Dr Kamini Singh : మునగచెట్టు కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా… సైంటిస్ట్ విజయగాథ!

ప్రభుత్వ ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది మునగచెట్టు కోసం సర్కారు కొలువు వదిలేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా ? అయితే మీరు డాక్టర్ కామిని సింగ్ (Dr Kamini Singh) కథ చదవాల్సిందే. ల్యాబులో కూర్చుని పనిచేయడం కన్నా డైరక్టుగా రైతులతో కలిసి పని చేద్దాం అనే ఒక ఆలోచనే తన జీవితాన్ని మార్చేసింది.

డాక్టర్ కామిని సింగ్ ఎవరు ? | Who Is Dr Kamini Singh?

ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) రాజధాని లఖనవులో వేలాది మంది మహిళలకు ప్రేరణగా నిలుస్తోంది డాక్టర్ కామినీ సింగ్. వ్యవసాయ రంగంలో ఆమె ఆలోచన ఇప్పుడు చాలా మందికి ఆసరాగా (Women Entrepreneur) మారింది. హార్టికల్చర్‌లో పీహెచ్‌‌డీ చేశారు డాక్టర్ కామిని. పరిశోధకురాలిగా ప్రభుత్వ కొలువు ఉన్నా అది వదిలేసి వ్యవసాయ రంగంలో వ్యాపారవేత్తగా మారి డా. మొరింగా (Dr Moringa) ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి విజయవంతంగా నడుపుతోంది తను. తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి తాజా ఉదాహరణ డాక్టర్ కామిని.

మార్పు కోసం తపనతో మొదలైన కథ

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ (CISH) లో దాదాపు దశాబ్ద కాలం పాటు శాస్త్రీయ పరిశోధనలు చేసింది డాక్టర్ కామిని. హర్టికల్చర్ విభాగంలో తన పరిశోధనలు చాలా కీలకమైనవిగా ఉండేవి. అయితే తను చేసిన పరిశోధనలు రైతుల వరకు చేరడం లేదు అనే అసహనం ఆమెలో రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఒక పరిశోధనా పలితం ఎన్నో విభాగాలు దాటి బయటికి వచ్చే వరకు రైతులు నష్టపోవాల్సిందేనా అని తను బాధ పడేది. ఇక చాలు అనుకుని తను కొత్త దారిని ఎంచుకుంది.

ఏడేళ్లపాటు పరిశోధకురాలిగా (Scientist) తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించిన డాక్టర్ కామిని 2015 లో తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులతో కలిసి వారికి దగ్గరిగా ఉంటూ పని చేయాలని తను భావించింది. వ్యవసాయ రంగంలో (Agriculture) ఉన్న సమస్యలకు తన శాస్త్రీయ పరిఙ్ఞానంతో వేగంగా పరిష్కారాలు చూపించాలని భావించింది తను. అందుకే సర్కారీ నౌకరీ మానేయడానికి ఏ మాత్రం భయపడలేదు. బాధ పడలేదు డాక్టర్ కామిని సింగ్.

మునగచెట్టు అమూల్యం అని గుర్తించి…| Worth Of Moringa Tree

moringa
మునగకాయ

పరిశోధకురాలిగా ఉన్న సమయలో డా కామినికి మునగ చెట్టు గొప్పతనం ఏంటో అర్థం అయింది. దాని విలువేంటో తెలిసింది. దానిని ఆమె అద్భుతమైన చెట్టుగా భావించేవారు. ఈ చెట్టులో (Moringa Tree) ఉన్న అద్భుతమైన పోషల విలువలు, ఎలాంటి వాతావరణలో అయినా పెరిగే దాని సమర్జత, తక్కువ మెయింటెనెన్స్ వంటి పలు లక్షణాలు తనను ఆకట్టుుకున్నాయి. అందుకే తను రైతులకు ఈ పంటను చక్కని పంటగా పరిచయం చేద్దాం అనుకుంది. మరీ ముఖ్యంగా తక్కువ పరిమాణలో కమతాలు లేదా పొలం ఉన్న చిన్నాకారు రైతులకు ఇది బంగారంతో సమానం అని భావించింది తను.

100 చెట్లకు రూ.37 వేల పంట

సేంద్రీయ పద్ధతిలో (Organic Farming) వ్యవసాయం చేయడానికి అంతగా సుముఖత చూపని 10 మంది రైతులతో 2017లో తను ఒక పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించింది. రైతులకు అవసరమైన విషయాలు చెప్పి, వారికి అండగా నిలిచింది. మునగచెట్టు అనేది అంత ఖర్చుతో కూడుకున్న పంట కాదు అని, ప్రస్తుతం వారు చేస్తున్న వ్యవసాయ పద్ధతిలోనే దీన్ని కూడా పండించవచ్చు అని చెప్పి  ఒప్పించింది డాక్టర్ కామిని. 

దీంతో కొంత మంది రైతులు తమ భూముల్లో కంచెల వద్ద, పంట చివర్లో మునగాకు చెట్లను పెంచడం మొదలు పెట్టారు. దీని కోసం వారు కొత్తగా ఎలాంటి ఎరువులు (Fertilizer), పురుగుమందులు, ప్రత్యేకంగా నీటి సరఫరా చేసే అవసరం లేదు అని వారికి తెలిపింది. కొంత కాలం తరువాత ఫలితాలు కనిపించడం మొదలైంది. కేవలం 100 మునగ చెట్లతో ఒక్కో రైతు రూ.27,500 పంటను తీశాడట. ఈ ఆదాయం (Income from Moringa Tree) చూసి మునగచెట్ల సంఖ్యను పెంచడం మొదలు పెట్టారు రైతులు.

