పరమశివుడి అనుగ్రహం పొందడానికి …మహా శివరాత్రి (Maha Shivaratri 2025) రోజు ఉపవాసం, పూజలు ఎలా చేయాలి ? ఏ సమయంలో చేయాలి ? మహా శివరాత్రి విశిష్టత ఏంటి ? మరిన్ని విషయాలు ఈ పోస్టులో మీకోసం.
మహా శివరాత్రిని దేశ వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకగా చేస్తుంటారు. భారత దేశంతో పాటు భారతీయులు ఉన్న అనేక దేశాల్లో కూడా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. మహా శివరాత్రి పర్వాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సరైన విధంగా చేసే వారికి మహా శివుడి అనుగ్రహం లభిస్తుంది అంటారు.
అగ్నిలింగం
పరమ శివుడికి సంబంధించిన వేడుకలన్నింటిలో మహా శివరాత్రి (Maha Shivaratri) పరమ పవిత్రమైనది. ఈ రోజునే అరుణాచలంలో (Arunachalam) అగ్నిలింగం (Agni lingam) ఏర్పడింది అంటారు.మహా శివరాత్రిని దేశ వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల నడుమ వేడుకగా చేస్తుంటారు. భారత దేశంతో పాటు భారతీయులు ఉన్న అనేక దేశాల్లో కూడా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు.
Table of Contents
మహా శివరాత్రికి మాస శివరాత్రికి మధ్య తేడా
Maha Shivaratri and Masa Shivaratri: కొంత మంది మాస శివరాత్రికి, మహాశివరాత్రికి మధ్య తేడా ఏంటి అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు.
- మాస శివరాత్రి ప్రతీనెల కృష్ణపక్షంలోని చదుర్దశి తిథిన వస్తుంది.
- మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మహా శివరాత్రి అంటారు.
2025 లో శివరాత్రి ఎప్పుడు ? | When Is Maha Shivaratri 2025

మహా శివరాత్రిని దేశ వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల నడుమ వేడుకగా చేస్తుంటారు. భారతదేశంతో పాటు భారతీయులు ఉన్న అనేక దేశాల్లో కూడా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. 2025 లో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రిని నిర్వహించనున్నారు.
ఈ రోజున త్రిమూర్తులలో (Trimurthi) ఒకరైన మహా శివుడిని (Lord Shiva) భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ రోజును సెలబ్రేట్ చేస్తారు.
వేల ఏళ్ల క్రితమే శ్రీ కృష్ణుడు మీ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు | Gita By Lord Krishna
ముఖ్యమైన తేదీలు | Important Dates, Timings for Maha Shivaratri 2025
- మహా శివరాత్రి : 2025 ఫిబ్రవరి 26వ తేదీన
- చతుర్దశి తిథి ప్రారంభం : 2025 ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 11 గంటల 08 నిమిషాలకు
- చతుర్దశి తిథి ముగింపు : 2025 ఫిబ్రవరి 08న ఉదయం గంటల 54 నిమిషాలకు
- మహా శివరాత్రి పూజా సమయం : ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 6 గంటల 42 నిమిషాల నుంచి ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 07 గంటల 03 నిమిషాల వరకు.
నిశిత కాల పూజ : అర్థరాత్రి ( ఈ సమయంలో పూజలు చేయడం పరమ పవిత్రంగా భావిస్తారు)
మహశివరాత్రి అనేది భారతీయ చరిత్రలో, ఆచారాల్లో ఎంతో విశిష్టమైనది. ఈ పర్వదినాన్ని నిర్వహించడం వెనక ఉన్న కారణాలు వచ్చెేసి…
- శివపార్వతుల వివాహం : భక్తి, ప్రేమలకు కలయికగా భావించే శివపార్వతుల వివాహానికి ప్రతీకగా ఈ రోజును భావిస్తారు.
- శివతాండవం : ఈ రోజు రాత్రి పరమ శివుడు తాండవం(Tandav) నృత్యం చేస్తాడని… సృష్టి ఏర్పాటు, వినాశనాన్ని సూచించే దైవిక నృత్యంగా దీనిని భావిస్తారు.
- చీకటిపై విజయం : మహా శివరాత్రి పర్వం జరపడం అనేది ప్రాపంచిక భౌతిక విషయాలను విడనాడి పరమ శివుడి సన్నిధికి చేరడానికి ఒక మార్గంగా భావిస్తారు.
