2025 ఫిబ్రవరి నుంచి ఫాస్ట్యాగ్ కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇక ఆట కాస్త సీరియస్ అవనుంది. ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్, ఎకౌంట్ నిర్వహణలో లోపాలు (FASTag New Rules) ఉంటే మీరు రిస్కులో ఉన్నట్టే అని వార్తలు వస్తున్నాయి.
భారత దేశంలో టోల్ పేమెంట్ విధానంలో ఫాస్ట్‌ట్యాగ్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. హైవేలో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది. అయితే 2025 ఫిబ్రవరి 17 నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. వీటి గురించి ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు (FASTag Users Tips) తప్పుకుండా తెలుసుకోవాలి. లేదంటే పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మార్పులను నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అమలు చేయనుంది. దీని వల్ల పేమెంట్ ఫెయిల్యూర్ అనేది తగ్గడంతో పాటు వ్యవస్థలో సానుకూల మార్పులు వస్తాయని ఇలా చేస్తోంది. ఎందుకంటే ఫాస్టాగ్ పేమెంట్ ఫెయిల్యూర్ (FASTag Payment Failure) అనేది చాలా పెద్ద తలనొప్పిగా మారింది. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలను ఇక్కడ అందిస్తున్నాం. ఒక్కొక్కటిగా చదువుకోండి. మీ సర్కిల్లో షేర్ చేయండి.
Table of Contents
ఫిబ్రవరి 17 న జరిగే మార్పులు ఏంటి ? | FASTag Changes from Feb 17
ఫాస్ట్‌ట్యాగ్ రూల్స్ అనేవి బ్యాలెన్స్ వాలిడేషన్ ప్రోటోకాల్ ప్రకారం నడుస్తాయి. 2025 జనవరి 28న ఎన్సీపీఐ విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం ఇకపై బ్లాక్‌లిస్టులో ఉన్న లేదాక తక్కువ బ్యాలెన్స్ ఉన్న కఠిన చర్యలు తీసుకునేలా సిస్టమ్ పని చేస్తుంది.
ముఖ్యమైన మార్పులు | FASTag Key Changes:
ముఖ్యమైన మార్పు విషయానికి వస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులో ఉంటే లో-బ్యాలెన్స్ ( Low Balance On FASTag) ఉన్నా, టోల్ ప్లాజాకు చేరుకునే 60 నిమిషాల కన్నా ముందు హాట్ లిస్టులో ఉన్నా, లేదా టోల్ ప్లాజాకు చేరుకున్నాక 10 నిమిషాల్లోపు స్టేటస్ మారకున్నా మీరు మీరు టోల్ ప్లాజా చేరుకున్న తరువాత మీ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది.
దీని వల్ల యూజర్లపై పడే ప్రభావం ఏంటి ?
How Will This Impact FASTag Users?: ఈ మార్పులు అనేవి మీరు మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను ఎలా నిర్వహిస్తున్నారో అనే విషయంపై బాగా ప్రభావం చూపిస్తుంది. గతంలో కొంత మంది యూజర్లు టోల్ ప్లాజా వద్ద చివరి నిమిషంలో రీచార్జ్ చేసుకుని పని కానిచ్చేవారు.
- కానీ కొత్త రూల్స్ అమలులోకి వచ్చాక ఆ వ్యూహం ఇక పనికి రాదు.
- లో బ్యాలెన్స్ (తక్కువ బ్యాలెన్స్) లేదా ఇతర కారణాల వల్ల మీ ఖాతాలో ఫ్లాగ్ వస్తే మీరు లాస్ట్ మినిట్ రీచార్జ్ చేసుకుని నడిపించే అవకాశం కూడా కోల్పోతారు.
- Rumali Roti : రాజులు చేయి తుడుచుకునే రుమాలి రోటి చరిత్ర ఏంటి ? దీనిని ఎలా తయారు చేస్తారు ?
ఎందుకిలా ? : ఎందుకంటే కొత్త వ్యవస్థలో ఇకపై ఫాస్ట్‌ట్యాగ్‌లో ఉన్న సమస్యలు తీరినాక అది కూలింగ్ ఆఫ్ లేదా అప్డేట్ అవ్వడానికి సమయం పడుతుంది. టోల్ ప్లాజాకు వెళ్లే 60 నిమిషాల ముందు వరకు ఎలాంటి సమస్య లేకుంటే ఒకే. టోల్ ప్లాజాకు వెళ్లాక 10 నిమిషాల వరకు కూడా సమస్య సాల్వ్ అవ్వకుంటే ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది.
మొత్తానికి మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. బ్యాలెన్స్ తగ్గకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా బంగారంలా చూసుకోండి. లేదంటే పెనాల్టీలు తప్పవు.
బ్లాక్ లిస్ట్ , హాట్‌లిస్ట్ అయిన ఫాస్ట్‌ట్యాగ్స్ పరిస్థితి ?
Hotlisted and Blacklisted FASTags: దీనిని మీరు బాగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. లేదంటే ఇబ్బందులు తప్పవు.
- బ్లాక్‌లిస్టెడ్ ఫాస్ట్‌ట్యాగ్ | Blacklisted FASTag : అంటే ఇది ప్రస్తుతం డియాక్టివేట్ అయి ఉంది అని అర్థం. ఇలా డియాక్టివేట్ అవ్వడానికి ప్రధాన కారణాలు వచ్చేసి..
- లింక్ చేసిన ఖాతాలో సరైన బ్యాలెన్స్ లేకపోవడం
- కేవైసీ (Know Your Customer) డాక్యుమెంట్స్ చివరి తేదీ అయిపోవడం.
- వాహనానికి సంబంధించిన ఏదైనా చట్టపరమైన సమస్య ఉండటం
ఒక బ్లాక్‌లిస్ట్ అయిన ఫాస్ట్‌ట్యాగ్‌ను సంబంధిత సమస్యలు పూర్తికానంత వరకు కూడా వినియోగించడానికి అవకాశం ఉండదు. బ్లాక్ లిస్టు అయితే ముందరికాళ్లకు బంధం పడినట్టే.
2. హాట్లిస్టెడ్ ఫాస్ట్‌ట్యాగ్ | Hotlisted FASTag:
హాట్లిస్టు అయిన ఫాస్ట్‌ట్యాగ్ అంటే ఏంటో, అసలు దాని అర్థం ఏంటో పూర్తిగా తెలియదు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను కొంత కాలం వరకు సస్పెండ్ చేయడం మాత్రం ఇందులోకి వస్తుంది అని తెలుసు.
- టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లే సమయానికి సరైన బ్యాలెన్స్ లేకపోవడం
- లేదా ఈమధ్య ఏదైనా మోసపూరితమైన పనులు చేసినా ఖాతాను ఇలా సస్పెండ్ చేస్తారు.
మీ ఫాస్ట్‌ట్యాగ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి ? | Check Your FASTag Status
మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీని కోసం మీరు ఈ స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది.
- ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్ పోర్టల్ : మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా పరిస్థితి తెలుకునే సులభమైన విధానం ఏంటంటే కస్టమర్ పోర్టల్‌ను ఆన్లైన్లో లేదా మొబైల్ యాప్‌లో చెక్ చేయడం
- ఎన్పీసీఐ పోర్టల్ : మీరు ఎప్పీసీఐ పోర్టల్‌లో కూడా చెక్ చేయవచ్చు. మీ కార్డు బ్లాక్ అయిందా, యాక్టివ్‌గా లేదా అనేది తెలుసుకోవచ్చు.
- మీ మొబైల్ నెంబర్ అనేది ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాతో లింక్ అయ్యేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల బ్యాలెన్స్ తగ్గినా లేదా ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే మీకు ముందే తెలుస్తుంది.
ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా అన్‌బ్లాక్ చేయడం ఎలా ?
How To Unblock a Blacklisted FASTag : మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా బ్లాక్‌లిస్టెడ్ అయి ఉంటే దానిని ఇలా అన్ బ్లాక్ చేసుకోవచ్చు. దీని కోసం ఈ ప్రాసెస్‌ను స్టెప్ బై స్టెప్ పాటించండి.
- రీచార్జ్ : మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలో సరైన బ్యాలెన్స్‌ను మెయింటేన్ చేయండి. దీనిని మినిమం బ్యాలెన్స్ వరకు తీసుకెళ్లండి.
- వెరిఫై చేయండి : మీరు చేసిన రీచార్జ్ మీ ఖాతాలో కనిపిస్తుందో లేదో చూడండి. అంటే అకౌంట్లో మార్పు ఉందో లేదో చెక్ చేయండి.
వెయిట్ చేయండి : కొన్ని నిమిషాల పాటు వెయిట్ చేయండి. సిస్టమ్ అప్డేట్ అయిన తరువాత మళ్లీ మీ ఖాతాను మీరు యాక్టివేల్ చేయగలరు.
త్వరగా సిద్ధం అవ్వండి | FASTag New Rules
కొత్త ఫాస్ట్‌ట్యాగ్ అనేవి 2025 ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అమలు కానున్నాయి. అందుకే మీరు ఇక ఆలస్యం చేయకుండా మీ ఖాతా పరిస్థితి ఏంటో చెక్ చేయండి. లేదంటే మీ పెనాల్టీ, సేవలో జాప్యం వంటివి జరగే అవకాశం ఉంది.
- మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి.
- కేవైసీ డాక్యుమెంట్స్ అప్డేట్ అయ్యాయో లేదో చూడండి.
- కొంచెం ప్లాన్ చేసుకుని ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేేకుండా మీరు మీ ప్రయాణాన్ని ప్రశాంతంగా పూర్తి చేయగలరు.
ఫాస్ట్‌ట్యాగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు | FACTs About FASTag

హైవేపై ప్రయాణించే వారి జీవితంలో ఫాస్ట్‌ట్యాగ్ ఒక భాగం అయిపోయింది. టోల్ పేమెంట్ (Toll Payments) విధానాన్ని వేగవంతం చేసి వాహనాల రద్దీనీ తగ్గించంలో ఇది బాగా ఉపయోపడింది (FASTag New Rules) . ఈ విధానం గురించి ఆసక్తికరమైన విషయాలు…
- ఆర్ఎఫ్ఐడీ | RFID Technology: ఫాస్ట్‌ట్యాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికతను వినియోగించి పని చేస్తుంది. ఒక వాహనం టోల్ ప్లాజా నుంచి వెళ్లగానే లింకు అయిన ప్రీపెయిడ్ ఖాతా నుంచి ఇది ఆటోమెటిక్‌గా టోల్ ట్యాక్సును కట్ చేస్తుంది. ఈ డివైజ్ వాహనం విండ్‌స్క్రీన్‌ను గుర్తిస్తుంది.
- ఆగే అవసరం లేకుండా : ఫాస్ట్‌ట్యాగ్ వల్ల వాహనాలు అసలు ఆగకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ తగ్గుతుంది. ఒకప్పుడు టోల్‌ప్లాజా వద్ద యావరేజ్‌గా 8 నిమిషాల పాటు వాహనాలు ఆగేవి. కానీ నేడు కేవలం 45 సెకన్లలోనే పని అయిపోతుంది.
- జాతీయ వ్యాప్తంగా : 2021 ఫిబ్రవరి నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలో ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అయింది. 2023 నవంబర్ నాటికి 7.98 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేశారు.
- ఎన్హెచ్ఏఐ నిర్వహణలో : ఫాస్ట్‌ట్యాగ్‌ను నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా (National Highway Authority Of India) నిర్వహిస్తుంది. ఈ సిస్టమ్ అనేది నేషనల్ ఎలాక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) కార్యక్రమంలో భాగంగా నడుస్తుంది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆప్ ఇండియా ప్రారంభించింది.
- ఇది కూడా చదవండి : షోరూమ్స్‌లో పెట్టే మనిషిని పోలిన బొమ్మల కథ ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?
- ఎలాగైనా, ఎక్కడైనా : ఫాస్ట్‌ట్యాగ్‌ను మీరు అధికారికంగా ట్యాగ్ జారీ చేసే వారి నుంచి కొనుగోలు చేయవచ్చు. లేదంటే బ్యాంకుల నుంచి కూడా తీసుకోవచ్చు. ఆపరేటర్‌తో సంబంధం లేకుండా దీనిని మీరు ఏ టోల్ ప్లాజాలో అయినా వినియోగించుకోవచ్చు.
- అన్లిమిటెడ్ వ్యాలిడిటీ: ఎన్హెచ్ఏఐ ప్రకారం ఫాస్ట్ట్యాగ్స్కు అన్లిమిటెడ్ వ్యాలిడిటీ ఉంటుంది. అయితే మధ్యలో డియాక్టివేషన్ లాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మాత్రం మధ్య కేవైసీ సమాచారం అప్డేటెడ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి.
- బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్ : ఫాస్ట్‌ట్యాగ్ వచ్చిన తరువాత టోల్ ప్లాజాల కలెక్షన్లు భారీగా పెరిగాయి. 20232-24 లో భారత దేశ వ్యాప్తంగా రూ.64.809.86 కోట్ల టోల్ కలెక్షన్ జరిగింది. గతంతో పోల్చితే 34.9 శాతం ఎక్కువ కలెక్షన్ వచ్చింది.
- పర్యావరణ లాభాలు : టోల్ ప్లాజా వద్ద క్యూలు, రద్దీ తగ్గించడం వల్ల ఫాస్ట్‌ట్యాగ్ పర్యావరణానికి ఎంతో లాభాన్ని కలిగిస్తోంది. సంవత్సరానికి సుమారు 463 మిలియన్ల వాహన సమయం ఆదా అవుతోంది. ఆర్థిక భాషలో చెప్పాలంటే రూ.34,000 వేల కోట్ల విలువ చేసే సమయం మిగులుతోంది దేశానికి. టైమ్ ఈజ్ మనీ అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థం అయింది.
Update On 2025 February 19
కొత్తగా అమలులోకి వచ్చిన రూల్స్‌పై తాజాగా నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. ఈ కొత్త సర్య్కూలర్ అనేది బ్యాంకు, ఫాస్ట్‌ట్యాగ్ స్టేషస్ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికే అని తెలిపింది. అలాగే తమ యూపీఐ బ్యాంకు ఖాతాతో ఫాస్ట్‌ట్యాగ్‌ను లింక్ చేయమని చెబుతోంది ఎన్హెచ్ఏఐ (NHAI).
ఈ కొత్త నియమాలు అనేవి జాతీయ రహాదారిపై ఉన్న టోల్ ప్లాజాలకు వర్తించవని తెలిపింది.
పూర్తివివరాల కోసం ఎన్హెచ్ఏఐ వెబ్సైట్లో అందించిన వివరాలు చదవండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Very useful information. Thank u
thank You