హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? | Chhatrapati Shivaji Maharaj Facts

క్షేత్రం ఉంటే భూస్వామి అవుతారు. నలుగురికి కోసం బతికి, లక్షలాది సంవత్సరాల కీర్తిని పొందితే ఆ వ్య్యక్తిని ఛత్రపతి అంటారు. ఛత్రపతి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) . 

ఎక్కడో మహరాష్ట్రకు చెందిన ఒక మహారాజును తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎందుకు దేవుడిలా పూజిస్తారు ? ఎందుకు అనేేక కూడళ్లలో ఆయ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి గౌరవిస్తారు ? అనే సందేహాలు మీకు ఉంటే…మన దేశ సంస్కృతిని, హిందూ మతాన్ని, భారతీయ వారసత్వాన్ని కాపాడేందుకు శివాజీ మహారాజ్ చేసిన పోరాటం గురించి తెలుసుకోవాల్సిందే. 

పుట్టిన రోజు | Shivaji Maharaj Birth Day

ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 లో మహారాష్ట్రలోని (Maharashtra) పుణెలో శివ్‌నేరీలో ఫిబ్రవరి 19న జన్మించారు. తన సాహసం, తెగువ, తెలివితేటలతో, అసమాన్య ప్రజాభిమానంతో ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన గురించి మరిన్ని విషయాలు ఈ పోస్టులో …

బాల్యం : స్వరాజ్యానికి పునాదులు పడిన చోటు

Shivaji Maharaj Childhood: శివ్‌నేరీ కోటలో (Shivneri Fort)  శివాజీ మహరాజ్ జననం అనేది ఒక బాలుడి జననం మాత్రమే కాదు…అది సరికొత్త ఉషోదయం కూడా. కఠినమైన సహ్యాద్రి పర్వాతాల (Sahyadri Parvat) ప్రాంతాల్లో ఉన్న ఈ కోట అనేది పరాక్రమకు, బలానికి ప్రతీకగా నిలిచింది. ఈ విషయాలు శివాజీ జీవితంలో కీలక పాత్ర పోషించాయి.

స్వరాజ్య కాంక్షకు భీజం

యువకుడిగా ఉన్నప్పటి నుంచే శివాజీ అద్భుతమైన నాయకత్వ లక్షణాలు చూపించాడు. రాజకీయాల్ని, యుద్ధ కళల్ని తెలుసుకోవడంలో ఆసక్తి చూపించేవారు. ఆయనలో స్వరాజ్య కాంక్షకు భీజం వేసింది మాత్రం ఆమె తల్లి జీజాబాయి. ఒక వ్యక్తిగా, శక్తిగా శివాజీని మలచడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. అందుకే చాలా మంది తల్లులకు ఆమె ప్రేరణగా నిలిచారు.

  • బాల్యం నుంచే శివాజీకి వీరోచిత గాథలు, ధర్మాన్ని తెలిపే కథలను పురాణాల (Hindu Mythology) నుంచి ఎంచుకుని వినిపించేవారు తల్లి జీజాబాయి.
  • సత్యం, ధర్మం కోసం, అన్యాయానికి వ్యతిరేకంగా, విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేలా శివాజీనీ ప్రేరేపించాయి ఆ కథనాలు.

శివాజీ జయంతి చరిత్ర | Who Started Shivaji Maharaj Jayanti

ఫివ్రవరి 19వ తేదీన శివాజీ మహారాజ్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. 1870లో సంఘ సంస్కర్త అయిన మహాత్మా జ్యోతీరావ్ పూలే (Mahatma Jyotiarao Phule) శివాజీ మహారాజ్ జయంతిని వేడుకగా సెలబ్రేట్ చేయడం ప్రారంభించారు. 

  • తరువాత స్వాతంత్య్రోద్యమ సమరం (Indian Freedom Fight) మొదలైన సమయంలో అంటే 1895లో  బాలగంగాధర్ తిలక్ (Bala Gangadhar Tilak) ఈ వేడుకను ముందుండి నడిపించారు.
  • శివాజీ మహారాజ్ దేశానికే గర్వకారణం అని ప్రజలకు అర్థం అయ్యేలా చేసి దేశ భక్తిని కలిగించేలా చేశారాయన.

