Poonam Gupta:  చరిత్రలో ఫస్ట్ టైమ్ రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి …ఎవరిదో తెలుసా ?

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాసం ఉండే రాష్ట్రపతి భవన్‌లో త్వరలో పెళ్లివేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర పతి భవన్ చరిత్రలోనే భనవ ప్రాంగణంలో ఒక పెళ్లి జరగడం ఇదే మొదటిసారి. సీఆర్‌పీఎస్ అధికారి అయిన పూనం గుప్తా ( Poonam Gupta ) తన కాబోయే భర్త అవినాష్ కుమార్‌ను వివాహం చేసుకోనుంది. ఇతను కూడా సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

రాష్ట్రపతి అనుమతి

పూనం గుప్తా ప్రస్తుతం రాష్ట్రపతి నివాసం వ్యక్తిగత భద్రతా అధికారికిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన బాధ్యతలను నిర్వించే విధానం, సిన్సియారిటీ , అమె అద్భుతమైన ట్రాక్ రికార్డు వల్ల రిపబ్లిక్ డే సందర్భంగా మహిళల కంటింజెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు పూనం. ఈటీవీ భారత్ రిపోర్టు ప్రకారం పనిపట్ల తన అంకిత భావాన్ని గమనించి రాష్ట్ర పతి భవన్ ప్రాంగణంలో ఈ వివాహం జరిపించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అనుమతి ఇచ్చారట. దీంతో రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకోనున్న తొలి మహిళగా రికార్డుకెక్కనుంది పూనం.

పూనం గుప్తా ఎవరు ? | Who is Poonam Gupta ?

మధ్య ప్రదేశ్‌‌కు చెందిన పూనం గుప్తా మ్యాథెమెటిక్స్‌లో పట్టా పొందింది. దీంతో పాటు ఇంగ్లిష్ లిటరేచర‌లో కూడా డిగ్రీ పొందింది. తరువాత బీఈడీ కూడా చేసింది పూనం. దీంతో పాటు 2018 లో యూపీఎస్సీ సీఏపీఫ్ కూడా క్లియర్ చేసింది. ఇందులో ఆమెకు 81 ర్యాంకు రావడం విశేషం. 

ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. గతంలో బీహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వించిన పూనం ఎంతో మంది మహిళలకు ప్రేరణగా నిలిచింది.  ఇక పూనంకు కాబోయే భర్త అవినాష్ కుమార్ విషయాపికి వస్తే అతను కూడా సీఆర్‌పీఎఫ్‌‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం జమ్మూ, కశ్మీర్‌లో పోస్టింగ్‌లో  ఉన్నాడు. 

పెళ్లి ఎప్పుడు ? | Poonam Gupta Marriage Date

ఈ పెళ్లి వచ్చేసి రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌‌లో జరగనుంది.  2025 ఫిబ్రవరి 12న జరగనున్న ఈ పెళ్లి వేడుకకు కొంత మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు.

రాష్ట్రపతి భవన్ గురించి | Facts About Rashtrapati Bhavan

భారత రాష్ట్రపతి అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్ అనేది ఒక ఆర్కిటెక్చరల్ వండర్ అని చెప్పవచ్చు. దీనిని సర్ ఎడ్విన్ లూట్యేన్స్ డిజైన్ చేశారు. మొత్తం 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన భవనం విస్తీర్ణమే 2,00,000 చదరపు అడుగులు ఉంటుంది. ఇందులో మొత్తం 340 గదులు, నాలుగు అంతస్తులు ఉంటాయి. ఇటలీలోని క్విరినల్ తరువాత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద దేశాధిపతి భవనం ఇదే అవడం విశేషం.

ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment

error: Content is protected !!