GHMC Works At Punjagutta, Nagarjuna Circle and Somajiguda హైదరాబాద్‌ను అందంగా ముస్తాబుచేసే పనుల్లో నిమగ్నమైంది జీహెచ్ఎంసి ఇందులకో 2024 నుంచి పలు ప్రాజెక్టులు ప్రారంభించించింది ప్రస్తుతం అనేక చోట్ల పనులు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల పనులు వేగంగా జరుతున్నాయి. హైదరాబాద్‌ను టూరిస్టులకు ఫేవరిట్ డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా ఒకటి. ఇందులోె భాగంగా అనేక ఫ్లై ఓవర్లు, సమీపంలో ఉన్న ప్రాంతాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. నగరంలోని అనేక కూడళ్లలో అందమైన శిల్పాలను, చిత్రకళనను నగరవాసుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. బిజీ జీవితంలో ఎక్కువ సమయం బయటే గడిపే వారికి ఆహ్లాదం కలిగించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ లుక్ పూర్తిగా మారిపోతుంది అని చెప్పవచ్చు.