ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే దాదాపు 15వ శతాబ్దం వరకు చరిత్రను తవ్వి చూడాల్సి వచ్చింది. మొత్తానికి ఈ బొమ్మల చరిత్ర తెలుసుకున్నాం (Mannequins). మీతో పంచుకుంటున్నాం.
మనం పెద్ద పెద్ద స్టోర్లకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా బట్టలు, బంగారం షాపులోకి వెళ్లినప్పుడు లేదా కోఠిలోనిమార్కెట్‌కి (Koti Market Hyderabad) వెళ్లినప్పుడు ఒక డమ్మీ బొమ్మ కనిపిస్తుంది. ఒక మనిషి ఎత్తులో ఉండే ఈ బొమ్మ గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఈ బొమ్మను ఏమంటారు ? దీని పేరేంటి ? ఎవరు కనుక్కున్నారు ? దీని చరిత్ర ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ?
ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానకి ప్రయత్నిస్తే దాదాపు 15వ శతాబ్దం వరకు చరిత్రను తవ్వి చూడాల్సి వచ్చింది. మొత్తానికి ఈ బొమ్మల చరిత్ర తెలుసుకున్నాం ( Mannequins ). మీతో పంచుకుంటున్నాం.
Table of Contents
మాల్స్‌తో పాటు ఆర్ట్ గ్యాలరీలో కూడా కనిపించే ఈ మౌన మనషులను మానెక్విన్ ( Mannequin ) లేదా డమ్మీస్ అంటారు.
చరిత్ర | History Of Mannequins

మనిషి శరీరాన్ని పోలిఉండే ఈ మేనిక్విన్ చరిత్ర నేటిది కాదు. ఈ డమ్మీల చరిత్ర మావన నాగరికతతో ముడిపడి ఉన్నది. వీటి పుట్టుక అనేది ప్రాచీన ఈజిప్టు ( Egypt ) సమయానిది. ఆ సమయంలో మరణించిన వారికి తోడుగా సమాధిలో ఉంచేందుకు మనుషుల ఆకారంలో ఉన్న కొన్ని బొమ్మలను తయారు చేసేవారు. ఈ డమ్మీలు లేదా ఫిగర్ల వల్ల రెండు లాభాలు ఉండేవి. ఒకటి ఇవి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉండేవి. దీంతో పాటు మమ్మీలను (Egypt Mummies) తయారుచేసేందుకు ఇవి ఒక సాధనంగా పనికి వచ్చేవి.
15 వ శతాబ్దంలో…
15వ శతాబ్దం వచ్చేసరికి ఈ డమ్మీలను కుట్టిన బట్టలు ట్రై చేసేందుకు వాడటం మొదలుపెట్టారు టైలర్లు. మొదట్లో ఈ డమ్మీలను కలపతో లేదా వెదురుతో తయారు చేయగా టైలర్లు తమ బట్టలు కుట్టేందుకు ఉపయోగించుకునేవారు.
19 వ శతాబ్దంలో…| During 19th Century
19వ శతాబ్దంలో మేనిక్వీన్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. డిపార్ట్‌మెంట్ స్టోర్లు (Department Stores) ఈ డమ్మీలను వినియోగించడం మొదలుపెట్టాయి. చూడంగానే ఆకట్టకునేలా ఉన్న ఈ బొమ్మలు వేగంగా పాపులర్ అయ్యాయి. కొత్త తరం ఫ్యాషన్‌ను పరిచయం చేసేందుకు నేటికీ ఈ డమ్మీలను వాడుతున్నారు. అయితే 19వ శతాబ్దంలో గ్లాస్ కళ్లున్న, చూడ్డానికి అచ్చం మనుషుల్లా ఉన్న ముఖకవళికలతో, సరైన శరీరాకృతితో ఉన్న మేనిక్వీన్స్ దర్శనం ఇవ్వడం ప్రారంభించాయి. మొత్తానికి ఇవి ఒక సైలెంట్ మోడల్స్‌లా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నాయి.
ప్రపంచ యుద్ధం తరువాత…| After World Wars

20వ శతాబ్దంలో ఈ మేనిక్వీన్లు మరింత అందంగా, బోల్డ్‌గా మారాయి. వీటిని తయారు చేసేందుకు వాడే పదార్థాలు, తయారీ విధానంలో మార్పుల వల్ల 1940 ఆ సమయంలో ప్లాస్టిక్ డమ్మీలు రావడం మొదలయ్యాయి. ఇవి వెదురు లేదా ప్లాస్టర్ కన్నా ఎక్కువ కాలం మన్నికగా ఉండేవి. ప్రపంచ యుద్ధాల అనంతరం ప్రపంచంతో పాటు ఈ డమ్మీలు కూడా మారిపోయాయి. వీటిని వినియోగించే విధానం కూడా మారిపోయింది. నేడు కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాల కోసం వీటిని వినియోగిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయాలు | Facts About Mannequins
- మేనిక్విన్స్ అనేవి కేవలం బట్టలను, బంగారాన్ని చూపించే బొమ్మ మాత్రమే కాదు అది ఒక ఆర్ట్ కూడా.
- మేనిక్వీన్ కూర్చునే విధానం, భంగిమలు, ఇవన్నీ కూడా వినియోగదారుల మనసును ప్రభావితం చేస్తాయట.
- 3డీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడం వల్ల ఇప్పుడు ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా నచ్చిన స్టైల్లలో వీటిని తయారు చేసుకోగలరు.
- చాలా మంది తాము మేనిక్వీన్‌ను చూసినప్పుడు ఏదో తెలియని విచిత్రమైన అనుభూతికి లోనయ్యామని చెబుతారు. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని కూడా కొంత మంది చెబుతుంటారు. చాలా మంది భయపడతారు కూడా.
- మేనిక్వీన్స్‌పై కొన్ని మూవీస్ కూడా వచ్చాయి.
- ఇది కూడా చదవండి : CIBIL Score : పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి వద్దన్న వధువు…ఇక లోనూ రాదూ పిల్ల కూడా దొరకదు !
స్టోర్లలో సైలెంట్‌గా కనిపించే ఈ డమ్మీలకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది అని ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నో రాజ్యాలను, సామాజిక ఉద్యామాలను, సమాజా ఆటుపోట్లను చూస్తూ నాటికీ నేటికీ మౌనంగా ఉన్నాయి ఇవి. అందుకే వీటిని డమ్మీలు అంటారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.