Rashmika Mandanna : వీల్‌చైర్లో సినిమా ఫంక్షన్‌కు వచ్చిన రష్మిక మందన్న…అసలు ఏమైంది

తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో కూడా మెరుపువేగంతో దూసుకెళ్తోంది రష్మిక మందన్న (Rashmika Mandanna ). పుష్ప,యానిమల్ మూవీస్‌తో ఆమె పాపులారిటీ తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ఛావా (Chhaava Movie).

ఈ మూవీకి సంబంధించిన ఒక ఈవెంట్‌లో ఈ ముద్దు గుమ్మ వీల్‌చైర్‌లో కనిపించింది. దీంతో చాలా మంది అభిమానుల్లో కలిగే ఒకే ఒక ప్రశ్న…అసలు రష్మికకు ఏమైంది ? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

పుష్పా తరువాత రష్మిక మందన్న వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ఛావా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో యూరి ( URI Movie ) నటుడు విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా ఫిబ్రవరి 14వ తేదీన రానున్న ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ మూవీని ప్రమోట్ చేయడానికి మూవీ టీమ్ హైదరాబాద్ చేరుకుంది. భాగ్యనగరంలో ప్రెస్ మీట్ నిర్వహించగా అందులో కథానాయిక రష్మిక వీల్ ఛైర్‌పై కనిపించడంతో చాలా మంది కాస్త ఖంగారు పడ్డారు.
అసలు ఏమైంది ? | Why Rashmika Is On Wheel Chair ?రష్మిక్ మందన్న వీల్‌చైర్లో ఉన్న వీడియో ఒకటి ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ అయింది. ఇందులో ఆమె విమానాశ్రయంలో వీల్ చైర్ వాడటాన్ని మీరు గమనించవచ్చు.
ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో రష్మిక ఎంతపక్కాగా ఉంటుందో మనకు తెలిసిందే కదా. నిత్యం వర్కవుట్స్ చేసే రష్మిక ఇటీవలే జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా అమె కాలికి గాయం అయిందని వార్తలు వచ్చాయి. అందుకే ఆమె వీల్ చైర్ వాడుతోంది అని తెలుస్తోంది. తన కాలి గాయం వల్ల సినిమా షూటింగ్స్ ఆలస్యం అవుతోండటంతో సినిమా దర్శకులకు క్షమాపణలు కూడా చెప్పిందట
ఇక ఛావా ప్రెస్‌మీట్‌లో కూడా వీల్‌చైర్‌లోనే స్టేజిపైకి వచ్చింది ఈ బ్యూటి. రష్మక ఉన్న వీల్‌చైర్‌ను హ్యాండిల్ చేసి విక్కీ కౌశల్ ( Vicky Kaushal )జెంటిల్మెన్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్‌పై కనిపించిన రష్మిక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమో కాలి గాయం వల్ల సరిగ్గా నడవలేకపోడం అనేది అభిమానులకు బాధ కలిగించింది. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Comment

error: Content is protected !!