Mirrors In Elevator: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు పెడ‌తారో ఎప్పుడైనా ఆలోచించారా?? ఇది చ‌ద‌వండి

ఈ విష‌యం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్ర‌శ్న సందేహం మీక్కూడా వ‌చ్చిందా..?? అయితే దానికి స‌మ‌ధానం చ‌ద‌వండి. పెద్ద పెద్ద భవంతుల్లో సుల‌భంగా పై అంత‌స్తులకు చేరుకోవ‌డానికి లిప్ట్‌ల‌ను వాడ‌టం (Mirrors In Elevator) మొద‌లు పెట్టిన కాలం అది.

రోజురోజుకు లిప్ట్‌లు వాడుతున్న‌ భ‌వ‌నాల సంఖ్య పెర‌గ‌డం. ఎక్కువ ఫ్లోర్స్‌తో పెద్ద పెద్ద భ‌వంతులు వెలుస్తూ ఉండ‌టంతో ఒక పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది బిల్డ‌ర్స్‌కు.

కాలం ఆగిపోయింది | Why There Are Mirrors in Elevator

చివ‌రి ఫ్లోర్స్ లేదా టాప్‌లో ఉన్న ఫ్లోర్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చిన వాళ్లు లిఫ్ట్ లో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డం కామ‌న్‌. అలాంటి వాళ్లు ఒక్కొక్క‌రిగా బిల్డ‌ర్స్ ద‌గ్గ‌రికి వెళ్లి మీ లిఫ్టులు చాలా స్లోగా వెళ్తున్నాయి. వాటిని స్పీడ్ చేయండి అని చెప్ప‌డం ప్రారంభించారు. దీన్నిసీరియ‌స్‌గా తీసుకున్న బిల్డ‌ర్స్ ఎలివేట‌ర్స్ తయారు చేసే సంస్థ‌ల‌కు ఈ విష‌యాన్నిచెప్పారు.

అయితే అందులో ఒక ఇంజ‌నీర్ లిప్ట్ వేగం పెంచితే అది కొన్ని స‌మ‌స్య‌ల‌కు కారణం అవ్వొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనికి ఇంజినీరింగ్ టెక్నిక్స్‌తో కాకుండా..సైకాలాజిక‌ల్‌గా ఆలోచించాడు. లిప్ట్‌లో వాళ్లు ఎందుకు బోర్ అవుతున్నారు.. ?? ఏం చేయోచ్చు అని ర‌క‌ర‌కాలుగా ఆలోచించారు.

1. ఇదే లాజిక్ | Logic Behind Mirrors In Elevator

Mirrors In Elevator
చిన్న గదిలో ఇరుక్కున్న భావన కలుగుతుంది. ఈ భావన కలగకుండా ఉండేందుకు లిఫ్టులో అద్దాలు పెడితే కొంచెం విశాలంగా కనిపిస్తుంది అని అద్దాలు పెడతారు. (Person In Photo Is MG Kishore , Founder Of NakkaToka.com )

లిప్ట్ వాళ్ల‌కు స్లో అనిపించ‌డానికి కార‌ణం వాళ్ల‌కు లిప్ట్‌లో చేయ‌డానికి ఇంకేం పని లేక‌పోవ‌డమే అని అర్థం చేసుకున్నారు. లిప్ట్ స్పీడ్ బాగానే ఉన్నా.. అందులో ఎక్కేవాళ్లు అది త‌క్కువ స్పీడ్‌తో వెళ్తుంద‌ని ఫీల్ అవుతున్నార‌ని తెలుసుకున్నారు.

దీనికి ఏం చేయాలో ఆలోచించి అద్దాలు పెట్ట‌డం మొద‌లు పెట్టారు. దీని త‌ర్వాత లిప్ట్ స్పీడ్ గురించి ఎవ‌రు ఆలోచిస్తారు చెప్పండి. అద్దం తుడ‌వ‌ట్లేద‌ని కంప్లెంట్స్ చేస్తారు అంతేగా

2.విశాలంగా కనిపించేందుకు

దీంతో పాటు లిఫ్టులో ఎక్కేవారికి లిఫ్టు చిన్నదిగా కనిపించకుండా ఉండేందుకు కూడా అద్దాలను బిగిస్తారు. లిఫ్టు సాధారణంగా 6 నుంచి 10 అడుగులు ఉంటుంది. ఇంతకన్నా చిన్నగా లేదా ఇంతకన్నా పెద్దగా కూడా ఉంటాయి. అయితే సైజు ఎంత ఉన్నా కానీ అందులో ఉంటే చిన్న గదిలో ఇరుక్కున్న భావన కలుగుతుంది. ఈ భావన కలగకుండా ఉండేందుకు లిఫ్టులో అద్దాలు పెడితే కొంచెం విశాలంగా కనిపిస్తుంది అని అద్దాలు పెడతారు.

