Maha Shivaratri: పెన్సిల్ మొనపై మహాశివుడి సూక్ష్మ విగ్రహం
2025 ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రిని (Maha Shivaratri) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే. పరమ శివుడికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఆయనను ఆరాధించి ఆశీర్వాదం పొందుతారు. చాలా మంది భక్తులు ఈ పర్వాన అభిషేక ప్రియుడైన మహాశివుడికి జల,పాల,మధు,పుష్పాలతో అభిషేకాలు చేస్తుంటారు.