తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనానికి కేంద్ర బింధువుగా మారాడు దర్శకుడు అనిల్ రావిపూడి ( Anil Ravipudi ). చేసిన అన్ని సినిమాలు హిట్ అవడంతో నిర్మాతల పాలిట గోల్డెన్ స్పారోగా మారాడు. అనిల్ నిర్మించే సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ నచ్చి ప్రేక్షకులు అతడి మూవీస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. తన ప్రతీ సినిమాను హిట్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు అనిల్.
Table of Contents
అనిల్ జర్నీ | Anil Ravipudi Film Journey
పటాస్ చిత్రంలో ప్రారంభమైన అనిల్ రావిపూడి విజయ పరంపర నేటికీ కొనసాగుతోంది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు అనిల్. ఈ మూవీ సంక్రాంతి విన్నర్ అవడంతో పాటు రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. విక్టరీ వెంకటేష్, ఐశ్యర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ చాలా కాలం తరువాత ప్రేక్షకులు థయేటర్‌కి క్యూ కట్టేలా చేసింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికన్ మార్కెట్‌లో కూడా 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. అనిల్ రావిపూడి సినీ ప్రస్థానంలో మిలియన్ డాలర్లు సంపాదించిన 5వ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఈ మూవీకి ముందు ఎప్ 3, భగవంత్ కేసరి, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 2 చిత్రాలు ఈ ఫీట్ సాధించాయి.
తన సినిమాల్లో కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ ఉండేలా చూసుకునే అనిల్ వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఇదే ఫార్ములాతో సంక్రాంతికి వస్తున్నాం మూవీని కూడా హిట్ చేశాడు. ఇద్దరు భామల మధ్య నలిగే హీరో కథను ఫన్నీగా చూపించాడు అనిల్. చేసినవి 8 చిత్రాలు అందులో 8 కూడా హిట్టు సాధించాడు. అవి కూడా మామూలు హిట్స్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తన సత్తా చాటాడు అనిల్ రావిపూడి.
మొదటి బాల్‌కు సిక్సర్ | Anil Ravipudi Hit Story
అనిల్ సినిమాలు అన్ని కూడా అంతగా కాంప్లికేట్ కథలతో ఉండవు. చిన్న బడ్జెట్, పెద్ద హీరోలు, సింపుల్ కథలతో బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నాడు. అనిల్ జర్నీ విషయానికి వస్తే 2005లో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాడు అనిల్. పలు సినిమాలకు డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన అనిల్ 2008 లో శౌర్యం మూవీకి సహాయక దర్శకుడిగా పని చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. తరువాత కొన్ని సినిమాలకు సహాయక దర్శకుడిగా, రైటర్‌గా పని చేశాడు.
2015 అంటే సినీ పరిశ్రమలోకి ఎంటరైన పదేళ్లకు కళ్యాణ్ రామ్‌తో ( Kalyan Ram ) పటాస్ మూవీతో డైరక్టర్‌గా డెబ్యూ ఇచ్చాడు. పటాస్‌కు ముందు వరుస ఫ్లాపులు అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాడు.
అనంతరం సాయి ధరమ్ తేజ్‌తో ( Sai Dharam Tej ) సుప్రీం, మాస్ మహారాజ రవితేజతో రాజాది గ్రేట్, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ఎఫ్2, ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చేశాడు అనిల్. ఈ చిత్రాలు అన్నీ మంచి విజయాన్ని సాధించాయి. అనంతరం ఎఫ్2 సీక్వెల్‌గా డిఫరెంట్ కామెడీతో తెరకెక్కిన ఎఫ్ 3, బాలకృష్ణతో ( Nandamuri Balakrishna ) భగవంత్ కేసరి మూవీస్‌తో పాటు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అన్ని మూవీస్ కూడాహిట్ అయ్యాయి.
రాజమౌళి సరసన | Anil Ravipudi and SS Rajamouli
రాజమౌళి తరువాత ఓటమి ఎరుగని వీరుడిగా దూసుకెళ్తున్నాడు అనిల్ రావిపూడి. దర్శకుడిగానే కాదు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, అందరికీ లాభాలు తెచ్చిపెట్టడంలో సక్సెస్ అవుతున్నాడు . అనిల్ చేసిన ప్రతీ సినిమాప్రొడ్యూసర్ల జేబులు నిండాయి. వరుసగా 5 సార్లు 100 కోట్ల మార్కు దాటాడు అనిల్.
దీంతో పాటు నూటికి నూరు శాతం విజయాలతో జక్కన్న రాజమౌళి సరసన నిలిచాడు అనిల్. ఇక మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi ) నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు అనిల్. ఈ మూవీ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి.
ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.