20 Years of YouTube: యూట్యూబ్ రాక ముందు ఇంటర్నెట్ ఎలా ఉండేదో గుర్తుందా ? వీడియోలు అంటే కొన్ని క్యాట్ వీడియోలు మాత్రమే కనిపించేవి. విసుగుగా ఉండేది. అయితే 2005లో పేపాల్‌కు చెందిన ముగ్గురికి వచ్చిన ఆలోచన ప్రపంచానికి ఒక కొత్త శక్తిని పరిచయం చేసింది. సింపుల్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా మొదలైన యూట్యూబ్ ప్రస్థానం నేడుప్రపంచ శక్తిగా మారింది.
టాపర్ల నుంచి ఐఏఎస్‌ల వరకు సీఏ నుంచి సీఈఓల వరకు ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఏమైనా తెలుసుకోవాలన్నా, చేయాలన్నా గూగుల్‌తో పాటు యూట్యూబ్‌ను (YouTube) తప్పకుండా వినియోగిస్తుంటారు.
Table of Contents
ట్రావెల్ వ్లాగ్‌తో ప్రారంభం | Me At The Zoo

యూట్యూబ్‌లో అప్లోడ్ అయిన తొలి వీడియో నేటికీ సజీవ సాక్ష్యంగా అలాగే ఉంది. దీని పేరు మీ ఎట్ ది జూ (Me At The Zoo). ఈ తొలి వీడియో 18 సెకన్లు మాత్రమే ఉంటుంది. దీనిని అప్లోడ్ చేసిన జావేద్ కరీం (Jawed Karim) తను ఒక అద్భుతమైన శక్తిని ఊపిరి ఊదినట్టు ఊహించలేదేమో.
- ప్రస్తుతం యూట్యూబ్, ప్రపంచంలోనే అత్యధికంగా విజిట్ చేసే రెండవ అతిపెద్ద (Most Visited Websites) వెబ్‌సైట్.
- వందల కోట్ల యూజర్లతో పాటు ప్రతీ నిమిషం 500 గంటల నిడివి కన్నా ఎక్కువ వీడియోలు ఇందులో అప్లోడ్ అవుతున్నాయి. మీరు జీవితంలో చూసే కంటేంట్ కన్నా ఇది ఎక్కువ.
యూట్యూబ్ అంటే ఎందుకంత క్రేజ్ ?
అయితే యూట్యూబ్ అంటే ఎందుకంత క్రేజ్ ? ఎందుకంటే యూట్యూబ్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు. ఇందులో విద్య, వినోదంతో పాటు జర్నలిజం వరకు అనేక అంశాలు ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రజలకు ఇది నిత్యవసరంగా మారింది. మరింత లోతుగా వెళ్లే ముందు…
ఆసక్తికరమైన విషయాలు | 10 Quick Facts About YouTube
- యూట్యూబ్‌ను అధికారికంగా ప్రేమికుల రోజున ప్రారంభించారు.
- 2006 లో యూట్యూబ్‌ను సొంతం చేసుకునేందుకు గూగుల్ (Google Buys YouTube) 1.65 బిలియన్ డాలర్లను చెల్లించింది.
- ప్రతీ నిమిషం యూట్యూబ్‌లో 500 గంటల కన్నా ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు అప్లోడ్ అవుతాయి.
- ప్రకటనల రూపంలో యూట్యూబ్ (How Much YouTube Earn) ప్రతీ ఏడాది 15 బిలియన్ డాలర్లు సంపాదిస్తుంది.
- యూట్యూబ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో 80 భాషల్లో అందుబాటులో ఉంది.
- 70 శాతం కన్నా ఎక్కువ మంది మొబైల్లోనే యూట్యూబ్ చూస్తారట. అందులో మీరూ నేను కూడా ఉన్నాం.
- యూట్యూబ్ రివైండ్ 2018 (YouTube Rewind 2018) వీడియో అనేది అత్యధికంగా డిస్‌లైక్స్ పొందిన వీడియోగా చరిత్రలో నిలిచిపోయింది.
- లైవ్ స్ట్రీమింగ్‌లో (YouTube Live) యూట్యూబ్ అనేది రారాజు అని చెప్పవచ్చు. గేమింగ్ టోర్నమెంట్ నుంచి కాన్సెర్టుల వరకు నిత్యం ఎన్నో లైవ్స్ జరుగుతూనే ఉంటాయి.
- ప్రస్తుతం టిక్‌టాక్‌కు బదులుగా పోటీలో ఉన్న షార్ట్స్ వేగంగా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తున్నాయి.
- ప్రకటనలు లేని ఎక్స్‌క్లూసీవ్ కంటెంట్ కోసం మిలియన్ల మంది యూజర్లు యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్ తీసుకున్నారు. (YouTube Premium)
అత్యధిక వ్యూస్ పొందిన 5 వీడియోలు | Top 5 Most-Watched YouTube Videos

