Valentines Day History: ప్రేమికుల రోజు ఎలా మొదలైంది ? ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎలా సెలబ్రేట్ చేస్తారు ?

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేస్తారు. అయితే వ్యాలెంటైన్స్ డే సెలబ్రేషన్ ఎప్పుడు మొదలైంది (Valentines Day History) అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు ఏరోజు మొదలైంది ? ఎందుకు మొదలైంది ? కాలంతో పాటు ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం.

రోమన్ల సమయంలో | Roman Roots Of Valentines

ప్రేమ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేము కానీ ప్రేమికుల రోజు కథ రోమన్ల సమయంలో మొదలైంది అని చెప్పగలం. ఆ సమయంలో ఫిబ్రవరి నెల మధ్యలో లూపర్‌కెలియా అనే వేడుక నిర్వహించేవారు. ఇది సంతాన భాగ్యం కలిగించే లుపెర్కస్‌కు (Lupercus) గౌరవార్థం నిర్వహించేవారు. ఈవేడుక చాలా ఇంట్రెస్టింగ్‌‌గా జరిగేది. ఇందులో లాటరీ విధానంలో అమ్మాయిని అబ్బాయిని సెలక్ట్ చేసి వారిని జంటగా ప్రకటించేవారు.

సెయింట్ వ్యాలెంటైన్స్ | Saint Valentine

వ్యాలెన్‌టైన్స్‌ డేకి ఆ పేరు రావడానికి కారణం క్యాథలిక్ చర్చికి చెందిన సెయింట్ వ్యాలెంటైన్ అనే సెయింట్. రోమన్ చక్రవర్తి క్లాడియస్ 2 రాజ్యంలో ఇతను ప్రీస్ట్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో యువకులు పెళ్లి చేసుకోవద్దని క్లాడియస్ చక్రవర్తి (Emperor Claudius II) ఆదేశాలు జారీ చేశాడు.

ఎందుకంటే సింగిల్‌ పురుషులు యుద్ధంలో యాక్టివ్ ఉంటారని అతను అనుకునేవాడు.  

కానీరాజు శాసనాన్ని ధిక్కరించిన వ్యాలెంటైన్ రహస్యంగా జంటల పెళ్లల్లు జరిపించేవాడు. రాజుకు విషయం తెలిసింది. అతన్ని 269 ఏడి ఫిబ్రవరి 14న మరణశిక్ష పడింది. అతని త్యాగాన్ని ప్రేమకు చిహ్నంగా భావించిన వ్యాలెంటైన్స్‌డే సెలబ్రేషన్స్ నేటికీ చేస్తుంటారు.

ట్రెండ్ ఎప్పుడు మొదలైంది | How Trend Began

కాలం మారుతన్నా కొద్ది వ్యాలెంటైన్స్‌డే ప్రేమకన్నా రోమాంటిక్‌ డేగా గుర్తింపు తెచ్చుకోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఫిబ్రవరి 14న యోధులు (Knights) తమ ప్రేమను అమ్మాయిల ముందు వ్యక్తపరచడానికి ప్రయత్నించేవారు. ఈ రోజును రొమాంటిక్ ప్రేమకు ప్రతీకగా భావిస్తూ 1382 లో జెఫ్రీ ఛాసన్ అనే కవి పలు కవిత్వాలు కూడా రాశాడు.

18వ శతాబ్దంలో | Commercial Angle

Valentines Day History
| రోమన్ల కాలం నుంచి ఫిబ్రవరిలో స్పెషల్ ఈవెంట్స్ జరిగేవి

కొన్ని దేశాల్లో  వాలెంటైన్స్ డే రోజు సెలవు ఇవ్వడం చేస్తుంటారు. ఈ రోజుల్లో వ్యాలెంటైన్స్ డే అంటే ఒక మార్కెట్‌గా మారిపోయింది. పూర్తిగా కమర్షియల్‌గా మారిపోయింది. 18వ శతాబ్దం వచ్చేసరికి ఇంగ్లాండ్‌లో చేతితో రాసిన నోట్స్ ఒకరికి ఒకరు ఇవ్వడం మొదలు పెట్టారు. 19వ శతాబ్దం వచ్చేసరికి ఆధునిక ప్రింటింగ్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో వాలెంటైన్స్ డే కార్డులు ఒక ట్రెడిషనల్‌గా మారాయి. 1840 సమయానికి ఎర్రని రిబ్బన్లు కార్డులపై అతకడం మొదలయ్యాయి.

ఈ తరం సెలబ్రేషన్స్ | Valentine’s Day Celebrations Today

ప్రేమికుల రోజును నేడు అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేయడం ఒక ఆచారంగా మారిపోయింది. సరిహద్దులు లేని ఒక పండగగా ఇది అవతరించింది. గ్రీటింగ్ కార్డులు ఎక్స్‌‌ఛేంజ్ చేసుకోవడం, గిఫ్టులు, ఛాకొలెట్స్ (Chocolates), పువ్వులు, బంగారు ఆభరణాలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు.ఈ సందర్భంగా  రొమాంటిక్ డిన్నర్, సర్‌ప్రైజ్ ట్రిప్స్ ప్లాన్ చేయడం, మనసులో ఉన్నది చెప్పడం చేస్తుంటారు.