4.మరింత కాంతి | Lights in Lifts

లిఫ్టులో కొన్ని లైట్స్ మాత్రమే ఉన్నా అంత ప్రకాశం కనిపించడానికి అద్దాలు కూడా కారణమే. లేదంటే లిఫ్టు ఏదో గుహలా కనిపిస్తుంది. అద్దంపై పడిన వెలుగు రిఫ్లెక్ట్ అవుతుంది. అది మిగితా భాగాల్లో ప్రసరించి అన్నిచోట్లా లైట్ పడేందుకు దోహదం చేస్తుంది. దీంతో లిఫ్టు ఫ్లోర్లు మారుతూ ఉన్నా కానీ అందులో ఉన్నవారికి ఎక్కువగా తేడాగా అనిపించదు. కొంచెం కంఫర్టుగా అనిపిస్తుంది.

5. భద్రత, అవగాహన కోసం

భద్రతా దృష్టిలో చూసినా లిఫ్టులో అద్దాలు ఉండటం చాలా అవసరం. లిఫ్టులో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. దీంతో అందులో ఉండే వారు అద్దాలతో ఇతరులను, అందులో జరిగే విషయాలపై ఒక కన్నేసి ఉంచగలరు. అందులో ఎంత మంది పట్టగలరు అనేదానిపై అవగాహన ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే వెంటనే కొత్తవారికి ఫుల్ అయింది అని చెప్పగలరు. దీంతో పాటు కొత్తవారు, పాతవారి కదలికలు వెంటనే తెలుస్తాయి.

6. ఎలా ఉన్నామో చెక్ చేసుకోవచ్చు |Mirrors In Elevator

Mirrors In Elevator
ఇంటర్వ్యూలు లేదా ప్రెజెంటేషన్‌కు వెళ్లే ముందు టై సరిగ్గా ఉండా, టక్ సరిగ్గా ఉందా అని, క్రాఫ్ చెరిగిందా, హెయిర్ పిన్ ఎలా ఉంది ఇలా చెక్ చేసుకోవడానికి కూడా అద్దాలు ఉపయోగపడతాయి.

లిఫ్టులో అద్దాల వల్ల మరో సాధారణ, పాపులర్ లాభం ఏంటంటే ఇందులో మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకు వెళ్లాలన్నా, ప్రియమైన వారికి కలవడానికి వెళ్లాలన్నా కొన్ని సార్లు మనం ఎలా ఉన్నామో చెక్ చేయలేనంత హడావిడి ఉంటుంది. లిఫ్టు దిగడానికి ముందు మన లుక్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలు లేదా ప్రెజెంటేషన్‌కు వెళ్లే ముందు టై సరిగ్గా ఉందా, టక్ సరిగ్గా ఉందా అని, క్రాఫ్ చెరిగిందా, హెయిర్ పిన్ ఎలా ఉంది ఇలా చెక్ చేసుకోవడానికి కూడా అద్దాలు ఉపయోగపడతాయి.

7. సోషల్ సైకాలజీ ప్రకారం | Elevator Psychology

ఎలివేటర్‌లో లిఫ్టు ఉండటటం అనేది కొన్ని సార్లు తెలియకుండానే ఒక కంఫర్ట్‌ను ఇస్తుంది. ఇతరులను చూసి ఇబ్బంది పడటం కన్నా లిఫ్టులో మనల్ని మనం చూసి కంఫర్ట్‌గా ఫీల్ అవ్వవచ్చు. సోషల్ సైకాలజీ ప్రకారం చాలా మంది ఎదుటివారి కళ్లల్లో చూస్తూ మాట్లాడేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరీ ముఖ్యంగా ఎలివేటర్ లాంటి లిమిటెడ్ స్పేస్‌లో కొత్తవారి మధ్యలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం నుంచి తప్పించే విషయంలో ఈ అద్దాలు ఉపయోగపడతాయి.

