ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న సందేహం మీక్కూడా వచ్చిందా..?? అయితే దానికి సమధానం చదవండి. పెద్ద పెద్ద భవంతుల్లో సులభంగా పై అంతస్తులకు చేరుకోవడానికి లిప్ట్‌లను వాడటం (Mirrors In Elevator) మొదలు పెట్టిన కాలం అది.

రోజురోజుకు లిప్ట్‌లు వాడుతున్న భవనాల సంఖ్య పెరగడం. ఎక్కువ ఫ్లోర్స్‌తో పెద్ద పెద్ద భవంతులు వెలుస్తూ ఉండటంతో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది బిల్డర్స్‌కు.
కాలం ఆగిపోయింది | Why There Are Mirrors in Elevator
చివరి ఫ్లోర్స్ లేదా టాప్‌లో ఉన్న ఫ్లోర్లకు వెళ్లాల్సి వచ్చిన వాళ్లు లిఫ్ట్ లో ఎక్కువ సమయం గడపడం కామన్. అలాంటి వాళ్లు ఒక్కొక్కరిగా బిల్డర్స్ దగ్గరికి వెళ్లి మీ లిఫ్టులు చాలా స్లోగా వెళ్తున్నాయి. వాటిని స్పీడ్ చేయండి అని చెప్పడం ప్రారంభించారు. దీన్నిసీరియస్‌గా తీసుకున్న బిల్డర్స్ ఎలివేటర్స్ తయారు చేసే సంస్థలకు ఈ విషయాన్నిచెప్పారు.
- ఇది కూాడా చదవండి : Tips For a Happy Life : ఇలా చేస్తే 100 శాతం హ్యప్పీగా ఉంటారు
అయితే అందులో ఒక ఇంజనీర్ లిప్ట్ వేగం పెంచితే అది కొన్ని సమస్యలకు కారణం అవ్వొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనికి ఇంజినీరింగ్ టెక్నిక్స్‌తో కాకుండా..సైకాలాజికల్‌గా ఆలోచించాడు. లిప్ట్‌లో వాళ్లు ఎందుకు బోర్ అవుతున్నారు.. ?? ఏం చేయోచ్చు అని రకరకాలుగా ఆలోచించారు.
ఇదే లాజిక్ | Logic Behind Mirrors In Elevator
లిప్ట్ వాళ్లకు స్లో అనిపించడానికి కారణం వాళ్లకు లిప్ట్‌లో చేయడానికి ఇంకేం పని లేకపోవడమే అని అర్థం చేసుకున్నారు. లిప్ట్ స్పీడ్ బాగానే ఉన్నా.. అందులో ఎక్కేవాళ్లు అది తక్కువ స్పీడ్‌తో వెళ్తుందని ఫీల్ అవుతున్నారని తెలుసుకున్నారు.
దీనికి ఏం చేయాలో ఆలోచించి అద్దాలు పెట్టడం మొదలు పెట్టారు. దీని తర్వాత లిప్ట్ స్పీడ్ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. అద్దం తుడవట్లేదని కంప్లెంట్స్ చేస్తారు తప్పా..