హిందూ మతం ప్రమాదంలో ఉన్నప్పుడు…

మొఘలుల కాలంలో (Mughals Era) హిందుత్వం ప్రమాదంలో పడింది. అదే సమయంలో ఉద్యమ కెరటంలా ఎగిసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ మతాన్ని కాపడటమే కాదు హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

  • అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శివాజీ మహారాజ్ ప్రపంచం మొత్తం హిందూమతం మాత్రమే ఉండాలని కోరుకోలేదు. అందుకోసం ఆయన పోరాటం చేయలేదు.
  • హిందూ మతాన్ని, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని (Hindu Culture) ముస్లిం పాలకుల నుంచి కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన తపించారు. చివరికి సాధించారు.

శివాజీ లేకపోతే కాశీలో హిందుత్వం ఉండేది కాదు

హిందూ మతాన్ని(Hinduism) కాపాండేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంతలా తాపత్రయపడ్డారో తెలిపే ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.

కవి భూషణ్ (Kavi Bhushan) అనే కవి ప్రకారం

  • శివాజీ లేకపోతే కాశీలో (Kashi) హిందుత్వం ఉండేది కాదట.
  • మథురలో మసీదుగా మారేదట.
  • శివాజీ మహారాజ్ తన జీవిత కాలంలో ఎన్నో ఆలయాలను, విగ్రహాలను కాపాడారు.
  • హిందూ సామ్రజ్యాన్ని స్థాపించాలనేది ఆయన కలగా ఉండేది అని కొందరంటారు.

ముస్లింలకు వ్యతిరేకి కాదు | Chhatrapati Shivaji Maharaj

శివాజీ మహారాజ్ హిందుత్వానికి ఊపిరి అందించారు అనడంలో సందేహం లేదు. ముస్లిం పాలకుల (Muslim Rulers) నుంచి హిందూ మతాన్ని కాపాడారు అనడంలో కూడా సందేహం లేదు.

అయితే ఆయన ముస్లింలకు వ్యతిరేకి కాదు. ఆయన ముస్లింలను ధ్వేషించలేదు. కేవలం హిందూ మతాన్ని కాపాడేందుకే ఆయన పోరాడారు. 
  • తన రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు ఆశ్రయం ఇచ్చారు శివాజీ.
  • తన సైన్యంలో ముస్లిం మతస్థులకు స్థానం ఉండేది.
  • అందులో కొందరు ఉన్నత ఉద్యోగాలు కూడా చేసేవారు. 

ఔరంగజేబుతో శివాజీ | Aurangzeb

హిందూ మత ఆచారాలను గౌరవించాల్సిందిగా ఔరంగజేబును పలుమార్లు కోరాడు శివాజీ. హిందూ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని తపించాడు. బయటి నుంచి వచ్చే వ్యక్తులు, శక్తుల నుంచి తన మతాన్ని కాపాడుతూ ఆచారాలు, సంప్రదాయాలు ముందు తరానికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు.

సవాళ్లు | Challenges Faced By Chhatrapati Shivaji Maharaj

Chhatrapati Shivaji Maharaj
| ఛత్రిపతి శివాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో రిషభ్ శెట్టి

17 శతాబ్దంలో హిందూ మతాన్ని కాపాడేందుకు ఛత్రపతి శివాజీ చేసిన ప్రయత్నాల వల్లే నేడు హిందూ మత వైభవం ఇలా కొనసాగుతోంది అంటారు చరిత్రకారులు. దీంతో పాటు హిందుత్వాన్ని కాపాడేందుకు ఆయన అనేక ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కొన్నారని చరిత్రకారులంటారు.

అందులో కొన్ని సవాళ్లు:

  1. మొఘలుల అణచివేత | How Shivaji Fought Mughals

భారత దేశంలో ఇస్లామిక్ రాజ్యాన్ని (Islamic Rule) ఏర్పాటు చేయాలని తీవ్రంగా ప్రయత్నించిన ఔరంగజేబు నుంచి శివాజీ మహారాజ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు.