వినూత్న సంప్రదాయాలు | Traditions of Valentines Day

ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్‌ డే అనేక దేశాల్లో అనేక రకాలుగా సెలబ్రేట్ చేస్తుంటారు.కొన్ని దేశాల్లో ఎలా సెలబ్రేట్ చేస్తారో చూద్దామా

  • జపాన్ | Valentines Day In Japan : ఇక్కడ మహిళలు పురుషులకు చాకొలెట్స్ ఇస్తుంటారు.దీనికి రిటర్న్ గిఫ్టుగా పురుషులు మార్చి 14న వైట్ డే ( White Day March 14) రోజున మంచి కానుకను ఇస్తుంటారు.
  • దక్షిణ కొరియా | Valentines Day In South Korea: ప్రేమికుల రోజు, వైట్‌డేతో పాటు కొరియాలో బ్లాక్‌డే సెలబ్రేట్ చేస్తారు. ఏప్రిల్ 14వ తేదీన సింగిల్స్ అంతా ఒక్కచోట మోపై అంటే ఒక చోట చేరి బ్లాక్ నూడిల్స్ తింటూ తాము ఎందుకు ఒంటరిగా ఉన్నామా అని ఆలోచిస్తూ బాధపడతారు.
  • ఫిన్లాండ్ | Valentine’s Day in Finland : ఫిన్లాండ్‌లో ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా కాకుండా స్నేహితుల రోజుగా సెలబ్రేట్ చేస్తారు. స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేస్తారు. రొమాంటిక్ యాంగిల్ అస్సలే ఉండదు.
  • షోరూమ్స్‌లో పెట్టే మనిషిని పోలియన బొమ్మల కథ ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి? 

ఆసక్తికరమైన విషయాలు | Amazing Valentines Day Facts 

  • పక్కా కమర్షియలు : ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కమర్షియల్ హాలీడేలలో వ్యాలెంటైన్స్ డే కూడా ఒకటి. కేవలం అమెరికాలోనే (USA) గిఫ్టుల రూపంలో, సెలబ్రేషన్స్ కోసం అంటూ ప్రతీ ఏడాది 20 బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారట.
  • ప్రేమ గుర్తులు : హార్ట్, క్యూపిడ్, ఎర్ర గులాబీలు వీటిని ప్రేమకు గుర్తుగా భావిస్తూ ప్రేమికుల రోజు ఎక్కువ మంది వీటిని ఒకరికి ఒకరు కానుకగా ఇచ్చిపుచ్చుకుంటారు.
  • 100 కోట్ల కార్డులు : ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 కోట్ల వాలెంటైన్స్ డే కార్డులను ఒకరికి ఒకరు పంచుకుంటారట. క్రిస్మస్ తరువాత ఇన్ని కార్డులు పంచుకునేది ప్రేమికుల రోజు మాత్రమే అవడం విశేషం.

తొలి హార్ట్ షేప్ చాక్లెట్ షేప్ బాక్స్

ప్రపంచంలోనే తొలి దిల్ (Heart Shaped Chocolate Box) ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్సును 1861 లో పరిచయం చేశారు. దీనిని క్యాడ్బరి చాకొలెట్ సంస్థ వ్యవస్థాపకుడు అయిన జాన్ క్యాడ్బరి కుమారుడు రిచర్డ్ క్యాడ్బరి దీనిని ప్రపంచం ముందుకు తీసుకువచ్చాడు. దీనిని కూడా వాలంటైన్స్ డే రోజునే పరిచయం చేశాడు.నేడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 36 మిలియన్ల హార్ట్ షేప్ ఉన్న చాక్లెట్ బాక్సులు సేల్ అవుతాయి. వీటి బరువు సుమారు 58 మిలియన్ల పౌండ్స్ ఉంటుంది.

రోమన్ల నుంచి ఈ రోజు వరకు కూడా ప్రేమికులు రోజులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేమికుల రోజు అనేది ఒక ప్రపంచ ఆచారంగా మారిపోయింది. తరాలు మారినా,కవిత్వాల్లో ఎంచుకునే పదాలు మారినా, ట్రెండ్స్ మారినా, కథలు మారినా ప్రేమికుల మధ్య భావాలు మాత్రం మారవు. ప్రేమ గుండెల్లో ఉన్నప్పుడు అది కొట్టుకునే వేగం మారదు. ప్రియమైన వారు చూసినప్పుడు శరీరంలో వచ్చే వైబ్రేషన్స్ మారవు.

మాటలకు అందని భావాలను చెప్పేందుకు ప్రయత్నించే ప్రేమికుల కథలు నిన్నా ఉన్నాయి. నేడూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రేమకు మరణం లేదు.

📣 ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Leave a Comment