వ్యాపారంలోకి తొలి అడుగు | Foundation of Dr. Moringa Pvt Ltd

dr kamini singh
Dr Moringa

2019 లో తన చిరకాల కోరిక అయిన డాక్టర్ మొరింగా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించారు డాక్టర్ కామిని. ఈ సంస్థను ప్రారంభించేందుకు ఆమె రూ.9 లక్ష్లలు పెట్టుబడిగా పెట్టారు. ఈ సంస్థ ద్వారా తను మునగాకు పొడిని, వాటి సంబంధిత ఉత్పత్తులను తయారు చేయడం మొదలు పెట్టారు. డాక్టర్ మొరింగా అనే ఈ సంస్థ ఒకవైపు వినియోగదారులకు పోషక విలువలతో (Nutritional Values) ఉన్న ఉత్పత్తులను అందిస్తూనే మరో వైపు వ్యవసాయంలో రైతుల సమస్కలపై కూడా పని చేస్తుంది.

డా. మొరింగా స్థాపించిన తొలి ఏడాది ఆర్ఖికంగా అద్భుతమైన లాభాలు గడించింది. రూ.19 లక్షల లాభాలను సంపాదించింది. ఈ ఫలితాలను విశ్లేషించి ఇంకా విస్తరించే అవకాశం ఉంది అని తెలుసుకుంది డాక్టర్ కామిని. వెంటనే మునక్కాయతో తయారు అయ్యే ఆరోగ్య ఉత్పత్తులు, చిరుతిళ్లు, పర్సనల్ కేర్ ఉత్పత్తులను కూడా లాంచ్ చేసింది.

2020 లో భువనేశ్వర్‌లోని ఐఐటీలోని అగ్రిబిజినెస్ ఇన్‌క్యూబేటర్ అయిన ఆర్కేవీవై రఫ్తార్ (RKVY RAFTAAR) కామినికి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేసింది. ఈ డబ్బుతో తను కొత్త యంత్రాలను సమకూర్చుకుంది. ఉత్పత్తి వేగాన్ని పెంచుకుంది. మునగాకుతో తయారయ్యే మరిన్ని ఉత్పత్తులను లాంచ్ చేసింది. నొప్పుల నుంచి ఉపశమనం కల్పించే తైలం నుంచి హెల్త్ సప్లిమెంట్స్ వరకు, తలకు రాసుకునే నూనె నుంచి సిరమ్ వరకు ఎన్నో రాకల బ్రాండ్స్‌ను తను లాంచ్ చేసింది.

అటు లాభం..ఇటు రైతు క్షేమం

డాక్టర్ కామిని సింగ్ (Dr Kamini Singh) ప్రస్థానాన్ని ఆమె సాధించిన ఆర్థిక ప్రగతి కోణంలో మాత్రమే చూడలేము. రైతాంగాన్ని చైనత్య పరచడం, వారి పురోగతి కోసం ఆమె పడిన కష్టాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తను సంస్థ నుంచి 22 ఉత్పత్తులో మార్కెట్లో వినియోగదారులకు చేరుతున్నాయి. ఆరోగ్య రంగంలో తన బ్రాండ్ మంచి పేరు సంపాదించుకుంది. 

డాక్టర్ కామిని రైతులను కలిసి వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించే చిట్కాలు, పంటల గురించి తెలిపేది. ఈ ప్రయత్నం వల్ల 50 నుంచి 100 మంది రైతు జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయి. కేవలం మునగ చెట్టు మాత్రమే కాదు పసుపు(Turmeric), లెమన్‌గ్రాస్ (Lemon Grass), మామిడి (Mango) వంటి అనేక కమర్షియల్ పంటలవైపు రైతులను మరల్చగలిగింది. 

ఒకే పొలంలో వివిధ పంటలు ఉండటం వల్ల పలు ఆదాయ మార్గాలు ఉంటాయ తన వల్లే చాలా మంది రైతులు అర్థం చేసుకోగలిగారు. దీంతో పాటు రసాయనిక ఎరువులు తగ్గించి, సేంద్రీయ మార్గంలో (Organic Cultivation) పంటలు పండించడం వల్ల నేల కూడా ఆరోగ్యంగా (Healthy Soil) ఉంటుంది అని తను చెప్పి వారికి ప్రాక్టికల్‌గా ఫలితాలను చూపించింది తను.

మొత్తానికి 

డాక్టర్ కామిని (Dr Kamini Singh) ప్రయాణం అనేది శాస్త్రీయ పరిఙ్ఞానం (Scientific Knowledge) ఉంటే ఎలాంటి అద్భుతాల సాధింగలమో ప్రపంచానికి చాటి చెబుతోంది. తను కేవలం ఒక మంచి వ్యాపారాన్ని నిర్మించకోవడం మాత్రమే కాదు, చక్కని వ్యవసాయ పరిశోధనలతో స్థానిక రైతుల జీవితాలను కూడా మార్చింది. డాక్టర్ మొరింగా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ (Dr Moringa Pvt Ltd) ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని లఖనవులో పలు రిటేయిల్ ఔట్‌లెట్స్‌తో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు డాక్టర్ కామిని సాధిస్తుంది అని ఆశిద్దాం.

📣 ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment