ప్రేమికుల రోజు అనేది ఒక రోజు మాత్రమే సెలబ్రేట్ చేయరు. ఫిబ్రవరి 14 కన్నా 7 రోజుల ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ మొదలవుతాయి. దీనిని వ్యాలెంటైన్స్ వీక్ ( Valentine Week 2025 ) అని పిలుస్తారు.
వ్యాలెన్‌టైన్స్ డే లేదా ప్రేమికుల రోజు అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు సెలబ్రేట్ చేసే ఒక స్పెషల్ డే. ఫిబ్రవరి 14వ తేదీ అంటే అందరికి ముందుగా ఈ రోజే గుర్తుకు వస్తుంది. అయితే ప్రేమికుల రోజు అనేది ఒక రోజు మాత్రమే సెలబ్రేట్ చేయరు. ఫిబ్రవరి 14 కన్నా 7 రోజుల ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ మొదలవుతాయి. దీనిని వ్యాలెంటైన్స్ డే వీక్ (Valentine Day Week 2025) అని పిలుస్తారు.
ఈ 7 రోజుల్లో ఏడు థీమ్స్‌తో ప్రేమికులు సెలబ్రేట్ చేస్తుంటారు.ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకత ఒక విశిష్టత ఉంటుంది. మనసులో ఉన్నది చెప్పేందుకు ఏడు మార్గాలుగా కూడా దీనిని భావించవచ్చు. మరి ఆ థీమ్స్ ఏంటో…వ్యాలెంటైన్స్ డే చరిత్ర ఏంటో తెలుసుకుందామా ?
Table of Contents
మొదటి రోజు | రోజ్ డే | Rose Day

వ్యాలెంటైన్స్ వీక్‌లో మొదటి రోజు వచ్చేసి రోజ్ డేతో మొదలవుతుంది. ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డే ఉంటుంది. తమ ప్రియమైన వారికి గులాబీ పువ్వులను ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇందులో రంగు రంగుల పువ్వులు ఉండేలా చూసుకుంటారు. ప్రతీ రంగు మనసులోని ఒక భావాన్ని వ్యక్తపరుస్తుంది అంటారు. ఇందులో ఒక్కో రంగుకు ఒక్కో విశేషం.
- ఎరుపు : ప్రేమ
- పసుపు : స్నేహం
- పింక్ : కృతఙ్ఞత
2వ రోజు | ప్రపోజ్ డే | Propose Day |

ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే గాసెలబ్రేట్ చేస్తారు. తమ ప్రేమను మూడు ముక్కల్లో ఐలవ్ యూ ( I Love You ) అని చెప్పకుండా ఇంకా క్రియేటీవ్‌గా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే ప్రేమికుడు మూవీలో ఒక పాటలో లైన్ ఉంటుంది చూడండి…
“ఈ పూట చెలి నా మాటా ఇక కరువై పోయెనులే, అదరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే”
అదరము అంటే పెదవి, ఉదరము అంటే పొట్ట భాగం. అదరం ఉదరం మధ్యలో ఉండేదేంటి ? హృదయం.
చాలా మంచి లైన్ కదా. ఇలా క్రియేటీవ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. అయితే ఈ తరంలో ఇలా చెబితే అపరిచితుడు మూవీలో రామానుజంలా అనుకుని పక్కన పెట్టేస్తారు. జస్ట్ టెల్లింగ్. క్రియేటివిటీ అనేది ఇలా అలా అని కాకుండా ఎలా అయినా ఉండవచ్చు. కానీ ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.
3వ రోజు | చాకోలెట్ డే | ఫిబ్రవరి 9

చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లుంటారా ? ఉండరు కదా. ప్రేమికుల రోజుకు ముందు చాకోలెట్ డే అనేది ఇద్దరు ప్రేమికులు ( Lovers ) ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకునే తీయని విధానం అని చెప్పవచ్చు. ఈ రోజున తీయని చాకొలెట్ ఇవ్వడం అనేది బంధాన్ని మరింత బలోపేతంగా మార్చుతుంది అని నమ్ముతారు.
4వ రోజు | టెడ్డి డే | ఫిబ్రవరి 10