8. సౌందర్యం కోసం | Luxury Elevators

పెద్దపెద్ద అపార్టుమెంట్స్‌లో , కమర్షియల్ బిల్డింగ్స్‌లో, హోటల్స్‌లో ( Hotels ) లిఫ్టులు అనేవి వారి లగ్జరీని చూపించే ఒక సాధనం కూడా. అందుకే వారి ఎలివేటర్స్‌లో ఇంటీరియర్‌పై బాగా ఫోకస్ చేస్తారు. అందులో లైటింగ్, కార్పేట్, ఫ్యాన్స్, బటన్స్ వంటి అంశాలతో పాటు అద్దాలను పెడతారు. విశాలంగా ఉండే అలాంటి లిఫ్టులు అద్దాల వల్ల ఒక మ్యాజిక్ వరల్డ్‌లా అనిపిస్తుంది.

9. భవనానికి ఆభరణం | History Of Elevators

Mirrors In Elevator
| లిఫ్టు వాడటం అనేది 19వ, 20 శతాబ్దం మధ్యలో ప్రారంభం అయింది అని తెలుస్తోంది

లిఫ్టులు ఎప్పటి నుంచి వాడటం మొదలు పెట్టారు అనే విషయం గురించి చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. నిజానికి లిఫ్టు వాడటం అనేది 19వ, 20 శతాబ్దం మధ్యలో ప్రారంభం అయింది అని తెలుస్తోంది. ఇంజినీరింగ్‌ వల్ల ఎన్నో అద్భుతమైన కట్టడాలు కడుతున్న సమయంలో , భారీ భవంతుల నిర్మాణం జరుగుతున్న సమయంలో లిఫ్టుల వినియోగం పెరిగింది. ఈ సమయంలో లిఫ్టులు అనేవి భవనానికి ఆభరణంగా భావించేవారు. అందులో అద్దాలు ఉంటే ఇంకా వాడు పెట్టిపుట్టాడు అనే అనేవాళ్లు.

10. లిఫ్టులో అద్దాలు ఉంటే అఇలా…లేకుంటే ఇలా..

చాలా మంది ఆర్కిటెక్టులు, డిజైనర్లు మనుషులు లిఫ్టుల్లో ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడుతారో అని తెలుసుకునేందుకు వారి ప్రవర్తనపై పరిశోధన నిర్వహించారు. అయితే వారి ప్రవర్తన తెలుసుకునేందుకు అద్దాలు వారికి మరింత బాగా ఉపయోగపడ్డాయట. అద్దాలు లేని లిఫ్టులో కన్నా అద్దాలు ఉన్న లిఫ్టులో ప్రజలు ఎక్కువ ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారట. దీంతో పాటు తమకు ఏమైనా అవుతుందా అనే ఆలోచన రానివ్వకుండా ప్రశాంతగా తమ ఫ్లోర్ వరకు వెళ్లేంత వరకు ప్రయాణికులను లిఫ్టు ఎంగేజ్ చేస్తుంది.

11. సాంకేతిక మార్పులు

ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే నేడు ఎలివేటర్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయి. వాటి సాంకేతికత రోజు రోజుకూ మారిపోతుంది. మరింత స్పేస్‌తో పాటు మల్టీ మీడియా, ఇంటెరాక్టివ్ డిజైన్లను కూడా అందిస్తున్నాయి నేటి తరం లిఫ్టులు. ఎన్ని తెరలు ఉన్నా, అలంకరణలు ఉన్నా, సాంకేతికత ఎంత మారినా, వేగం పెరిగినా కానీ నేటికీ లిఫ్టులో అద్దాల స్థానాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు.

12. మానసిక ప్రశాంతత

Mirrors In Elevator
| లిఫ్టులో ఉన్నప్పుడు పవర్ కట్ కాకూడదు అని కోరుకోండి. ఎందుకంటే అది కొంచెం ఇబ్బందిగా అనిపించే విషయం.

ఎలివేటర్‌లో ప్రయాణం అనేది కొంత మందిలో దిగులు కలిగించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు కొంతమంది భయపడవచ్చు కూడా. కొత మందికి ఇరుకు గదిలో, లేదా మూసి ఉన్న గదుల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక్కసారిగా బంధీనయ్యామనే భావన కూడా కొంత మందిలో కలగవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఎదురుగా ఉన్న అద్దం వల్ల కొంచెం పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది . ఎందుకంటే అందులోని ప్రయాణికులు తన సమస్యపై కాకుండా తనను తాను చూసుకునే అవకాశం లభిస్తుంది. అంతలోనే వాళ్ల ఫ్లోర్ వచ్చేస్తుంది.