ఉపవాసం ఉండే సరైన విధానం | The Right Way to Fast
ఈ రోజున ఉపవాసం ఉండటం వలన ఆధ్యాత్మిక శుద్ధి (Spiritual Purity) కలిగి శివుడి అనుగ్రహం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. అయితే చాలా మందికి ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలో తెలియదు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు
భక్తులు తమ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, ఇష్టాన్ని బట్టి ఉపవాస విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే ముందుగా ఉపవాసాలు ఎన్ని రకాలో చూద్దాం.
- ప్రారంభం: మీ రోజును ప్రారంభించే ముందు ఏదైనా ఆల్పాహారం తీసుకోండి. దీని వల్ల మీ శరీరం ఉపవాసానికి సిద్ధం అవుతుంది.
- ఉపవాసాల్లో రకాలు : | Types Of Fasting On Maha Shiva Ratri
- నిర్జల వ్రతం : నీరు తాగకుండా, భోజనం చేయకుండా ఉపవాసం చేయడం.
- ఫలాహార వ్రతం : ధాన్యాలు, అన్నం తినకుండా కేవలం పండ్లు పాలు తీసుకోవడం. ఫలహారం వ్రతంలో భక్తులు నీటిని, టీ, కాఫీ, కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. ఉప్పు ఉండ కుండా చూసుకోవాలి.
- సమాప్త ఉపవాసం : ఇలాంటి ఉపవాసంలో మీరు ఫలాహార ఉపవాసంలో ఉండే పదార్థాలు అన్నీ కూడా తీసుకోవచ్చు.దీంతో పాటు పాయసం, హల్వా లాంటి స్వీట్ కూడా తీసుకోవచ్చు. పాయసం వచ్చేసి బియ్యంతో చేసింది, పూల్ మఖానాతో, బెల్లంతో చేసి తినవచ్చు.
- పాక్షిక ఉపవాసం : ఈ ఉపవాసంలో భక్తులు ధాన్యాలు తీసుకోకుండా రెగ్యులర్ భోజనం చేయవచ్చు. పాలు పండ్లు తీసుకోవచ్చు.
- నీరు తాగండి : ఒకవేళ మీరు పాలు, నీటిని తీసుకునే వ్రతాన్ని చేస్తుంటే నీరు రెగ్యులర్‌గా తాగండి.
- మంత్రాలు, ప్రార్థనలు : పరమ శివుడికి సంబంధించిన పవిత్ర మంత్రాలను ఈ రోజున జపించాలి మరీ ముఖ్యంగా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలని అంటారు.
మహా మృత్యుంజయ మంత్రం : Maha Mrityuanjaya Mantra
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
మహా మృత్యుంజయ మంత్రం
ఉర్వారుకమేవ బంధనాత్..మృత్యోర్మోక్షిత మామ్రితాత్
ఉపవాస నియమాలు | Fasting Rules
మీరు ఎలాంటి ఉపవాస దీక్షను ఎంచుకున్నా కానీ కొన్ని సాధారణ నియమాలు మీకు తప్పకుండా పాటించండి.
- సంకల్పం : శివరాత్రికి ఒక రోజు ముందే మీరు మహా శివరాత్రి రోజు ఉపవాస దీక్ష తీసుకుంటున్నట్టు సంకల్పం (ప్రమాణం) చేయాలి. ముందు రోజు స్నానం చేసిన తరువాత ఈ సంకల్పం తీసుకోవాలి.
- చక్కని మాటలు : మహా శివరాత్రి రోజున నోటి నుంచి ఒక తప్పు మాట రాకుండా చూసుకోవాలి. చెడు ఆలోచనలు, చెడ్డవారితో సావాసం చేయరాదు. మంచి విషయాలను తెలుసుకుని పాటించాలి.
- పవిత్రత : మీ శరీరాన్ని, బుద్దిని రెండింటిటీ పవిత్రంగా ఉంచుకోండి. ఉపవాస దీక్షలో ఇది చాలా అవసరం.
- సాత్విక జీవితం : శివరాత్రి రోజున మీరు సాత్విక జీవితాన్ని ఎంచుకోండి. తామసిక పనులు…అంటే మాంసం తినడం, వెల్లుల్లి, జూదం, గొడవలు, తిట్లకు దూరంగా ఉండండి.
- వీటికి దూరంగా ఉండండి : ఈ రోజున మీరు జుట్టును, గోళ్లను కట్ చేయడం చేయకండి. మహా శివరాత్రి రోజున ఇలా చేయడం అపవిత్రంగా భావిస్తారు.
