకున్నారు. తన నటన,డ్యాన్స్ స్టైల్‌తో లక్షలాది మంది నటులకు ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్. తెలుగు వెండి తెరకు ఆయన చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం ఆయనను 2006లో పద్మ భూషణ, 2024లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
4. కే విశ్వనాథ్
కళాతపస్విగా తెలుగువారు పిలుచుకునే దిగ్గజ దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ ( K Vishwanath ) .తెలుగుతనం ఉట్టిపడే సినిమాలు చేసి తెలుగు ప్రజల మన్ననలు అందుకున్న ఆయనకు 1992 లో పద్మశ్రీ వరించింది. సాహిత్యం, సామాజిక సందేశంతో ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాలు తెరకెక్కించారు కే విశ్వనాథ్.ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం
5. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
నాలుగు దశాబ్దాల పాటు తెలుగుతో పాటు ఇతర భాషల్లో 40,000 పైగా పాటలు పాడిన దిగ్గజ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ( SP Bala Subrahmanyam ). ఆయన సుమధుర గాత్రానికి, ఏ నటుడికైనా సరిపోయే విధంగా ఉండే ఆయన స్వరానికి రెండు సార్లు పద్మా అవార్డులు వరించాయి.2001 లో ఆయనకు పద్మ శ్రీ వరించగా, 2011 లో ఆయనకు పద్మ భూషణ్ పురస్కారం లభించింది.
5. బీఎన్ రెడ్డి
కళాద్రష్టగా కీర్తి గడించిన తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు బీఎన్ రెడ్డి ( BN Reddi ).ముప్పై ఏళ్ల సినీ జీవితంలో ఆయన తీసిన చిత్రాలు కేవలం 11 మాత్రమే. కానీ ప్రతీ సినిమా ఒక ఆణిముత్యంగా నిలిచిపోయింది. సినిమా తీసే సమయంలో కొన్ని సార్లు ఆయన నటీనటుల పెర్ఫార్మెన్స్ చూసి కట్ చెప్పడం మర్చిపోయి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం.బీఎన్ రెడ్డికి 1970 లో పద్మభూషణ్ పురస్కారం లభించింది.
6. రాఘవేంద్ర రావు
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు (K Raghavendra Rao ) ప్రత్యేక స్థానం ఉంది.వందకు పైగా సినిమాలను తెరకెక్కించిన రాఘవేంద్ర రావుకు 2005లో పద్మశ్రీ వరించింది. తెలుగు సినిమా ప్రస్థానంలో ఈయన కీలక పాత్ర పోషించారు.
7.కృష్ణ
అతివేగంగా సినిమాలు చేసి దర్శకులకు, నిర్మాతలను బిజీగా ఉంచి వరుస విజయాలు అందుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ ( Super Star Krishna ). తెలుగులో ఎన్నో టెక్నిక్స్, స్టైల్స్, కాన్సెప్టులను తొలిసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఆయన. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2009 లో పద్మ భూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది.
8. ఎస్ఎస్ రాజమౌళి

బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసి, ట్రిపుల్ ఆర్తో భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) .హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ సైతం హాలీవుడ్‌లో సినిమా చేయాలంటే నాకు ఒక మాట చెప్పు అన్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు రాజమౌళి ప్రతిభ గురించి. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న రాజమౌళికి 2016 లో పద్మ శ్రీ వరించింది.
9. రామా నాయుడు
భారతీయ సినిమాకు మొఘల్‌గా పేరు సంపాదించుకున్న లెజెండరీ సినీ నిర్మాత రామా నాయుడు ( Rama Naidu ). తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా సినిమాలు నిర్మించిన ఆయనకు 2012 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.
వీరితో పాటు తెలుగు సినిమాకు విశేష సేవలు అందించిన మోహన్ బాబు , ఎమ్మెన్ నారాయణ, శోభనా చంద్రకుమార్, ఎమ్‌ఎమ్ కీరవాణి వంటి అనేక మంది దిగ్గజాలకు పద్మ పురస్కారాలు లభించాయి.