Viral : “రూ.50 కొబ్బరిబోండాతో రూ.10 లక్షలు సలహా ఇచ్చాడు” ముంబైకు చెందిన మహిళ పోస్టుకు నెటిజెన్ల కామెంట్స్

Viral : జీతం మళ్లీ వస్తుంది. కానీ జీవితం మళ్లీ రాదు. ఇది తెలుసుకోవడానికి మనకు సగం జీవితం సరిపోతుంది. ఎందుకంటే మనం మన శరీరాన్ని బండి అనుకుని  కోరికలు నెరవేర్చుకోవడానికి బుల్లెట్ ట్రైన్‌లా నడిపిస్తున్నాం. మధ్యలో జీవితాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం. 

ఇదే విషయాన్ని చాటిచెబుతోంది ఒక చిన్న సంఘటన. ఈ వార్త మరీ అంత పెద్దదేం కాదు అని ఇప్పటికీ అనిపిస్తుంది. అలా అయితే వజ్రం కూడా మరీ అంత పెద్దదేం కాదు అనిపిస్తుంది. 

ఎందుకు అంత కష్టపడతారో | Coconut Seller Philosophy

ఈ మధ్య ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చూశాను. అందులో గార్గీ అనే మహిళ ఒక ఇంట్రెస్టింగ్ ఘటన గురించి తెలిపింది. ముంబైలో తను ఒక కొబ్బరి బోండాను ఆర్డర్ ఇస్తూ దాన్ని అమ్మే వ్యక్తితో ” అన్నా కొంచెం ఫాస్టుగా ఇయ్యవా…నా ఊబర్ ( Uber Car ) కారు వస్తోంది” అని రిక్వెస్ట్ చేసిందట. 

దీనికి బోండాలు అమ్మే ఆ వ్యక్తి చెప్పిన సమాధానం తనను తానే ప్రశ్నించుకునే చేసిందట. అతను ఆమెతో ” మనుషులు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. కానీ ప్రశాంతంగా తినడానికి, తాగడానికి వారి దగ్గర టైమ్ ఉండదు. మరి ఎందుకు అంత కష్టపడతారో ఏంటో ” అని సమాధానం ఇచ్చాడట. దానికి తోడు “మనకు పని అనేది జీవితాంతం ఉంటుంది. కానీ నచ్చిన ఫుడ్ తినడం, తాగడం వంటి వాటి కోసం సమయం వెచ్చించడం కూడా అంతే ఇంపార్టెంట్” అన్నాడట.

ఆ ట్వీట్ ఇదే | Viral Tweet

” అన్నను నేను ఒక బోండా ఇయ్యమని అడిగాను. నా ఊబర్ వస్తోంది కాబట్టి కాస్త ఫాస్టుగా ఇమ్మన్నాను. అతను చాలా క్యాజువల్‌గా మరి ఇంత డబ్బు ఎందుకు సంపాదిస్తున్నావు? పని నడుస్తూనే ఉంటది. కానీ తినితాగడానికి టైమ్ ఇయ్యాలి కదా ..అన్నాడు. చాలా సింపుల్‌గా అనిపించవచ్చు.  కానీ చాలా మంచి సలహా ఇచ్చాడు అని రాస్తూ తను అక్కడ కొన్న బోండా ఫోటో కూడా పోస్టుకు జతచేసింది గార్గీ.

నెటిజెన్ల ప్రశంసలు

ఈ పోస్టు చాల మందికి కనెక్ట్ అయింది. అందుకే నెటిజెన్లు తమ అభిప్రాయాన్ని చాలా ఓపెన్‌గా కామెంట్ చేశారు. అందులో కొంత మంది ఏం కామెంట్ చేశారో చూడండి.

  • బాగా చదువుకున్న అనేక మంది విదేశీ క్లైంట్స్‌తో పని చేసిన తరువాత , ఈ కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి ఇచ్చిన సలహా నాకు బాగా కనెక్ట్ అయింది. 
  • బెంగుళూరు ఒక రోజు నేను ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ ఆటోలో లంచ్ చేస్తున్నాను. అది గమనించిన ఆటో అన్న పనీ గినీ పక్కన పెట్టు, మనం ఉంటేనే కదా పని నడిచేది అన్నాడు.
  • నిజానికి ఊబర్ డ్రైవర్‌ను అడిగితే అతను ఒకరెండు నిమిషాలు తప్పకుండా ఆగేవాడు కదా…దానికి తొందరెందుకు?
  • రూ.50 ల కొబ్బరిబోండాతో రూ.10 లక్షలు విలువ చేసే సలహా ఇచ్చాడు ఇది మంచి ఆఫర్.

Valentine Week 2025 : వ్యాలెంటైన్ వీక్ అంటే ఏంటి ? ఏ రోజుకు ఎలాంటి ప్రత్యేకత ఉంది ?

ఇలా నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే ఇందులో మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే….జీవితం చూస్తూ చూస్తూనే అయిపోతుంది. దోష ఎక్కవ సేపు తీయకపోతే మాడిపోతుంది. మనం కూడా అంతే లైఫ్‌లో ఎప్పుడూ ఒకే స్పీడుతో వెళ్లలేం. మధ్యలో గేరు మార్చాలి. 

 2024 ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో తెలియదు. 2025 ఇలా మొదలై 2 నెలలో పడింది. కష్టాలు, నష్టాలు అన్నీ మనమీది నుంచి పోతాయి. జీవితం ఎక్కడ ఆగదు. మనమే అవసరం అయినప్పుడు కాస్త ఆగాలి. ఈ ప్రపంచంలో వచ్చినాక  ప్రతీ క్షణాన్ని ఆగి చూసి వెళ్లిపోవాలి. పనే జీవితంగా అనుకుంటే ఆగం అయ్యేది మనమే. 

📣 ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment