45 Years Of Sankarabharanam శంకరాణభరణం మూవీ 1988 ఫిబ్రవరి 2న విడుదలైంది. ఈ మూవీ కళాతపస్వి కే విశ్వనాథ్ తెరకెక్కించగా, పూర్ణోదయా ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్లో ఏడిద నాగేశ్వర రావు, ఆకాశం శ్రీరాములి ప్రొడ్యూస్ చేశారు. తెలుగులో విడుదలైన ఈ మూవీ కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సమయంలోనే ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీ అయింది. అమెరికాలో కూడా రెగ్యులర్ థియేటర్లలో విడదలై హిట్ అయింది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు శంకరాభరణం ఎలాంటి చిత్రమో...అందులోని కంటెంట్, కథకు ప్రేక్షకులు ఎలా నీరాజనం పలికారో అని. అప్పటి వరకు శాస్త్రీయ సంగీతం అంటే కొంత మందికి మాత్రం పరిమితం అనుకునేవారు. కానీ ఈ శంకరాభరణం విడుదలైన తరువాత శాస్త్రీయ సంగీతం అనేది ప్రతీ ఒక్కరికీ సంబంధించినది అని ప్రేక్షకులకు అర్థమైంది. అందుకే చాలా మంది క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం ప్రారంభించారు. శంకరాభరణం మూవీకి స్వర్ణకమలంతో పాటు 8 నందీ అవార్డులను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి జాతీయ అవార్డును అందుకుంది ఈ చిత్రంతోనే. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు చెన్నై, హైదరాబాద్లోని తన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు. పాటు వాణి జయరాం, కేవి మహదేవన్ కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ మూవీ తరువాత నటుడు జె.వి. సోమయాజులును అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు .