Rumali Roti : ఎక్కువగా ఉత్తర భారత దేశంలో ప్రజలు రుమాలీ రోటీని ఆరగిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో ఈ రోటీ దర్శనం ఇస్తుంటుంది. అయితే ఈ రుమాలీ రోటీ ప్రయాణం ఎలా మొదలైంది అని ఎప్పుడైనా ఆలోచించారా ?. దీని చరిత్ర ఏంటి, దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా…
Table of Contents
భారతదేశంలో ఎన్నో రకాల వంటకాలు భోజన ప్రియుల నాలుకను లపలపలాడిస్తున్నాయి. అందులో రుమాలీ రోటీ కూడా ఒకటి. దీనిని కొంత మంది చేతి రుమాలు రోటీ (Handkerchief Bread) అని కూడా పిలుస్తుంటారు. ఎక్కువగా ఉత్తర భారత దేశంలో ప్రజలు రుమాలీ రోటీని ఆరగిస్తుంటారు.
మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో ఈ సన్నని, తెల్లని, మెత్తని రోటీ దర్శనం ఇస్తుంటుంది. అయితే ఈ రుమాలీ రోటీ ప్రయాణం ఎలా మొదలైంది అని ఎప్పుడైనా ఆలోచించారా ?. దీని చరిత్ర ఏంటి, దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా…
మొఘలుల కాలం నాటిది | Mughal Era Cuisine

రుమాలీ రోటీ అనేది మొఘలుల కాలం నుంచి భారత దేశంలో విరివిగా భోజనంలో భాగం అవుతూ వస్తోంది. ఆనాటి షాహీ వంటగదుల్లో (Shahi Kitchen) వంటలు చేసే వాళ్లు అనేక ప్రయోగాలు చేసే వారు. రాజులకు కొత్తరుచులను పరిచయం చేసి మెప్పు పొందడానికి ప్రయత్నించేవారు. అందులో భాగంగానే కబాబ్స్ (Kebabs) కు చుట్టేందుకు సులువుగా తయారయ్యే, వేగంగా జీర్ణం అయ్యే, తేలికగా ఉండే పిండితో తయారు అయ్యే ఈ రుమాలీ రోటీలను తయారు చేసేవారు.
మెయిన్ డిష్ రుచిని డామినేట్ చేయకుండా రుచిని పెంచేలా ఉండేలా ఒక రోటీని తయారు చేయాలనే ఆలోచన లోెంచి పుట్టింది రుమాలీ రోటీ. వంటల్లో నూనె ఎక్కువ అయితే రుమాలీ రోటీ ముక్కతో వాటిని తొలగించేవారట.
- నాటి నుంచి నేటి వరకు రుమాలీ రోటీ ఆకారం అనేది అలాగే ఉంది. అయితే కొన్ని చోట్ల చేతి రుమాలు సైజులో ఈ రోటీని చేస్తే మరికొన్ని చోట్ల టవల్ సైజలో వీటిని చేస్తుంటారు.
- ఎలా చేసినా వీటిని మడతపెట్టి ముక్కలగా కట్ చేసి సర్వ్ చేస్తారు.
- రుమాలీ రోటీ తయారీలో తవ్వా (పెద్ద గిన్నె) కీలక పాత్ర పోషిస్తుంది. నేటికీ చాలా మంది ఛెఫ్స్ ఈ టెక్నిక్‌తోనే రుమాలీ రోటీ తయారు చేస్తుంటారు.
రుమాలీ రోటీకి అంత క్రేజ్ ఎందుకు ? | Why Rumali Roti Is So Popular