- వైద్యుల సలహా : మహా శివరాత్రి సమయంలో ఉపవాస దీక్ష తీసుకోవాలో లేదో అనే విషయంపై నిర్ణయాన్ని వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి తీసుకోవాలి. గర్భిణీ మహిళలు, వృద్ధులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు నడచుకోవాలి.
చేయాల్సినవి | Things to Do on Maha Shivaratri
- ఆలయ దర్శనం : మహా శివరాత్రి రోజున పరమ శివుడి ఆలయంలో రాత్రి సమయంలో పూజలు జరుగుతుంటాయి. ఆ పూజలో పాల్గొనండి.
- నైవేద్యం : పువ్వులు, పండ్లు, పాలు, బిల్వపత్రం (Bel Leaves) ను శివలింగానికి అర్పించండి. వీటిని అర్పించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు.
- మంత్రోచ్ఛరణ : భోళాశంకరుడి ( Bhola Shankar) ఆశీర్వాదం కోసం ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించండి.
- ధ్యానం చేయండి : మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి ధ్యానం చేయండి.
చేయకూడనివి | Avoid These Things On Maha Shivaratri
- నాన్ వెజ్ : ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మాంసాహారం తీసుకోరాదు. ఎందుకంటే ఇది అత్యంత పవిత్రమైన రోజు.
- మద్యం, మత్తు : ఆల్కహాల్ లేదా మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఇవి మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయి.
- కోపం, ప్రతికూల ఆలోచనలు : బుర్రను ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టండి. ఆధ్యాత్మికం సాధనలు, పూజలు చేయండి.
అభిషేకం ఎలా చేయాలి ? How to Do Abhisheka
మహా శివుడు అభిషేక ప్రియుడు. అందుకే మహాశివుడికి అత్యంత ప్రియమైన మహాశివరాత్రి సందర్భంగా చేసే అభిషేకానికి అత్యంత విశిష్టత ఉంటుంది.
- అభిషేకంలో: మీరు గంగాజలం, తేనె, పాలు బిల్వపత్రం, పువ్వులు, గంగాజలం లేకపోతే సాధారణ నీటిని వినియోగించవచ్చు.
- విధానం : పైన వివవరించిన పదార్థాలలో పాలు, నీరు తేనె, పువ్వులతో శివలింగానికి అభిషేకం చేయవచ్చు.
పూజలో సమర్పించాల్సినవి
- బిల్వపత్రం : మహాశివుడికి బిల్వ పత్రం సమర్పిచడం అనేది అత్యంత పవిత్రంగా భావిస్తారు.
- పూవులు : పూజా సమయంలో దేవుడికి వాడిపోని పువ్వులనే సమర్పించాలి.
- పండ్లు : భక్తికి ప్రతీరూపంలో తాజా పండ్లనే సమర్పించాలి.
- అగరబత్తి : పవిత్రమైన వాతావరణం కలిగేలా ఆలయ ప్రాంగణంలో, ఇంట్లో అగరబత్తులు వెలిగించాలి.
చిట్కాలు | Tips for Maha Shivaratri
- ప్లానింగ్ : చివరి నిమిషంలో ఎలాంటి హడావిడి లేకుండా ఉండాలి అంటే ముందే నైవేద్యాలు, ప్రసాాదాలు, వంటల జాబితాను రెడీ చేసుకోండి.
- లక్ష్యం గుర్తుంచుకోండి : ఉపవాస దీక్ష చేపట్టినప్పుడు అది ఎందుకు చెపట్టారు ఆనే లక్ష్యాన్ని మీరు గుర్తుంచుకోండి. దాని వల్ల మీ ఆధ్యాత్మిక అనుభవం రెట్టింపు అవుతుంది.
- నలుగురితో కలిసి : నలుగురు కలిసే చోట నలుగురితో కలిసిపోండి. సాటి భక్తులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనండి.
- పాజిటీవ్ : నిత్యం సానుకూలమైన వాతావరణంలో, అలాంటి ఆలోచనలతో ఉండటానికి ప్రయత్నించడండి. మంచి ఆలోచనలతో మంచి విషయాల గురించి మాట్లాడండి.
పండగ మాత్రమే కాదు ఇది
మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు…ఇది ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా కూబా భావిస్తారు. 2025 ఫిబ్రవరి 26వ తేదీన ఈ ఏడాది మహాశివరాత్రిని వైభవంగా, ఆధ్యాత్మకంగా, నియమ నిష్టలతో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అని తెలుసుకోవడంలో ఈ పోస్టు ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను. ఇలాగే ఇంకెవరికి అయినా ఉపయోగపడుతంది అంటే తప్పకుండా షేర్ చేయగలరు.
📣 ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.