Horn OK Please: హర్న్ ఓకే ప్లీజ్, స్టాప్ సౌండ్ హారన్ ఒకే అనే ఈ పదాలకు అర్థం ఏంటో తెలుసా? 

హారన్ కళాకారులు ఉన్న మన దేశంలో “ఓకే హారన్ ప్లీస్” (Horn OK Please),  స్టాప్ సౌండ్ హార్న్ ప్లీస్ అనే పదాలు ఇప్పటికీ అనేక బండ్లపై ఎందుకు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఆ పదానికి మీనింగ్ ఏంటో ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా ? ఈ రోజు మనం ట్రై చేద్దాం. 

భారత దేశంలో డ్రైవింగ్ (Driving In India) చేయడం అనేది ఒక ఆర్ట్. ఎందుకంటే ఇక్కడ మనకు నిత్యం ఎన్నో రకాల మధురమైన (నిజమనుకునేరు) శబ్దాలు వినిపిస్తాయి. కొంత మంది నోటితో, కొంత మంది బండి హారన్‌తో (Horn OK Please) ఎదుటి బండితో, బండి డ్రైవర్‌తో కమ్యూనికేట్ అవుతారు. ఈ హారన్ అనేది ఒక హక్కుగా మారిపోయింది. ముందున్న బండి కదలని పరిస్థితిలో ఉన్నా, రెడ్ లైట్ పడి ఉన్నా సరే వెనక ఉన్న వ్యక్తి హారన్ మోగిస్తాడు.  

ఇలాంటి హారన్ కళాకారులు ఉన్న మన దేశంలో “ఓకే హారన్ ప్లీస్” (Horn OK Please),  స్టాప్ సౌండ్ హార్న్ ఓకే (Stop Sound Horn Ok) అనే పదాలు ఇప్పటికీ అనేక బండ్లపై ఎందుకు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఆ పదానికి మీనింగ్ ఏంటో ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా ? ఈ రోజు మనం ట్రై చేద్దాం. 

నాడు సౌలభ్యం…నేడు ఇబ్బంది

కమర్షియల్ వెహికల్స్‌పై కొన్ని దశాబ్దాల నుంచి హార్న్ ఓకే ప్లీజ్ అనే సింబల్ కనిపిస్తూ ఉంటోంది. మన దేశంలోనే మాత్రమే కనిపించే అద్భుతమైన ఫీచర్‌లా కనిపిస్తుంది. ఒకప్పడు హారన్ కొట్టండి అనే అర్థంతో హార్న్ ఓకే ప్లీస్ అని రాయించడం మొదలు పెట్టగా…నేడు హార్న్ నాట్ ఓకే (Horn Not OK) అనే పరిస్థితి ఏర్పడింది. ఆ స్థాయిలో శబ్ద కాలుష్యం మనుషులను ఇబ్బంది పెడుతోంది అని మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ పదం ఎలా పుట్టింది ? | Birth Of Horn Ok Please

ఈ పదం పుట్టుక గురించి ఎన్నో కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే అందులో ఏది నిజమో ఏది కాదో అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే కొన్ని కథనాలను ఈ పోస్టులో చర్చకు తీసుకువస్తున్నాను.

అందులో ఒక కథనం ప్రకారం హార్న్ ఓకే ప్లీజ్ అనే పదం అనేది చాలా కాలం నుంచి అమలులో ఉంది. ఒకప్పుడు రోడ్లు చాలా చిన్నగా, సన్నగా ఉండేవి. ఒకవేళ వెనక ఉన్న వాహనం ముందుకు వెళ్లాలి అంటే ముందున్న వాహనానికి హార్న్ కొట్టి సిగ్నల్ ఇచ్చేవారు. దీంతో ముందున్న వెహికల్‌ పక్కకు వెళ్లేది ఓవర్ టేకింగ్ ప్రశాంతంగా జరిగేది. ఓకే అనే పదం దగ్గర ఒక కొన్ని సార్లు ఒక బల్బ్ ఉంటుంది. దీనిని వెనక ఉండి బండి సురక్షితంగా ఓవర్ టేక్ చేయవచ్చు అని అనిపించినప్పుడు డ్రైవర్ ఆన్ చేస్తాడు అని ఒక కథనం.

అయితే మౌలిక సదుపాయాలు మెరుగు అవ్వడం, రోడ్లు విశాలంగా మారడంతో హాంకింగ్ చేసే అవసరం చాలా వరకు తగ్గిపోయింది. కానీ నేటికీ చాలా మంది హాంకింగ్ చేయడం ఒక అలవాటుగా కొనసాగిస్తున్నారు.