ఎందుకంటే రుమాలీ రోటీ ఎలా తిన్నా దేంతో తిన్నా దాని రుచిని రెట్టింపు చేస్తుంది.
- కబాబ్ల నేస్తం : రుమాలీ రోటీని కబాబ్స్‌తో తినడం అనేది మొఘలుల కాలం నుంచీ వస్తోంది. ఇది ఎంత సన్నగా ఉంటుంది అంటే కబాబ్ సైజును ఇది పెంచకుండా దాన్ని అల్లేసుకుంటుంది. నోట్లోకి జారిపోతుంది. పొట్టలో సులువగా చేరిపోతుంది.
- ఏ కూర అయినా సరే : కర్రీ ఏదైనా సరే దాని రుచిని రెట్టింపు చేస్తూ మంచి కాంబినేషనేషన్ అవుతుంది రుమాలీ రోటీ.
- రాప్ అంఢ్ రోల్ : రోల్స్, రాప్ చేసే ఫుడ్‌లో రుమాలీ రోటీ విరివిగా ఉపయోగిస్తారు. రుమాలీ రోటీలో పనీరు, కూరగాయలు ఇలా నచ్చిన స్టఫ్ వేసి రోల్ చేసి ఇచ్చేస్తారు.
ఆసక్తికరమైన విషయాలు | Facts About Rumali Roti

మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఈసారి రుమాలీ రోటీ ఆరగిస్తుంటే ఈ విషయాలు వారితో షేర్ చేసుకోండి. మిమ్మల్ని ఫుడ్ ఎక్స్‌పర్ట్ అని పిలవడం మొదలుపెడి మాత్రం మమ్మల్ని ఏమనొద్దు మరి. రుమాలీ రోటీ గురించి ఆసక్తికరమైన విషయాలు
- వంట విధానం : అన్ని వంటకాలను పాత్రలోపల వండితే రుమాలీ రోటీ కోసం పాత్రను తిరగేస్తారు. ఈ పాత్రను తవ్వా (Tawa) అంటారు. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇలా తిరగేసిన పాత్రలో చేయం వల్లే రోటీ అంత రుచికరమంగా సిద్ధం అవుతుదింది.
- పిండే ప్రధానం : రుమాలీ రోటీని గోదుమ పిండి, మైదా పిండిని కలిపి తయారు చేస్తారు. ఇందులో ఉప్పు, నీరు కలిపుతారు.
- వంటవాళ్లు కాదు కళాకారులు : రుమాలీ రోటి చేయడం అనేది ఒక ఆర్ట్. గాళ్లో తిప్పుతూ పిండిని సాగదీయం అనేది మామూలు విషయం కాదు.అందుకే వీరిని వంటవాళ్లుగా చూడకుండా కళాకారులుగా చూడాలి.
- గాల్లో ఎగరేయడం : రుమాలీ రోటీ పిండిని చేేతుల్లోకి తీసుకుని దాన్ని తిప్పుతూ కొన్ని సార్లు గాల్లోకి కూడా ఎగరేస్తారు. అది మళ్లీ వంట మాస్టర్ చేతిలోకి రాగానే మళ్లీ అతను దాన్ని సాగదీసే పనిలో ఉంటాడు.
- షోరూమ్స్‌లో పెట్టే మనిషిని పోలిన బొమ్మల కథ ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?
రుమాలీ రోటీ చేసే కళ | The Art of Making Rumali Roti

రుమాలీ రోటీ చేయడానికి నైపుణ్యం, ఓపికా రెండూ కావాలి. దీని కోసం ముందు గోధుమ పిండిని, మైదా పిండిని కలిపి అందులో ఉప్పూ, నీరు పోయాల్సి ఉంటుంది. ఈ పిండిని కనీసం 15-20 నిమిషాలు కలపాల్సి ఉంటుంది. తరువాత కొన్ని గంటల పాటు అలాగే వదిలేస్తారు. ఈ సమయంలో పిండిలో గ్లూటెన్ ఏర్పడుతుంది.
రుమాలీ రోటీ చేయాలంటే | To make Rumali Roti, one must
- పిండిని స్ట్రెచ్ చేయాలి : బాగా కలిపి కొన్ని గంటల పాటు వదిలేసిన పిండిని చిన్న చిన్న ముక్కులగా రౌండ్ బాల్స్‌లా చేసుకోవాలి. తరువాత వాటిని చేతితో సాగుదీస్తూ గాల్లో ఎగురవేయాలి.
- రోటీ బాగా సాగిన తరువాత దాన్ని వేడి వేడి తవ్వాపై వేయాలి. రోటీ నుంచి బుడగలు వచ్చిన వెంటనే దాన్ని తీసేయాలి.
- లాస్ట్ పంచ్ : రోటీ రెడీ అవ్వగానే దానిని సరిగ్గా మడతపెట్టాలి. మనం కర్చీప్ ఎలా మడతపెడతామో అలాగ అన్నమాట. చిన్నసైజు అయితే అలాగే వేడివేడిగా సెర్వ్ చేయాలి. పెద్ద సైజు అయితే మాత్ర వాటిని కట్ చేసి సర్వ్ చేయాల్సి ఉంటుంది.
పోషక విలువలు | Benefits of Rumali Roti

రుమాలీ రోటీ వల్ల కడుపు సంతోషంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా పలు లాభాలు కూడా ఉన్నాయి. అయితే మైదా పిండి ఎక్కువ కాకుండా గోధుమ పిండి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
- ఫైబర్ అధికం : గోధుమ పిండితో తయారు చేసే రుమాలీ రోటీలో ఫైబర్ ( Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- కొవ్వు తక్కువ : నెయ్యి లేకుండా లేదా తక్కువ నూనెతో తయారు చేసినప్పుడు మిగితా రోటీల కన్నా తక్కువ ఫ్యాట్ ఇందులో ఉంటుంది.
- జోడి నెం.1 : రుమాలీ రోటీ అనేది దేనితో అయినా సెట్ అయ్యే డిష్. అందుకే దీనిని ఫంక్షన్స్‌తో తప్పుకుండా పెడుతుంటారు. దీనిని ఆల్ రౌండర్ రోటీ అని కూడా అనొచ్చు మనం.
- చాలా స్పెషల్ : రుమాలీ రోటీకి భారతీయ వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఏ వేడుకలో అయినా రుమాలీ రోటీ అటెండెన్స్ తప్పకుండా ఉండాల్సిందే .
రుమాలీ రోటీ అనేది ఒక రోటీ మాత్రమే కాదు. ఇది భారతీయు ఆహార వారసత్వం కూడా. దీని రంగు, రుచి ప్రతీ డిష్‌తో సర్దుకుపోయే దీని నైజం అందరికీ దీనిని చేరువ చేసింది. రాజుగారి కిచెన్ నుంచి మన ధాభాల వరకు కూడా దీనిదే రాజ్యం అని చెప్పవచ్చు. దీనిని స్పైసీ కర్రీతో తినవచ్చు, లేదంటే రోల్ చేసి మధ్యలో స్టఫ్ వేసి ఆరగించవచ్చు.
భారత్‌తో పాటు …
రుమాలీ రోటీ అనేది కేవలం భారత దేశంలోనే కాదు పాకిస్తాన్‌లో కూడా బాగా ఫేమస్. అక్కడ ఈ రోటీని మందా రోటి (Manda Roti) అని కూడా పిలుస్తుంటారు. రుమాలీ రోటీలో పాలు, నెయ్యి కలపడం అనేది మన దేశంతో పాటు దాయాది దేశంలో కూడా చేస్తుంటారు. భారత దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రోటీని (Veechu Roti) , మండిగే (Mandige) అని కూడా పిలుస్తుంటారు.
పాకిస్తాన్‌లో రుమాలీ రోటీలను చాలా పెద్ద సైజులో కూడా చేస్తుంటారు. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.
Watu wa chapati wakae kando.
— Mohammed Hersi : Mr Optimist (@mohammedhersi) November 30, 2020
Chapati technicians please give way for Rumali roti expert. Skills on another level and dont bring your hygiene debate . They've done this for centuries. pic.twitter.com/wycA3YHLy2
మీరు కూడా రుమాలీ రోటీ చేయాలి అనుకుంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇతను చాలా సులువుగా రుమాలీ రోటీ తయారు చేసే విధానాన్ని వర్ణించాడు.