తెలుగుకుర్రకారు గుండెల్ని హోల్ సేల్‌గా కొల్లగొడుతున్న బ్యూటీ యుక్తీ తరేజా ( Yukti Thareja ). మోడల్‌గా, నటిగా ఇలా పలు రంగాల్లో రాణిస్తున్న ఈ చిన్నది తక్కువ కాలంలోనే మంచి అవకాశాలను సంపాదించుకుంది.
ఇటీవలే కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ) మూవీ లాంచ్ రోజు మెరిసిన ఈ క్యూటీ గతంలో కూడా ఒక తెలుగు సినిమా చేసిన విషయం మీకు తెలుసా ? ఇలాంటి 10 ఆసక్తికరమైన విషయాలు మీ కోసం
Table of Contents
బాల్యం, విద్యాభ్యాసం

యుక్తీ తరేజా 2000 సంవత్సరం జనవరి 6వ తేదీన హరియాణాలోని కర్నాల్‌లో జన్మించింది. ఢిల్లీలోని శ్రీ గురు గోబింబ్ సింగ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది..
ఫ్రెష్ ఫేస్

యుక్తీ తన మోడలింగ్ కెరీయర్‌ను 2017లో జరిగిన ఓప్పో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 2017 తో ప్రారంభించింది.
ఎంటీవీ సూపర్ మోడల్

2019 లో ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్లో (MTV Supermodel of the Year ) కనిపించడంతో యుక్తి పాపులారిటీ అమాంతం పెరిగింది. ఈ పోటీలో తను 4వ స్థానాన్ని పొందింది.
సంగీతంలో సెన్సేషన్

ఇమ్రాన్ హాష్మితో టీసీరిస్ నిర్మించిన “లుట్ గయే” (Lut Gaye ) పాటలో కనిపించి నటిగా మరో ఎత్తు ఎదిగింది యుక్తి. ఈ పాటను ప్రముఖ సింగర్ జుబిన్ నౌటియాల్ పాడగా య్యూ ట్యూబ్‌లో 140 కోట్ల వ్యూస్ వచ్చాయి.
టాలీవుడ్లో ఎంట్రీ | Yukti Thareja Tollywood First Movie

2023 లో నాగ శౌర్య నటించిన రంగబలి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యుక్తి.
మలయాళంలో

2024 లో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది.
మల్టీ ట్యాలెంట్

మోడలింగ్ యాక్టింగ్‌తో పాటు యుక్తి మంచి డ్యాన్సర్ కూడా. అంతే కాకుండా ఏదైనా టాస్కు ఇస్తే ప్రపంచాన్ని మర్చిపోయి దాన్ని పూర్తి చేస్తుంది. ఇవే ఇప్పుడు యుక్తిని హీరోయిన్ రేసులో ముందు ఉంచుతున్నాయి.
ఇంట్లో వాళ్లు వద్దన్నారు…

మోడలింగ్ రంగంలోకి వెళ్తాను అని యుక్తి చెప్పినప్పుడు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదట. కానీ వాళ్లను ఒప్పించడానికి తల్లిదండ్రులను షూటింగ్ జరిగే ప్రాంతానికి తీసుకెళ్లేదట. కొంత కాలం తరువాత తల్లిదండ్రులు ఆమెను ఇక ప్రశ్నించడం ఆపేశారట.
హాబీస్ | Yukti Thareja Hobbies

యుక్తి తరేజాకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టమట.
కరెంట్ ప్రాజెక్టులు | Yukti Thareja Current Projects

ప్రస్తుతం యుక్తీ కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇందులో కిరణ్ అబ్బవరం మూవీ ఒకటి , దీంతో పాటు కన్నడలో కూడా ఒక చిత్రంలో బిజీగా ఉంది యుక్తి.వయసు, ఎత్తు :
క్విక్ ఫాక్ట్స్ | Quick Facts
- వయసు : 25 సం ( Years )
- హైట్ : 5.6 Fts
- ఫేవరిట్ ఫుడ్ | పిజ్జా, గార్లిక్ బ్రెడ్, బర్గర్
- ఫేవరిట్ నటుడు : రణ్‌బీర్ కపూర్ః
- ఫేవరిట్ ట్రావెల్ స్పాట్ : ప్యారిస్
ఫ్రెష్ ఫేస్ మోడలింగ్ నుంచి నటిగా బిజీ అవడం వరకు యుక్తీ తరేజా ప్రయాణం అనేది చాలా మంది బడ్డింగ్ నటీనటులుకు ప్రేరణగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. తన ట్యాలెంట్, కష్టపడి పని చేసే తత్వం ఇవన్నీ తనను భవిష్యత్తులో అద్భుతమైన విజయాలను చేకూర్చుతాయని ఆశిద్దాం.
ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.