హాంకింగ్ వల్ల సమస్యలు | Some Problems With Honking

వరుసగా హారన్ కొట్టడం లేదా హాంకింగ్ అనేది భారత దేశంలో నేటికీ కొనసాగుతోంది. ఇది రోడ్డుపై ఉండే తోటి వాహనదారుల ఆరోగ్యంపై (Health) , జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఇలా హారన్ కొట్డం వల్ల కలిగే నష్టాలు :

  •  వినికిిడి శక్తి కోల్పోవడం : 85 డెసిబల్స్‌ కన్నా ఎక్కువగా ఉండే శబ్దాలను ఎక్కువ సమయం వరకు వింటే వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
  • స్ట్రెస్ కారకం : శబ్ద కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల యాంగ్టైటీ, నిద్రలేమి, ఇతర మానసిక సమస్యలు కలిగే ప్రమాదం ఉంటుంది.
  • గుండె సమస్యలు : శబ్ద కాలుష్యం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు హైపర్ టెన్షన్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

హరన్ ఓకే కాదు | Horn Not Ok Movement

Horn Ok Please
2016 లో బెంగుళూరులో హార్న్ నాట్ ఓకే అనే క్యాంపెయిన్ నిర్వహించారు | Photo Source : x/HNOPYIBLR
https://twitter.com/HNOPYIBLR

అనవసరమైన శబ్దాల (Sound) వల్ల కలిగే నష్టాలను గుర్తించి అనేక సంస్థలు హారన్ ఓకే కాదు అనే విధంగా హార్న్ నాట్ ఓక ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఈ ఉద్యమం లక్ష్యం ఏంటి అంటే…

  • అవగాహన పెంచడం : శబ్ద కాలుష్యం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించి, అవసరమైనప్పుడు మాత్రమే హారన్ కొట్టేలా స్వీయ క్రమశిక్షణను, ఆ బాధ్యతను వానహదారుల్లో తీసుకురావడం.
  • చట్టాలను అమలు చేయడం :  శబ్ధ కాలుష్యానికి (Sound Pollution) సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయడం. అనవసరంగా హారన్ కొట్టకుండా చూడటం.
  • బాధ్యాతాయుతమైన డ్రైవింగ్ : అవసరం అయినప్పుడు మాత్రమే హారన్ కొట్టేలా అది కూడా ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా ఉండేలా చూసుకోవడం డ్రైవర్ల బాధ్యత అని వారికి అర్థం అయ్యేలా చెప్పడం.

మహారాష్ట్ర ప్రభుత్వం ముందడుగు 

Initiation By Maharastra Govt : 2015 లో మహారాష్ట్ర ప్రభుత్వం హార్న్ ఓకే ప్లీజ్ అనే ఈ సిగ్నల్‌ను కమర్షియల్ వెహికల్స్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంది. ఈ లైన్ చదివి చాలా మంది అనవసరంగా హారన్ మోగిస్తున్నారు దీని వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది అని నాటి మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేష్ జగాడే (Mahesh Zagade) తెలిపారు. ఈ నిషేధాన్ని ఉద్యమకారులు స్వాగతించగా దీనీని అమలు చేయడంలో తలెత్తిన ఇబ్బందులు చర్చకు దారి తీశాయి.