మొత్తానికి

మొత్తానికి, లిఫ్టుల్లో అద్దాలు అనేవి కేవలం అలంకరణ కోసం ఏర్పాటు చేసినవి కావు అని మీకు అర్థం అయ్యే ఉంటుంది. వీటిని ఏర్పాటు చేయడం వెనక ఎన్నో ప్రాక్టికల్ పరిశోధనలు, మానసిక, సామాజిక అంశాలు ఉంటాయి.

ఒక వేళ మీకు లిఫ్టుల్లో అద్దాలు కనిపిస్తే టైమ్ ఉంటే ఈ యాక్టివిటీస్ కూడా ట్రై చేయవచ్చు.

  • Mirror Selfie Contest: మీరు మీ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో లిఫ్టులో ప్రయాణిస్తుంటే. మిర్రర్ సెల్ఫీ కాంటెస్ట్ పెట్టుకోవచ్చు. ఇందులో అద్దంలో చూస్తే ఫన్నీ ఫేస్, ఎక్స్‌ప్రెషన్స్ ఎవరు ఇస్తూ సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది.. ఇలా మీకు టైమ్‌ పాస్ కూడా అవుతుంది. దాంతో పాటు గెలిస్తే ఏమైనా ట్రీట్ కూడా దొరకొచ్చు.
  • 30 Seconds Act: ఒక ముప్పై సెకన్లు మీరు మీకు నచ్చిను నటీ నటుడిలా ఫీల్ అవ్వండి. అద్దంలో చూసుకుంటూ వారిలా డైలాగ్లు చెప్పండి. పుష్పా పుష్పా రాజ్ అనుకుంటూ గడ్డం కింద చేతులు పోనిచ్చి తగ్గేదిలే అనుకోండి. లేదా రాధికాను గుర్తు తెచ్చుకుని నాది సాధారణ జన్మకాదు నేను కారణ జన్ముడిని నా ఈ జన్మకు కారణం ఏందంటే ఈ సిటీల ఉన్న అన్ని పంచాయతీయులు తీసుకొచ్చుకుని నా తలపై పెట్టుకోవడం అనుకుంటూ డిజే టిల్లూలా ఫీల్ అవ్వొచ్చు.
  • గ్రహాంతర వాసి | Alien In Elevator: లిఫ్టులో ఎక్కడానికి ముందు మిమ్మల్ని మీరు ఒక గ్రహాంతరవాసి అనుకోండి. లిఫ్టు బయట మీ గ్రహం. లిఫ్టు లోపల భూమి ఉంది అనుకోండి. లిఫ్టులోపలికి వెళ్లగానే అద్దంలో చూసుకుని ఈ మనుషులేంటి ఇలాంటి బట్టలు వేసుకుంటారు. తలపై నల్లగా ఏదో ఉంది ఏంటది ? కంటిమీద బొంతపురుగులు ఉన్నా కనిపించవా ( కనుబొమ్మలు) ఈ నరుడికి, వీళ్ల కాళ్లేంటి ఇలా ఉన్నాయి….అసలు వేళ్లు లేవు, చేతిలో ఏదో నల్లడి బండను పట్టకున్నారు అది ఎందుకలా మెరుస్తోంది…అప్పుడప్పుడు శబ్దం కూడా చేస్తోంది అని అనుకోండి. జస్ట్ సరదాగా అంతే. కావాలంటే ఇది మీరు రికార్డు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయండి.
  • మీతో మీరు మాట్లాడుకోండి : Talk To Yourself: మనతో మనం లోలోపల మాట్లాడుతూ ఉంటాం. కానీ బయటికి మాాట్లాడే అవకాశం తక్కువ లభిస్తుంది. అందుకే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. మిమ్మల్ని మీరు తిట్టుకోవచ్చు…లేదా పొగడవచ్చు..లేదంటే ఏదైనా కవిత్వం రాసి మీకు మీరే అంకితం ఇచ్చుకోండి. ఎవరు ఆపుతారో చూద్దాం.

గమనిక : ఏదో నాకు నచ్చింది నేను రాశాను. ఇలా చేయాలని రూల్ లేదు. చేయాలి అనుకుంటే మాత్రం చుట్టుపక్కల ఉన్న వారిని గమనించండి. వారికి ఇబ్బంది కలిగించకండి.

Leave a Comment