ప్రేమను సున్నితంగా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకునేవారి కోసమే టెడ్డి డే. అయితే టెడ్డి లోపల దూదిలాంటి స్టఫ్‌తో పాటు కానుకలు కూడా దాచుతారు కొంత మంది. ఒకరిని ఒకరు మిస్ అయినప్పుడు దిండును హగ్ చేసుకోవడం కన్నా టెడ్డిని హగ్ చేసుకుంటే బాగుంటుంది అని ఇలా పెట్టారేమో.
ఏదేమైనా చెట్టుకు సైతం చీరకట్టి తాకి చూసే మనసు ( బాబా మూవీలో సాంగ్ నుంచి తీసుకున్న లైన్ ఇది ) ఉండే యవ్వనంలో టెడ్డి డేలో తప్పేం లేదు కదా.
5వ రోజు | ప్రామిస్ డే | ఫిబ్రవరి 11

ప్రామిస్ డే సందర్భంగా ప్రేమికులు ఒకరికి ఒకరు తాము ఎంతగా కమిటెడ్‌గా ఉన్నామో ప్రామిస్ చేస్తారు. తమ బంధాన్ని మరింత బలంగా మార్చేందుకు కొత్త ప్రయాణం వైపు వెళ్లేలా ప్రమాణం చేస్తారు. ఒకరికి ఒకరు జీవితాంతం తోడుంటామని ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ మిస్ అవ్వకుండా చూసుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు.
6వ రోజు | Hug Day | ఫిబ్రవరి 12

చలికాలంలో కాఫీ మగ్…అవసరం అయినప్పుడు నెచ్చలి వెచ్చని హగ్ ఎవరు కాదనగలరు చెప్పండి. కాఫీ మగ్ కాకపోతే టీ మగ్‌తో రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ నచ్చిన వారి హగ్‌ను మనం ఎలా రిప్లేస్ చేస్తాం. వేలా పదాలను పెదాల తీరం దాటించలేని మూగ నావికులు ఒక్క హగ్గుతో ఒడ్డుకు చేరుతారు.
7వ రోజు | కిస్ డే | ఫిబ్రవరి 13

ప్రేమను వ్యక్తపరిచే అత్యంత ఇమోషనల్, ఇంటిమేట్ మార్గమే ముద్దు. ముద్దంటే చేదా ఇపుడా ఉద్దేశం లేదా ఇప్పుడొద్దావంటే చిన్నవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడ అని ఒక పాట ఉంది.
ఒకరికి ఒకరు తోడున్నామని మనసులు మాట్లాడుకుంటే సరిపోతుందా…. పెదవులు కూడా మాట్లాడుకోవాలి కదా. మనసులు కలిస్తే సరిపోతుందా. పెదవులు కూడా కలవాలి కదా అన్నట్టు ఈ రోజును సెలబ్రేట్ చేస్తుంటారు ప్రేమికులు.
8వ రోజు | వాలెంటైన్స్ డే | ఫిబ్రవరి 14

నిజానికి ప్రేమికులకు ప్రతీ రోజు ప్రేమికుల రోజే. అయితే ప్రపంచంలోని ప్రేమికులు అంతా కలిసి చేసుకునే వేడుకే ప్రేమికుల రోజు. ఈ రోజున చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. చాలా మంది రొమాంటిక్ డిన్నర్ చేస్తారు. ఒకరికి ఒకరు కానుకలు ఇస్తుంటారు.
నిజానికి ప్రేమికుల రోజు అనేది కేవలం బ్యాచిలర్స్ కోసమే అనుకుంటారు. పెళ్లి అయిన జంటలు కూడా ఈ రోజున తమ జీవిత భాగస్వామితో కలిసి సరదాగా ఒక రొమాంటిక్ డిన్నర్‌కు ప్లాన్ చేయవచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.