  • ఆ సమయంలో హిందువులను తీవ్రంగా శిక్షించేవారు మొఘలులు.
  • దీంతో పాటు హిందూ ఆలయాలను ధ్వంసం చేసేవారు, మత మార్పిడులు చేసేవారు.
  • ఆ సమయంలో మొఘలుల చెరనుంది బాధితులను, హిందు మతాన్ని, సంప్రదాయాన్ని కాపాడేందుకు తన సైన్యంతో కలిసి పోరాడాడు శివాజీ.
  1. హిందువుల్లో విభజన

హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ (Hindu Caste System), అంతర్గత విభజన కూడా శివాజీకీ సవాలుగా నిలిచింది. ఉన్న ఒకే ఒక శత్రువుతో పోరాడేందుకు హిందువులందరిని ఐక్యం చేద్దాం అనుకున్నాడు శివాజీ. కానీ కుల పోరాటాలు, కొన్ని వర్గాల్లో ఉన్న అమస్మతి శివాజీని చాలా ఇబ్బంది పెట్టాయి.దీంతో బయటి నుంచి వచ్చే ప్రమాదాలను, శతృవులతో పోరాడేందుకు శివాజీ చాలా కష్టపడాల్సి వచ్చింది.

  1. రాజకీయాలు, నమ్మకద్రోహాలు

తన పథకాలను అమలు చేసేందుకు శివాజీ ఎన్నో రాజకీయ చక్రవ్యూహాలను, నమ్మద్రోహుల నీడలను దాటి రావాల్సి వచ్చింది. శివాజీ ఎదుగుదను చూసి గిట్టని స్థానిక పాలకులతో పాటు దగ్గరగా ఉండే వాళ్ల వల్ల కూడా శివాజీ ఇబ్బంది పడ్డాడు.ఇలాంటి సమయంలో నమ్మకస్తులైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవడం సవాలుగా మారింది.

  1. సైనిక సవాళ్లు

శివాజీ కదనరంగంలో పులిలా పోరాడేవారు. అయితే ఆయనకు ఎదురుగా ఉన్న సైన్యం కూడా చిన్నది కాదు. మొఘలుల సైన్యం (Mughal Army), డెక్కనీ సుల్తానులు (Deccan Sultanate) అంతా కలిసి శివాజీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేవారు.

  • వారితో పోల్చితే సంఖ్యాబలం తక్కువగా ఉన్నా కానీ శివాజీ తన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టేవాడు.
  • గొరిల్లా వార్‌ఫేర్ (guerilla warfare) లేదా మెరుపుదాడులు చేయడంలో ఆయన సిద్ధహస్తులు.
  • ఎలాంటి పరిస్థితిలో అయినా తెగించి పోరాడే సైనికులతో శివాజీ నెక్ట్స్ యుద్ధానికి సిద్ధంగా ఉండేవారు.
  1. హిందుత్వానికి ప్రాణం పోయడంలో సవాళ్లు

హిందూమతాన్ని కాపాడాలనే శివాజీ సంకల్పానికి అనేేక సవాళ్లు ఎదరయ్యాయి. శతాబ్దాలుగా విదేశీయుల పాలనలో ఉండటంతో హిందుత్వం, హిందూ ఆచారాలు ప్రమాదంలో పడ్డాయి.

  • అలాంటి సమయం హిందూ ఆచారాలను, మరాఠీ భాషకు ప్రాణం పోయడానికి, ఆలయాలు ధ్వంసం కాకుండా ఉండేందుకు ఆయన చాలా శ్రమించారు.
  • అయితే ఈ సమయంలో హిందు మతస్థులు, అన్యమతస్థుల నుంచి కూడా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి.