యూట్యూబ్ గురించి (20 Years Of YouTube) ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా..ఇప్పుడు య్యూట్యూబ్ ప్రయాణంలో ఇప్పటి వరకు అత్యధికంగా వ్యూస్ సంపాదించిన వీడియోల గురించి తెలుసుకుందాం.
- బేబీ షార్క్ డ్యాన్స్ -పింక్‌ఫోంగ్ కిడ్స్ సాంగ్స్ అండ్ స్టోరీస్
- డెస్పాసీటో– లూయిస్ ఫోన్సి పీట్స్ డ్యాడీ యాంకి
- జానీ జానీ ఎస్ పాపా-లూలూ కిడ్స్
- బాత్ సాంగ్ -కోకో మెలన్
- షేప్ ఆఫ్ యూ – ఎడ్ షీరన్
కీలక మైలు రాళ్ల గురించి | Key Milestones in YouTube’s Epic Journey
బేబీ షార్క్ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు కదా ? ఇక యూట్యూబ్ జర్నీలో కీలక మైలు రాళ్ల గురించి తెలుసుకుందాం.
- 2005 : య్యూట్యూబ్ ప్రయాణం మొదలైంది. తొలి వీడియోగా “మీ ఎట్ ది జూ “ ను అప్లోడ్ చేశారు.
ఆ వీడియో ఇదే..
- 2006 : యూట్యూబ్‌ను 1.65 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న గూగుల్
- 2007 : కంటెంట్ క్రియేటర్స్ డబ్బు సంపాదించేందుకు వీలుగా యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రాం (YouTube Partner Program) మొదలైంది. ఇది కోట్లాది మందికి స్వయం ఉపాది మార్గంగా మారింది.
- 2010 : ఒకే రోజు 2 బిలియన్ల వ్యూస్ సాధించిన య్యూట్యూబ్.
- 2011: లైవ్ స్ట్రీమింగ్ సదుపాయం ప్రారంభించిన య్యూట్యూబ్.
- 2014: యూట్యూబ్ మ్యూజిక్ కీ ప్రారంభమైంది. తరువాత దీనిని య్యూట్ మ్యూజిక్‌గా (YouTube Music)
- 2015 : యూట్యూబ్ గేమింగ్ ప్రారంభమైంది. తరువాత దీనిని మెయిన్ ప్లాట్‌ఫామ్‌లో కలిపేశారు.
- 2019: నెలకు 2 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్ల మైలురాయికి చేరుకున్న య్యూట్యూబ్.
- 2020 : య్యూట్యూబ్ షార్ట్స్ (Shorts) ప్రారంభం.
- షోరూమ్స్‌లో పెట్టే మనిషిని పోలిన బొమ్మల కథ ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?
క్రియేటివిటీ సునామీలా పారింది.కంటెంట్ క్రియేషన్ అనేది అందరి చేతుల్లో సాధనంగా మారింది.సొంత వ్యాపారం చేయాలనుకునే వారికి యూట్యూబ్ ఆసరాగా మారింది.
యూట్యూబ్ ప్రపంచాన్ని ఇలా మార్చింది…

Impact Of YouTube On World : యూట్యూబ్ రావడంతో అప్పటి వరకు సినిమాలు, టీవీల్లో అవకాశాలు కోసం వేచి చూస్తున్న ఆర్టిస్టులు, తమ కథను ఎలా చెప్పాలో తెలియక, తమ ట్యాలెండ్ ఎలా చూపించాలో తెలియక ఇబ్బంది పడుతున్న క్రియేటర్స్‌కు ఒక వేదిక దొరికింది.
క్రియేటివీటీ సునామీలా పారింది. కొత్తతరం ఫిలింమేకర్స్, సంగీత దర్శకులు, విద్యావేత్తలు, ఉద్యమకారులకు బంగారు గుడ్డు పెట్టే కోడిలా మారింది య్యూట్యూబ్.
ప్యాషన్, ట్యాలెంట్ ఉన్న ధూల్‌పేట్ ర్యాపర్స్ (Dhoolpet Rappers) పాడిన పాటను కూడా డెట్రాయిట్‌లో కూర్చున్న డేనియల్ చూడగలిగే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం యూట్యూబే. అసలు యూట్యూబే లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి ?
యూట్యూబ్ సార్ | YouTube Saar
ఏదైనా నేర్చుకోవాలంటే భారీగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. కోడింగ్ నుంచి కోడి గుడ్డుతో ఆమ్లెట్ చేయడం వరకు అన్నీ మీరు యూట్యూబ్‌లో చూడవచ్చు నేర్చుకోవచ్చు.
నిజానికి ఒక టీచర్ ఒక పిరియడ్ లేదా రెండు పిరియడ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాడు.కానీ య్యూటూట్‌లో సార్ మాత్రం 365 రోజులూ వారానికి 7 రోజులు 24 గంటలూ అందుబాటులో ఉంటాడు.
రాకెట్ నుంచి సుబాన్ బేకరీ ఉస్మానియా బిస్కెట్ వరకు, తుపాను నుంచి మల్లేపల్లి స్వీట్ పాన్ వరకు, , చెర్రీ నుంచి సీతారాంబాగ్ లింగయ్య ఇడ్లీ వరకు, ఐఐటీ నుంచి ఘోడే ఖబర్ గోల్డెన్ టీ వరకు, దారుస్సలాం మైసూర్ బజ్జీ నుంచి డల్లాస్‌లో పునుగుల కొట్టు వరకు అన్నీ కూడా య్యూట్యూబ్‌లో ఉంటాయి.
దీని వల్ల ఎంతో మంది వివధ విషయాలు నేర్చుకుంటున్నారు. తమ జీవితాన్ని అర్థంవంతగా ముందుకు తీసుకెళ్తున్నారు. అంతెందుకు య్యూట్యూబ్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా య్యూటూబ్‌లోనే చూసి నేర్చుకోవచ్చు.
సవాళ్లు కూడా ఉన్నాయి
20 Years Of YouTube : అయితే సాఫీగా సాగితే జీవితం ఎందుకు అవుతుంది. కాపీ రైట్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసే విషయంలో యూట్యూబ్ విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కాలానికి తగిన విధంగా మారుతూ, పాలిసీలను మార్చుతూ ప్రపంచానికి ఒక అద్భుతమైన వీడియో కంటెంట్ షేరింగ్ ఆధారంగా మారింది య్యూట్యూబ్.
📣 ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.