ఎన్నో కథలు

Horn Ok Please అనే పదం ఎలా పుట్టిందో ఎవరికీ క్లియర్‌గా తెలియదు. కానీ ఇది ఎక్కువగా బస్సులు, ట్రక్కుల, ఆటోల వెనక కనిపిస్తుంది. ఈ లైన్ పుట్టడం వెనక కొన్ని కారణాలు వ్యాప్తిలో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  1. టాటా | TATA Group : టాటా గ్రూప్‌లో ఒక భాగం అయిన టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ (TOMCO) OK అనే కొత్త సబ్బును మార్కెట్లో ప్రేవేశ పెట్టింది. దీనిని ప్రయోట్ చేయడానికి అప్పటికే వాహనాలపై ఉన్న హార్న్ ప్లీజ్ అనే పదం మధ్యలో ఓకేను దూర్చింది. ఈ సబ్బు లోగో వచ్చేసి కమలం పువ్వు. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు నడిచిన సబ్బు తరువాత ఆగిపోయింది. కానీ డ్రైవర్లు మాత్రం ఎందుకో ఆ ఆచారాన్ని మాత్రం నేటికీ కొనసాగిస్తున్నారు అనేది ఒక కథనం.
  2. రెండవ ప్రపంచ యుద్ధం : ఈ పదం పుట్టుక అనేది 2వ ప్రపంచ యుద్ధం సమయం నాటిది అని కూడా చెబుతుంటారు. అప్పట్లో డీజిల్ కొరత కారణంగా ట్రక్కులు పెట్రోలుతో కూడా నడిచేవట. పెట్రోల్ వల్ల చాలా వేగంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే హార్న్ ప్లీస్, ఆన్ కిరోసీన్ (Horn Please, On Kerosen) అని రాసేవారట. నేటికీ ఇలా కొన్ని ట్రక్కులపై ఈ పదం కనిపిస్తుందట.
  3. చరిత్రకారుల ప్రకారం : ఒకప్పుడు ఎదురుగా ఉన్న లారీని (Indian Lorry) ఓవర్ టేక్ చేయడానికి వెనక ఉన్న కారు లేదా ఇతర వాహనం హారన్ మోగించేవి. వెంటనే లారీ అతను ఓకే అనే పదం వద్ద ఉన్న బల్బును వెలిగించి ఓవర్ టేక్ చేయడానికి సిగ్నల్ ఇస్తూ అంగీకరించేవాడట.
  4. కొంత మంది అయితే గతంలో ఇది హార్న్ ఓటీకే (Horn OTK ) గా ఉండేదని అంటుంటారు. దీనర్థం ఓవర్ టేక్ చేయవచ్చు అని. చాలా సార్లు టీ అనేది ట్రక్ పెయింటింగ్‌లో కలిసి పోవడం వల్ల చివరికి ఓకే మిగిలింది అంటారు.
  5. మరికొంత మంది ప్రకారం ఓకే , హార్న్, ప్లీజ్ అనేవి మూడు వేరు వేరు పదాలు. ఓకే అనేది పెద్ద అక్షరాల్లో ఉంటుంది. ఇలా ఉండటానికి కారణం వెనక ఉన్న వాహనంచపద్దతిగా డ్రైవింగ్ చేసేలా ఇది ప్రోత్సాహిస్తున్నట్టు చెప్పడమే అంటారు. కనీసం దూరం పాటించే విధంగా ఈ అక్షరాలను పెద్దగా రాస్తారని కొందరంటారు.
  6. అయితే ఈ పదాలు ఎక్కడ ఎలా పుట్టాయి, మొదట ఎవరు ప్రారంభించారు అని చెప్పడానికి ఎలాంటి పక్కా ఆధారాలు లేవు. అయితే నేటికీ విటీ వినియోగం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. హార్న్ ఓకే ప్లీజ్ అని చదివి హారన్ కొట్టాలేమో అని కొట్టే వాళ్లు కూడా ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ | Himachal Pradesh On Horn Not OK

శబ్ధ కాలుష్యానికి వ్యతిరేకంగా హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh) ప్రభుత్వం 2018లో హార్న్ నాట్ ఓకే అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం “షోర్ నహీ” ( శబ్దం వద్దు ) అనే ఒక యాప్‌ను కూడా ప్రారంభించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రజలను శబ్ద కాలుష్యం నుంచి తప్పించేందుకే ఇలా చేశామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ యాప్‌లో చుట్టూ ఎంత నాయిస్ ఉందో తెలుసుకునే ఫీచర్ కూడా అందుబాటులో ఉంచారు.

ఉద్యమాలు, చట్టాలు ఉన్నా

శబ్దకాలుష్యంపై ఎన్నో ప్రచారాలు, ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ఇది అదుపులోకి రావడం లేదు. హాంకింగ్ ఆచారంగా ఉన్నంత వరకు ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలా మంది హార్న్ మోగించడానికి కారణాలు అనేకం:

  • అవగాహనా రాహిత్యం : చాలా మంది డ్రైవర్లకు శబ్ద కాలుష్యం వల్ల కలిగే నష్టాల గురించి తెలియాదు. దీంతో పాటు హాంకింగ్ విషయంలో ఉన్న చట్టాల గురించి కూడా వారికి అవగాహన లేదు.
  • అమలులో లోపం :  శబ్ద కాలుష్య చట్టాలను అమలు చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు చాలా తక్కువ.
  • డ్రైవింగ్ అలవాటు : హాంకింగ్ అనేది డ్రైవర్ తన కోపాన్ని, వేగాన్ని, ఆధిపత్యాన్ని చూపించేందుకు వాడటం మన దేశంలో నిత్యం జరుగుతూ ఉంటుంది. 

2024 లో ధర్మశాలలో ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

📣 ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Leave a Comment