శివాజీ జీవితంలో హైలైట్స్ | Key Points From Shivaji Maharaj Life

శివాజీ మహారాజ్ విలువలతో బతికాడు. అవే విలువలను ఇతరులు పాటించేలా బతికాడు. అయన జీవిత కాలం పాటించిన విలువలు నేటి తరానికి ఆదర్శాలు 

  • ధైర్యం, సాహసం : ఆపదలో కూడా సఢలని ధైర్యంతో దూసుకెళ్లడం శివాజీ ప్రత్యేకత. ఇదే విషయం శివాజీ సైనికులను కదన రంగంలో ముందుకు దూసుకెళ్లేలా ప్రేరేపించేది. ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోరాదు అని సామాన్యులు ఆయన నుంచి నేర్చుకునేవారు.
  • సరైన వ్యూహాలు : కడివెడు నీళ్లకన్నా గరిటెడు పాలకు విలువ ఎక్కువ అన్నట్టు…తన ముందు ఉన్న భారీ సైన్యాన్ని కూడా తన గెరిల్లా యుద్ధ తంత్రంతో మట్టికరిపించేవాడు శివాజీ. భారీ బందోబస్తు, ఆయుధాలతో వచ్చే ప్రత్యర్థులను ఇలా సరికొత్త వ్యూహాలతో చెక్ పెట్టేవాడు ఛత్రపతి శివాజీ మహారాజ్.
  • సమన్యాయం, నిష్పాక్షిక పాలన: పేదవారికైనా, ధనికుడికైనా ఒకే న్యాయం ఉండేలా న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు శివాజీ. 
  • మత సహనం : అన్ని మతాలను గౌరవించేవారు శివాజీ. తమ తమ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ప్రార్థించుకునేందుకు అవకాశం కల్పించాడు.
  • దేశ భక్తి, స్వరాజ్య కాంక్ష : స్వరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా, స్వతంత్య్ర హిందూ సామ్రాజ్యాన్ని, మరాఠా రాజ్యాన్ని స్థాపించి విదేశీయులు పెత్తనాన్ని తగ్గించడమే తన ధ్యేయంగా పెట్టుకున్నారు శివాజీ.
  • ప్రజా సంక్షేమం : శివాజీ చేతిలో కత్తి ఉన్నా లేకున్నా ఆయన వీరుడే. అయితే వీరత్వంతో ఎక్కడ చూపించాలో…సౌమ్యంగా ఎక్కడ ఉండాలో శివాజీకి బాగా తెలుసు. ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాడు. వ్యవసాయానికి పెద్ద పీఠ వేశాడు. వ్యాపార, వాణిజ్యం కోసం మౌలిక వసతులు కల్పించాడు శివాజీ.

ఆసక్తికరమైన విషయాలు | Quick Facts About Shivaji Maharaj

  • భారత నావికా పితామహుడు: భారత దేశ నావికా పితామహుడిగా (Father Of Indian Navy) ఛత్రపతి శివాజీ మహారాజ్‌‌ను పేర్కొంటారు. దేశ తీర ప్రాంతాలను సంరక్షించడంలో నావికాదళం ఎంత ప్రధానమో చాటి చెప్పారు శివాజీ.
  • మహిళలను గౌరవించడం : తన సైన్యానికి ఛత్రపతి శివాజీ పలు కఠిన నియమాలు పాటించేలా చేశాడు. అందులో ఒకటి మహిళల గౌరవించడం. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించే సైనికులనను తీవ్రంగా శిక్షించాలనేవారు.
  • శివసూత్ర (Shiva Sutra) : శివాజీ యుద్ధ వ్యూహాల్లో గొరిల్లా యుద్ధతంత్రం కూడా ఒకటి. దీనిని శివ సూత్ర అని పిలిచేవారు. తక్కవ మంది సైనికులతో భారీ సైన్యంపై మెరుపుదాడి చేసి విజయం సాధించడంలో సిద్ధహస్తులు శివాజీ.
  • అష్టప్రధాన్ (Ashtapradhan) : ప్రభుత్వ నిర్వాహణ, సుసంక్షేమ పాలన కోసం ఆయన అష్టప్రధాన్ అనే ఎనిమిది మంది మంత్రులతో కూడుకున్న ఒక మంత్రీ మండలిని ఏర్పాటు చేశారు.
  • అద్భుతమైన నెట్వర్క్ : శివాజీ మహారాజ్ వద్ద అద్భుతమైన గూఢచారులు ఉండేవారు. దేశ వ్యాప్తంగా చీమ చిటుక్కు మన్నా శివాజీకి తెలిసేలా నెట్వర్క్ ఉండేది

📣 ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Leave a Comment